‘‘కరువొచ్చినపుడు రైతులు ఎన్నికష్టాలు ఎదుర్కొంటారు? ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరించాలి? ఎంత బాధ్యతగా మెలగాలి? రైతులను ఎలాంటి చర్యలతో ఆదుకోవాలి? కరువొస్తే ఓ ముఖ్యమంత్రి ఏం చేయాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసి చూపించారు. అనేక సహాయాలందించి రైతులకు అండగా ఉన్నా రు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా.. ‘కరువొచ్చిందా.. నాకు తెలీదే.. నాకెవరూ చెప్పలేదే’ అంటున్నారు. అన్నీ కంప్యూటర్‌లో చూస్తానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రికి అందులో అనంతపురం కరువు కనబడలేదా? అసలు కంప్యూటర్ కీబోర్డు నొక్కడానికి చేతులు రాలేదా?’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు.