breaking news
Prattipati Pull Rao
-
బినామీ డీలర్ల బియ్యం దందా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బినామీ రేషన్ డీలర్ల హవా కొనసాగుతోంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన రేషన్ డీలర్ల స్థానాలను భర్తీ చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులోనే 310 మంది బినామీ డీలర్లు ఉండడం గమనార్హం. బినామీ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిని తొలగించి, రెగ్యులర్ డీలర్లను నియమించాలని కలెక్టర్ల సదస్సులో పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి బి.రాజశేఖర్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బినామీలను పక్కనపెట్టి, రెగ్యులర్ డీలర్లను నియమించేందుకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల అనుచరులే బినామీ డీలర్ల అవతారం ఎత్తారు. సబ్సిడీ బియ్యం అక్రమ వ్యాపారంలో కొందరు తెలుగు తమ్ముళ్లకు నేరుగా భాగస్వామ్యం ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బినామీ డీలర్లు రేషన్ దుకాణాల్లోనే లబ్ధిదారుల నుండి సబ్సిడీ బియ్యాన్ని కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వ్యాపారులు ఆ బియ్యాన్ని పాలిష్ చేసి, అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో ఎవరికి దక్కాల్సిన వాటాలు వారికి దక్కుతున్నాయి. విదేశాలకు తరలుతున్న సబ్సిడీ బియ్యం రాష్ట్రంలో 1.44 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ప్రతినెలా రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు సరఫరా చేస్తోంది. ఇందులో ప్రతినెలా 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని బినామీ రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు సబ్సిడీ బియ్యానికి పాలిష్ చేసి, మళ్లీ మార్కెట్లోకి తెచ్చి కిలో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు సబ్సిడీ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా సబ్సిడీ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
అనావృష్టి నివారణకు వ్యవసాయ అభివృద్ధి నిధి
- 210 మంది జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ - రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు సాక్షి, అమరావతి: రాయలసీమలోని 4 జిల్లా లతోపాటు ప్రకాశం జిల్లాలో అనావృష్టిని నివారించేందుకు అంతర్జాతీయ స్థారుు వ్యవ సాయ అభివృద్ధి నిధి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,149 కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ ఎక్స్టర్నల్ ఎరుుడెడ్ ప్రాజెక్టుల కింద చేపట్టాలని నిర్ణరుుంచింది. మంగళ వారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటి వివరాలను మంత్రులు అచ్చెం నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గం ఇంకా ఏం నిర్ణయాలు తీసుకుందంటే.. ► డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ప్రైవేట్ కళాశాలలను గుర్తించడానికి విశ్వవిద్యాలయాల చట్టం-2007ను సవరించాలి. ఇందుకోసం త్వరలో ఆర్డినెన్స జారీ చేసేందుకు ఆమోదం. ► విజయవాడలో సిద్ధార్థ అకాడమీ ఆధీ నంలో ఉన్న శ్రీదుర్గామల్వేశ్వర స్వామి ఆల యానికి చెందిన 14.20 ఎకరాల లీజు ధర స్థిరీకరణకు ఆమోదం ► కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 1,93,147 ఇళ్లల్లో 1,20,106 ఇళ్లను ఏపీటీఎస్ఐడీసీఓతో, మిగిలిన ఇళ్లను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మించాలి. ఏపీటీఎస్ఐడీసీఓ చేపట్టే ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే వాటా రూ.1,800 కోట్లను వినియోగించాలి. మిగిలిన సొమ్మును హడ్కో నుంచి రుణంగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తన సబ్సిడీ వాటాగా రూ.1.50 కోట్లు కేటారుుంపు. ► రాష్ట్ర, జిల్లా, డివిజనల్, మున్సిపల్, మండల, పంచాయతీ స్థారుుల్లో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ మిషన్ల ఏర్పాటుకు ఆమోదం. మిషన్ ఛైర్మన్‌గా సీఎం, వైస్చైర్మన్లుగా పట్టణాభి వృద్ధి, పంచారుుతీరాజ్ శాఖల మంత్రులు. ► విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ సమీకరణ పథకం-2016 కింద వ్యక్తిగత భూసమీకరణ ప్రతిపాదనలకు ఆమోదం. ► రాజధానిలో అమృతా యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఆర్బీఐకి 11 ఎకరాలు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్‌కు 28 ఎకరాలు కేటారుుంపు. ఆయా సంస్థలో మాట్లాడిన తర్వాత ధర నిర్ణరుుంచాలి. ► రూ.149కి ఇంటింటికీ ఫోను, ఇంటర్నెట్, కేబుల్ కల్పించే పథకం కోసం ఏపీ ఫైబర్‌నెట్ తీసుకునే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం. ఫైబర్ నెట్ వడ్డీతోపాటు రుణ వారుుదాలను చెల్లిస్తుంది. ► అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలో కొత్తగా ఏర్పాటు చేసి బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల కోసం 13 మంది బోధనా సిబ్బంది, 19 మంది బోధనేతర సిబ్బంది నియామకానికి అనుమతి. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు పూర్తిస్థారుులో 16 పోస్టులు మంజూరు. ► వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే 210 మంది జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతి. -
హెలికాప్టర్లో తిరిగితే కరువు కనిపిస్తుందా?
-
కరువు కనపడలేదా?
♦ హెలికాప్టర్లో తిరిగితే కరువు కనిపిస్తుందా? ♦ రైతులకు ‘రెయిన్ గన్’ సినిమా చూపించిన సీఎం ♦ రాయలసీమలో 90 శాతం పంట ఎండిపోయింది.. ♦ 17.5 లక్షల ఎకరాల్లో వేరుశనగ నాశనమయ్యింది.. ♦ డ్యాష్‌బోర్డులో ‘అనంత’ కరువు కనపడలేదా? ♦ శ్రీశైలంలో నీళ్లున్నా హంద్రీనీవాకు నీరివ్వరా? (సాక్షి ప్రతినిధి, అనంతపురం) : ‘‘కరువొచ్చినపుడు రైతులు ఎన్నికష్టాలు ఎదుర్కొంటారు? ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరించాలి? ఎంత బాధ్యతగా మెలగాలి? రైతులను ఎలాంటి చర్యలతో ఆదుకోవాలి? కరువొస్తే ఓ ముఖ్యమంత్రి ఏం చేయాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసి చూపించారు. అనేక సహాయాలందించి రైతులకు అండగా ఉన్నా రు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా.. ‘కరువొచ్చిందా.. నాకు తెలీదే.. నాకెవరూ చెప్పలేదే’ అంటున్నారు. అన్నీ కంప్యూటర్లో చూస్తానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రికి అందులో అనంతపురం కరువు కనబడలేదా? అసలు కంప్యూటర్ కీబోర్డు నొక్కడానికి చేతులు రాలేదా?’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలు, రాష్ర్టప్రభుత్వ వైఫల్యం నేపథ్యంలో మంగళవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. ‘కరువొచ్చిన సంగతే తనకు తెలియదని ముఖ్యమంత్రి చెబుతుండడం బాధ్యతారాహిత్యం. పైగా నాలుగురోజులు తిరక్కుండానే రెయిన్గన్లతో కరువును పారదోలేశామని చెబుతూ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టడానికి కుట్రలు పన్నడం దారుణం’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ధర్నాలో జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... 90 శాతం ఎండిపోయిన పంట ‘‘రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. అనంతపురం జిల్లాలోనే 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగసాగు చేశారు. మరో 3లక్షల ఎకరాలు ఇతర పంటలు సాగు చేశారు. వేరుశనగ 90 శాతం ఎండిపోయింది. సీమలో 21.55 లక్షల ఎకరాల్లో వేరుశనగసాగు చేస్తే 17.52 లక్షల ఎకరాల్లో ఎండిపోయింది. జూన్‌లో చాలీచాలని వర్షాలు కురిశాయి. వర్షాలు బాగా వస్తాయని టీవీల్లో ప్రకటనలు వచ్చాయి. దీంతో వరుస కరువులతో అల్లాడుతున్న రైతులు ఈ ఏడాదైనా పంటసాగు చేసి బయటపడదామని ఆశగా సాగు చేశారు. జూలై చివరి నుంచి ఆగస్టు వరకూ బొట్టు వర్షం పడలేదు. వేరుశనగ ఊడలు దిగేముందు వర్షం రాకపోవడంతో పంట ఎండిపోయింది. బాబు ఆగస్టు 28న పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలకు వచ్చారు. కరువుందా...? నాకు తెలీదే.. మంత్రులు, ఎమ్మెల్యే లు, అధికారులు చెప్పలేదే? అని మాట్లాడారు. ఇదే పెద్దమనిషి ఎవరూ అడక్కపోయినా ‘నాకు కంప్యూటర్ ఉంది! అది నా గది లో ఉంటుంది! అందులో కోర్ డ్యాష్‌బోర్డు ఉంది! బటన్ నొక్కితే రాష్ట్రంలో ఎంత వర్షం పడిందో తెలుస్తుంది!’ అంటుం టారు. మరి ‘అనంత’లో కరువొస్తే నీ డ్యాష్‌బోర్డు పనిచేయలేదా? ఆపరేట్ చేసేందుకు నీకు చేయిరాలేదా అని అడుగుతున్నా! రెయిన్‌గన్ సినిమా చూపించిన బాబు.. ఆగస్టు 6న, 15న బాబు జిల్లాకు వచ్చి రెండు మీటింగ్‌లు పెట్టారు. ఒక్క ఎకరా కూడా ఎండనివ్వనని చెప్పారు. కానీ ఆగస్టు 28న వచ్చి డ్రామా మొదలెట్టారు. రెయిన్‌గన్ అనే సిని మా చూపించడం ప్రారంభించారు. 28న కరువు ఉందని చెప్పిన నాలుగురోజుల్లోనే సెప్టెంబర్ 2న రెయిన్గన్లతో కరువును జయించాం, యుద్ధంలో గెలిచాం అని ప్రకటనలు ఇచ్చారు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే! స్ప్రింక్లర్లు, రెయిన్గన్లు 15ఏళ్లుగా అందుబాటులో ఉన్నాయి. అసలు ఇలాంటి వ్యక్తికి రెయిన్‌గన్ అంటే ఏంటో తెలుసా? అని సందేహం వస్తోంది. బాబు లెక్కల ప్రకారం రోజూ లక్ష ఎకరాలకు నీరిచ్చి, నాలుగురోజుల్లో నాలుగు లక్షల ఎకరాలను కాపాడానని అంటున్నారు.బాబు చెప్పినట్లుగా ఎకరాను బతికించాలంటే ఎకరాకు 25-30ట్యాంకర్లు నీళ్లు ఇవ్వాలి. ఈ లెక్కన 28 లక్షల ట్యాంకర్లు కావాలి. అనంతపురంతో పాటు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో కలిపినా ఇన్ని ట్యాంకర్లు ఉంటాయా? ఎవరి మాటలు నమ్మాలి? వైఎస్సార్ జిల్లా మాధవరంలో రమణయ్య అనే టీడీపీమాజీ సర్పంచ్ పొలంలో రెయిన్‌గన్‌ను బాబు ప్రారంభించారు.(ఫొటో చూపిస్తూ) ఈరోజు అదే పొలం ఎండిపోయిం ది (ఆ ఫోటోనూ చూపిస్తూ). ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో తలెత్తింది. జిల్లాకు వస్తూ దారిలో పొలాలు చూస్తూ వచ్చా! అన్నీ ఎండిన పంటలే కన్పిస్తున్నాయి. కానీ బాబుకు కన్పించలేదు. వ్యవసాయశాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగస్టు 29న విలేకరుల సమావేశం పెట్టి పంటలను కాపాడటం ద్వారా రూ.59కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీని ఆదా చేశామన్నారు. సెప్టెంబరు 21న మరోమంత్రి కొల్లు రవీంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి 90 శాతం పంట ఎండిపోయింది. మేము ఆమోదిస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం అన్నారు. మరి రెయిన్గన్లతో పంటలు బతికించామని చెప్పిన చంద్రబాబు మాటలు నిజమా? రవీంద్రతో పాటు ‘అనంత’ మంత్రులు చెప్పినట్లుగా 90శాతం పంట ఎండిపోవడం నిజమా? వేరు శనగ దెబ్బతినడానికి వ ర్షాభావం ఓ కారణమైతే, నకిలీ విత్తనాలు మరో కారణం. వైఎస్ తరహా చొరవ ఏది? ‘అనంత’లో 25శాతం లోటు వర్షపాతం నమోదైంది. నెల్లూరు 52 శాతం, చిత్తూరులో 23 శాతం. ప్రకాశం, శ్రీకాకుళం, వైఎస్సార్‌జిల్లాల పరిస్థితీ అంతే. రాష్ట్రంలోని 250 మండలాల్లో కరువు తాండవిస్తోంది. కరువు రావడం ఎవరి చేతుల్లో ఉండదు. కానీ కరువొచ్చినపుడు ముఖ్యమంత్రి స్థానంలోని వ్యక్తి ఎలా బాధ్యతగా స్పందిస్తారనేది ముఖ్యం. గతంలో కూడా కరువులొస్తే దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి రైతులను ఎలా ఆదుకున్నారనేది గుర్తుచేసుకోవాలి. చంద్రబాబు పుణ్యాన 2004 దాకా రైతులు ఆకలితో అలమటించి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితులు రాకూడదంటే సీఎం అయిన తర్వాత తానేం చేయాలి? కేంద్రం చేత ఏం చేయించాలని వైఎస్ ఆలోచించారు. అందులో భాగంగానే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నా చంద్రబాబుకు రైతుల సంక్షేమం పట్టలేదు. విద్యుత్‌బిల్లులు కట్టలేదని రైతులను పోలీసుస్టేషన్లలో పెట్టారు. శిక్షించేందుకు ప్రత్యేకకోర్టులు పెట్టారు. కానీ వైఎస్ రూ. 1,100 కోట్ల మేర వ్యవసాయ విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. రైతుల ఆత్మహత్యలపై ప్రముఖ ఆర్థికవేత్త జయతీఘోష్తో ఓ నివేదికనూ రూపొందించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధానితో పాటు అందరిపైనా ఒత్తిడి తె చ్చారు. ఆత్మహత్యలపై దేశంలో అన్ని ప్రాంతాలనూ అధ్యయనం చేసి పాలసీని తీసుకువచ్చి రైతులకు అండగా నిలవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబులాగా అర్జీలు ఇచ్చి ఊరుకోలేదు. వైఎస్ ఒత్తిడితో కేంద్రం ఓ కమిటీని నియమించి అధ్యయనం చేయించింది. దేశవ్యాప్తంగా 31 జిల్లాలను గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. 23 జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్‌లోని 16 జిల్లాలకు ఆ ప్యాకేజీ వర్తించేలా వైఎస్ కృషి చేశారు. ఆయన కృషి వల్లే రైతులు చెల్లించాల్సిన వడ్డీని కేంద్రం పూర్తిగా మాఫీ చేసింది. వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని ఆర్బీఐకి ఆదేశాలు ఇచ్చింది. 2004లో వరి కనీస మద్దతు ధర కేవలం రూ. 560, కానీ ఐదేళ్లలో వరి కనీసమద్దతుధర రూ.1,030కి వైఎస్ పెంచారు. బీటీ పత్తివిత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్ రూ.1,800 ఉంటే రూ.650కి వైఎస్ తగ్గించారు. కరువొచ్చినపుడు ఇన్‌పుట్‌సబ్సిడీ, క్రాప్ ఇన్సురెన్స్ ఇచ్చి రైతులకు తోడుగా నిలబడ్డారు. కరువొస్తే ప్రజలు వలసలు పోతారు. అనంతపురం నుంచి బెంగళూరు, కేరళకు 5లక్షలమంది వలసలు పోయే పరిస్థితి. దీంతో వీరికి అండగా ఉండేందుకు వైఎస్ ఉపాధిహామీ పథకంలో 97శాతం లేబర్ కాంపొనెంట్‌కు (కూలీలకు) ఖర్చు చేశారు. ఈరోజు సిమెంటురోడ్లు, గృహనిర్మాణం, నీరు-చెట్టు అంటూ ఉపాధి నిధులన్నీ ఇతర అవసరాలకు ఖర్చుచేస్తున్నారు. ప్రాజెక్టులపై ఏదీ చిత్తశుద్ధి? కరువు సమూలంగా పోవాలంటే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తికావాలని వైఎస్ భావించారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ, పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్టులనూ ఉరుకులు, పరుగులు తీయించారు. తొమ్మిదేళ్లలో చంద్రబాబు హంద్రీ-నీవాకు ఖర్చుచేసింది రూ.13 కోట్లు, గాలేరు-నగరికి రూ.17కోట్లు, వెలిగొండకు రూ.13.50కోట్లు, పులిచింతలకు రూ.24 కోట్లు, పోలవరానికి రూ.7 కోట్లు ఖర్చు చేశారు. కానీ వైఎస్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులలో 70-80 శాతం పనులు పూర్తి చేశారు. ఇపుడు కృష్ణా జలాలు శ్రీశైలానికి రాకుండానే ఎగువనున్న తెలంగాణ.. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా దాదాపుగా 120 టీఎంసీలు తీసుకుపోతున్నా బాబు అడగడం లేదు. లిఫ్టుల ద్వారా గోదావరి నుంచి 69 వేల క్యూసెక్కులు ఎత్తిపోసుకుంటున్నా ప్రశ్నించడం లేదు. ఇన్‌పుట్‌సబ్సిడీ ఏదీ? చంద్రబాబు 2014లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ‘వరుసగా కరువొచ్చింది, మూడు తుపాన్లొచ్చాయి. సీఎం అయితే అందరికీ తోడుంటా’ అని ఊదరగొట్టారు. సీఎం అయిన తర్వాత 2013-14కు సంబంధించి రూ.2,360కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ రైతులకివ్వకుండా ఎగనామం పెట్టారు. రూ. 2,360 కోట్లలో కేంద్రం తనవాటాగా రూ.వెయ్యికోట్లు ఇచ్చింది. దీన్ని ఇతర అవసరాలకు వినియోగించారు. 2014-15లో రూ.1,500కోట్ల ఇవ్వాలని అధికారులు లెక్కగడితే చివరకు రూ.692 కోట్లకు తగ్గించి రైతుల నోట్లో చంద్రబాబు మట్టికొట్టారు. ఇది కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఈరోజుకు కూడా ఇంకా రూ.60కోట్లకు పైగా బకాయిలున్నాయి. గతేడాది కరువు, తుఫాన్ వచ్చాయి. రైతులు పూర్తిగా నష్టపోయినా ఇన్‌పుట్‌సబ్సిడీ రూ. 990కోట్లు మాత్రమే అని తగ్గించి లెక్కగట్టారు. ఇందులోనూ నేటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎన్నికల హామీలేమయ్యాయి? బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు? కానీ ఇప్పుడు బ్యాంకుల్లో బంగారం వేలం వేస్తున్నారు? రైతు రుణాలు పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానన్నారు. మాఫీ సొమ్ముతో వడ్డీ కూడా మాఫీ కాలేదు. 2015లో ఖరీఫ్‌కు హంద్రీ-నీవా ద్వారా నీరిస్తామన్నారు. 2015జూన్1కి గండికోట ద్వారా నీరిస్తామన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానన్నారు. ఇవాళ శ్రీశైలం నిండుకుండలా ఉంది. 882 అడుగుల నీళ్లు ఉన్నాయి. ఈ సంవత్సరం కృష్ణానదిలో 52 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. శ్రీశైలంలో నీళ్లున్నా, 12 పంపుసెట్లు సిద్ధంగా ఉన్నా హంద్రీ-నీవా ద్వారా ఎందుకు నీరివ్వడం లేదు? హంద్రీ-నీవా పిల్లకాలవలు పూర్తి చేస్తే ‘సీమ’లో 6లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. దీనికి రూ.వెయ్యికోట్లు ఖర్చవుతుంది. కానీ కమీషన్ల కోసం ఆయకట్టును గాలికి వదిలేశారు. కరువొస్తే ఎవరైనా పొలంలోకి వెళ్లి వేరుశనగ ఊడలు దిగాయా? లేదా? అని చూడాలి. కానీ చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఎవరైనా వరదలు వస్తే ఏరియల్ సర్వేచేస్తారు? కానీ మా ఖర్మకొద్దీ కరువొస్తే హెలికాప్టర్లో తిరిగే సీఎంను ఈయననే చూస్తున్నాం’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రైతు మహాధర్నా డిమాండ్లివీ... అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం పార్టీ జిల్లా నాయకులతో కలసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కోన శశిధర్‌కు అందజేశారు. ఆ డిమాండ్లిలా ఉన్నాయి. ♦ రాష్ట్రంలో250 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. వెంటనే కరువు మండలాలపై ప్రకటన చేయాలి. ♦ పంటనష్టపోయిన రైతులందరికీ ఎకరానికి రూ.10-20వేలు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వాలి ♦ బీమా ప్రీమియం చెల్లించిన రైతులందరికి కూడా బీమా మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలి ♦ వలసల నివారణకు కూలీలకు ఉపాధిహామీపనులు(యంత్రాలతో కాకుండా) కల్పించాలి ♦ హంద్రీ-నీవా ద్వారా వచ్చేనీటిని ఈ ఏడాది హెచ్చెల్సీ దక్షిణ, ఉత్తర కాలువలతోపాటు తాడిపత్రి, పులివెందుల బ్రాంచ్‌కెనాల్ పరిధిలోని ఆయకట్టుకివ్వాలి. పీఏబీఆర్ కుడికాలువ పరిధిలోని చెరువులన్నిటికీ నీరివ్వాలి. ♦ హంద్రీ-నీవా ద్వారా 3.5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి. యుద్దప్రాతిపదికన డిస్ట్రిబ్యూటరీ కాలువలు చేపట్టాలి. ♦ వరుస కరువుతో అల్లాడిన అనంత రైతులకు బీమా ప్రీమియం, పంటరుణాల వడ్డీల్ని ప్రభుత్వమే భరించాలి ♦ టీబీడ్యాం నుంచి ‘అనంత’కు కేసీ కెనాల్ డైవర్షన్ కింద వైఎస్ ఇచ్చిన 10టీఎంసీల హక్కును కాపాడాలి. ♦ సెప్టెంబరులో 5మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భవిష్యత్తులో ఏ రైతూ ఆత్మహత్యకు తెగించకుండా చర్యలు తీసుకోవాలి. ♦ చేనేత కార్మికులు, రైతు రుణమాఫీని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా వారి ఖాతాల్లో జమ చేయాలి. ముడిపట్టుపై రూ.600 సబ్సిడీని ఇచ్చే మొత్తాన్ని ఇవ్వడం లేదు. దీన్ని వెయ్యికి పెంచుతున్నట్లు ధర్మవరంంలో ఇచ్చిన హామీ అమలు కాలేదు. సబ్సిడీ పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ♦ హంద్రీ-నీవా, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, తదితర ప్రాజెక్టులను డిస్ట్రిబ్యూటరీలతో సహా పూర్తి చేయాలి.