breaking news
potent
-
వామ్మో.. పొరుగు దేశంలో కొత్త రకం కరోనా
కొలంబో: గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్‌ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీలంక వైద్య నిపుణులు తెలిపారు. మునుపటి కరోనాతో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం, వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇది గాల్లో దాదాపు గంట సేపు పైనే మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే చెప్పారు. ఇటీవల దేశంలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కువ యువత కరోనా బారిన పడుతున్నారని అన్నారు. అయితే రాబోయే 2-3 వారాలలో తరువాతే నిజమైన పరిస్థితి బయటపడుతుందని ఆయన అన్నారు. శ్రీలంకలో కోవిడ్ నివారణ కోసం అక్కడి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది మే 31 వరకు అమలులో ఉండనుంది. శ్రీలంక కూడా అనేక దేశాల మాదిరిగానే , కరోనా కేసుల సంఖ్యను నివారించలేకపోతోంది. ప్రస్తుత శ్రీలంకలో కేసుల సంఖ్య 99,691 ఉండగా, 638 మరణాలు నమోదయ్యాయి. కేసుల పెరుగుతున్ననేపథ్యంలో రోగులకు చికిత్స చేయడానికి ఆస్పత్రుల్లో తగినంత వైద్యం సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని, అయితే వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య మార్గదర్శకాలను పాటించడం చాలా ముఖ్యం అని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అసేలా గుణవర్ధన అన్నారు. ( చదవండి: Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా? ) -
జికా, డెంగ్యూలకు దగ్గరి సంబంధం!
లండన్: శిశువు చిన్న తలతో జన్మించడానికి కారణమౌతున్న జికా వైరస్‌కు వ్యక్సిన్ను కనుగొనే క్రమంలో శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని కనుగొన్నారు. గతంలో డెంగ్యూ వైరస్ బారిన పడిన వారిలో జికా వైరస్ ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తోందని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు. ఇటీవల జికా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన బ్రెజిల్ లాంటి దేశాల్లో.. గతంలో డెంగ్యూ ప్రభావానికి గురైన వారిలో ఈ వ్యాధి విజృంభించిందని గుర్తించారు. డెంగ్యూ వైరస్‌ను వ్యాప్తి చేసే దోమలే జికా వైరస్‌ను కూడా వ్యాప్తి చేస్తాయి. జికా, డెంగ్యూ వ్యాధులను కలిగించే వైరస్లు రెండూ ఒకే ఫ్యామిలీకి చెందినప్పటికీ.. డెంగ్యూ వ్యాధి, జికా అంత ప్రమాదకరమైనది కాదు. అయినప్పటికీ ఈ రెండింటికీ మధ్య సంబంధముందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. డెంగ్యూ వైరస్‌కు ఉపయోగించే తరహా వ్యాక్సిన్ జికా వైరస్‌ను అరికట్టడంతో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రాధమిక భావన మాత్రమే అని.. ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని వారు వెల్లడించారు.