breaking news
Power Mech
-
నష్టాలతో నమోదైన పవర్‌మెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్‌రంగ ఇన్ఫ్రా కంపెనీ పవర్‌మెక్ ఇన్వెస్టర్లకు తొలి రోజులు నష్టాలను అందించింది. ఇష్యూ ధర రూ. 640 కంటే ఆరు శాతం తక్కువ ధర రూ. 600 వద్ద షేరు నమోదయ్యింది. రోజు మొత్తం మీద రూ. 663 - 580 శ్రేణిలో కదిలిన ఈ షేరు చివరకు 8 శాతం నష్టంతో రూ. 586 వద్ద ముగిసింది. తొలి రోజు సుమారు 52 లక్షల షేర్లు చేతులు మారాయి. -
నేటి నుంచే పవర్‌మెక్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుక్ బిల్డింగ్ పద్థతిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పవర్‌మెక్ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 82 కోట్లు సమీకరించింది. మొత్తం ఈ ఇష్యూ ద్వారా 42.69 లక్షల షేర్లు జారీ చేస్తుండగా అందులో 12.80 లక్షల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లైన వివిధ మ్యూచువల ఫండ్ సంస్థలకు కేటాయించింది. ఇష్యూ ప్రైస్ బాండ్‌ను రూ. 615 - 640గా నిర్ణయించగా యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 640 చొప్పున ఈ కేటాయింపులు చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ వాటాలో ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ అత్యధికంగా ఇన్వెస్ట్ చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో డీఎస్పీ బ్లాక్‌రాక్ టైగర్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ ఉన్నాయి.