breaking news
Pop icon
-
Michael Jackson: ఊహించినట్లే మరణించిన జాక్సన్!
పాప్ రారాజు మైకేల్ జాక్సన్ చనిపోయి ఇవాళ్టికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్తైంది. ఆయన చావుకు కారణం.. డ్రగ్స్, వాటి వల్ల వచ్చిన గుండెపోటు. యాభై ఏళ్ల వయసులో మోతాదుకు మించి తీసుకోవడం వల్లే జాక్సన్ గుండెపోటుకి గురై చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు కూడా. అయితే జాక్సన్ తన చావు భయాన్ని చాలా ఏళ్ల క్రితమే.. అది కూడా తన భార్య సమక్షంలో ప్రస్తావించడం విశేషం. లీసా మరీ(54) జాక్సన్‌కు మొదటి భార్య. 1994లో ఆమె జాక్సన్‌ను పెళ్లి చేసుకుని.. 1996లో వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు ఇచ్చింది. లీసా మరీ ఎవరో కాదు.. అమెరికన్ పాప్ సింగర్, ‘కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్’ ఎల్విస్ ప్రెస్లేకి ఏకైక కూతురు. లీసాకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు ఎల్విస్ గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ టైంలో ఎల్విస్ ప్రొపొఫోల్, బెన్జోడయాజెపైన్ లాంటి డ్రగ్స్ వాడాడు. విశేషం ఏంటంటే.. ఎల్విస్ చనిపోయిన ముప్ఫై ఏళ్ల తర్వాత జాక్సన్ కూడా ఇవే డ్రగ్స్ వాడి కన్నుమూశాడు. ఇక గతంలో లీసాతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాక్సన్.. తన భయాన్ని పబ్లిక్‌గా వెల్లడించాడు కూడా. ఆ టైంలో జాక్సన్ ‘నా ఆరోగ్యం దృష్ట్యా కొన్ని మందులు వాడుతున్నా. కానీ, వికటిస్తే వీళ్ల నాన్నలా నేనూ గుండెపోటుతో చనిపోతానేమో అని భయంగా ఉంది’ అని కాకతాళీయంగా ఓ మాట అనేశాడు. ఆ ఊహకు తగ్గట్లే లాస్ ఏంజెల్స్‌లో 2009లో జూన్ 25న గుండెపోటుతో, విచిత్రంగా అవే డ్రగ్స్ వాడి కన్నుమూశాడు మైకేల్ జోసెఫ్ జాక్సన్. ఇక లీసా, జాక్సన్ విడిపోయాక కూడా నాలుగేళ్లపాటు రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు వాళ్లు. ఆ తర్వాత 1996లో డెర్మటాలజిస్ట్ డెబోరాను పెళ్లి చేసుకుని.. 1999లో విడాకులు ఇచ్చాడు. చదవండి: జాక్సన్ బాడీ గార్డులు తోసేశారు: ఇండియన్ నటుడు -
ప్రిన్స్ చావులో కొత్త కోణం!
న్యూయార్క్: అమెరికా పాపులర్ పాప్ మ్యూజిక్ స్టార్ ప్రిన్స్ మృతి విషయంలో ఓ కొత్త కోణం వెలుగుచూసింది. ఆ రోజు ప్రిన్స్ చనిపోయిన ఆరుగంటల తర్వాతే ఆయనను గుర్తించారని ఓ నివేదిక బయటకు వచ్చింది. ఈ 57 ఏళ్ల పాప్ స్టార్ అనుమానాస్పద స్థితిలో గత ఏప్రిల్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన ఉండే బంగ్లాలోని ఎలివేటర్లో విగత జీవిగా పడిఉండటం చూసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మృతిపట్ల అమెరికా దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసింది. అయితే, ఆయన విరివిగా పెయిన్ కిల్లర్స్‌ను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం వల్లే ప్రాణాలు విడిచినట్లు భారీ స్థాయిలో ఊహగానాలు అందుకున్నాయి. కానీ, తాజాగా మిన్నెసోటా స్టార్ ట్రిబ్యూన్ కొత్త విషయాలు బయటి ప్రపంచానికి తెలియజేసింది. వాస్తవానికి తనకు మందులు కావాలని ఆరోజు ప్రిన్స్ 9.43గంటల ప్రాంతంలో తన సహాయకులకు ఫోన్ చేసి అడిగారని.. కానీ వారు సరైన సమయంలో అందించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని ఆ నివేదిక అనుమానం వ్యక్తం చేసింది. ఆ మందుల కోసమే ఆయన ఎలివేటర్ లోకి వెళ్లి అక్కడే కుప్పకూలిపోయి చనిపోయి ఉండొచ్చంటూ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈయన శవపరీక్ష నివేదికపై ఇప్పటి వరకు ఒక్క విషయాన్ని కూడా దర్యాప్తు అధికారులు బయటకు చెప్పకపోవడం ఆ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది.