breaking news
polavaram displacement victims
-
14 నెలలుగా పట్టలేదు.. ఒక్క ఇల్లూ కట్టలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ భూములను త్యాగం చేసిన పోలవరం నిర్వాసితుల జీవితాలతో రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. 14 నెలలుగా వారికి పునరావాసం కల్పించడానికి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. సరికదా గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన 3,114 ఇళ్లను నిర్వాసితులకు ఇచ్చి పునరావాసం కల్పించేందుకు ప్రస్తుత సర్కారుకు మనసొప్పడంలేదు. ఇక 2024, మే నాటికి దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్న 2,279 ఇళ్లను పూర్తిచేసే దిశగా చర్యలూ చేపట్టలేదు. దీంతో.. ఆ పునరావాస కాలనీలు ముళ్లపొదలతో చిట్టడవిని తలపిస్తున్నాయి. ఆ ఇళ్లు 14 నెలలుగా వృథాగా ఉన్నాయి. ఇక నిర్వాసితుల కోసం ఇంకా 16,170 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా.. 14 నెలలుగా ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టలేదు. నిధులు లేవేమో అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే.. కేంద్రం 14 నెలల్లో రెండు విడతలుగా అడ్వాన్సు రూపంలో రూ.5,052.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. వాటిని పోలవరం పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణకు మాత్రమే వినియోగించేలా ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేయాలని నిర్దేశించింది. కానీ, రూ.2,135.35 కోట్లను ఇప్పటికీ ఆ ఖాతాలో జమచేయకుండా ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. కమీషన్లు రావనే నెపంతోనే పునరావాసం కల్పనపై ముఖ్యనేత పట్టించుకోవడంలేదని నిర్వాసితులు మండిపడుతున్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వచేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు 2024, ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేయాలంటే.. 121 గ్రామాల్లోని 38,060 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో 34,360 నిర్వాసిత కుటుంబాలు పునరావాస కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని కోరగా, మిగతా 3,700 కుటుంబాలు తమకు డబ్బులిస్తే తామే కట్టుకుంటామని చెప్పాయి. 2024, మే నాటికే 12,797 కుటుంబాలకు పునరావాసం..పోలవరం నిర్వాసితులకు నిర్మించాల్సిన 34,360 ఇళ్లలో 15,911 గృహాలను పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలతో సహా 2024, మే నాటికే గత ప్రభుత్వం పూర్తిచేసింది. మరో 2,279 ఇళ్లను దాదాపుగా పూర్తిచేసింది. వాటికి మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించి 2024, మే నాటికే 12,797 కుటుంబాలకు పునరావాసం కల్పించింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2014, మే నాటికే పూర్తయిన ఇళ్లలో 3,114 గృహాలు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక అప్పటికే దాదాపుగా పూర్తయిన 2,279 ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 5,393 ఇళ్లను నిర్వాసితులకు కేటాయించి, పరిహారం చెల్లించి పునరావాసం కల్పించే అవకాశం ఉంది. కానీ, 2024 ఆగస్టు నుంచి కేవలం 1,574 నిర్వాసిత కుటుంబాలకు మాత్రమే కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించి అప్పటికే పూర్తయిన పునరావాస కాలనీల్లోని ఇళ్లకు తరలించింది. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పటికీ పునరావాస కాలనీల్లో పూర్తయిన 3,819 ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వేలేరుపాడు మండలం తాటుకూరుగొమ్ము నిర్వాసితులకు బుట్టాయిగూడెం సమీపంలోని పునరావాస కాలనీలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు కమీషన్లు రావనే నెపంతోనే..ఇక పోలవరం ప్రాజెక్టు పనుల్లో 2014–19 తరహాలోనే ముఖ్యనేత ఇప్పుడు కూడా కమీషన్లు అధికంగా వచ్చే పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. పునరావాసం కల్పనపై దృష్టిసారించకపోవడమే అందుకు నిదర్శనమని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర జల్‌శక్తి శాఖ రెండు విడతలుగా రూ.5052.71 కోట్లు విడుదల చేసింది. రెండో విడత కింద ఇందులో రూ.2704.71 కోట్లను అడ్వాన్సుగా మార్చి 11న విడుదల చేసింది. ఇందులో కేవలం రూ.569.36 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. మిగతా రూ.2,135.35 కోట్లను ఇప్పటికీ జమచేయలేదు. వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. దీన్నిబట్టి చూస్తే నిధులున్నప్పటికీ నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. గోదావరి వరదలకు ముంపు గ్రామాల్లోకి నీళ్లు చేరడం.. రాకపోకలకు వీల్లేకుండా పోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల ముందు నిర్వాసితులు వరదలతో సతమతమవుతున్నప్పటికీ వారికి పునరావాసం కల్పించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేధింపులు ఆపాలి ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో పోలవరం మండలం తెల్లవరం గ్రామానికి చెందిన మేం వింజరం గ్రామం వద్ద పాకలు నిర్మించుకుని జీవిస్తున్నాం. గ్రామంలోకి వెళ్లి వ్యవసాయం చేస్తుంటే మాపై అటవీ శాఖ అధికారులు వేధింపులకు దిగుతున్నారు. వేధింపులను తక్షణం నిలుపుదల చేయాలి. ఉపాధి హామీ పనులు కల్పించాలి. –కుంజం రామారావు, నిర్వాసితుడు, తెల్లవరం భూమికి హక్కులు కల్పించాలి పోలవరం మండలం తూటిగుంట, కొండ్రుకోట, సింగనపల్లి తదితర రెవెన్యూ గ్రామాల్లో ఏజెన్సీ గిరిజన సంఘం ఉమ్మడిగా సంఘ సభ్యుల సాగును నమోదు చేసింది. దాని ప్రకారం ఆర్ అండ్ ఆర్‌లో పరిహారం, భూమికి భూమి హక్కులు కల్పించాలి. డీ ఫాం పట్టా భూములకు పరిహారం చెల్లించాలి. – మిడియం పోసిరావు, నిర్వాసితుడు, చేగొండపల్లి ఉపాధి పనులు లేవు పోలవరం ప్రాజెక్ట్ వల్ల సర్వం కోల్పోయి వేరే ప్రాంతంలో తలదాచుకుంటున్న మాకు కనీసం ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం దారుణం. తక్షణం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని నిర్వాసితులకు పనులు కల్పించాలి. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్యాకేజీ ఇప్పించాలి. – మాడే పోశమ్మ, నిర్వాసితురాలు, తెల్లవరం లేబర్ అడ్డాలుగా కాలనీలు నిర్వాసితులకు భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ ఇవ్వకపోవడంతో పునరావాస కాలనీలు తక్కువ కూలికి దొరికే లేబర్ అడ్డాలుగా మారాయి. చాలా బాధాకరం. –షేక్ బాషా, రైతు కూలీ సంఘం, ఏలూరు జిల్లా కార్యదర్శి -
పునరావాస కాలనీలకు పోలవరం నిర్వాసితులు
దేవీపట్నం: పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీల్లో సిద్ధమైన ఇళ్లను అందచేసే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు), రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దేవీపట్నం మండలం ఇందుకూరు–2, పోతవరం–2 పునరావాస కాలనీలను ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. సకల సదుపాయాలతో కూడిన సొంత ఇళ్లను చూసి ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేశారు. గిరిజన నిర్వాసితులకు దేవీపట్నం మండలం పరిసర గ్రామాల్లో ఎనిమిది చోట్ల కాలనీలు నిర్మిస్తున్నారు. వాటిలో ప్రస్తుతం వెయ్యి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగా మరో వెయ్యి గృహాల నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. టీడీపీ హయాంలో పోలవరం పనులను ప్రణాళిక లేకుండా చేపట్టడం, కాఫర్ డ్యామ్‌లపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది గోదావరి వరద ముంపులో చిక్కుకుని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కాలనీల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసింది. సమన్వయంతో వేగంగా కాలనీల నిర్మాణం: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ► అతి తక్కువ సమయంలో అన్ని శాఖల సమన్వయంతో కాలనీల నిర్మాణం పూర్తి చేశామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పోలవరం పరిపాలన అధికారిని కూడా నియమించిందన్నారు. ► పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న వారు త్యాగజీవులని, వారికి ఏ సమస్య రాకుండా పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీ, భూమికి భూమి అందజేస్తామని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో వరదల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ► ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి ఓ.ఆనంద్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. -
‘కన్నీటి సునామీలో బాబు కొట్టుకుపోతాడు’
-
‘కన్నీటి సునామీలో బాబు కొట్టుకుపోతాడు’
రేఖపల్లి: దాదాపు మూడేళ్లుగా పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును అందరూ కోరుకుంటున్నారని, అయితే, ఆ ప్రాజెక్టుకోసం భూములిచ్చిన గిరిజనుల బాధలు ఎవరికీ పట్టవా అని ప్రశ్నించారు. వారి కష్టాల గురించి ప్రభుత్వానికి గుర్తు చేయడం ధర్మం కాదా.. నిలదీసిన వ్యక్తులపై నిందలు వేస్తారా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తండ్రిగా ఉండాలని.. ఆయన వస్తే సంతోషపడాలని, కానీ చంద్రబాబు వస్తుంటే ప్రజలు బాధపడుతున్నారని, ఆయన అడుగుపెట్టిన ప్రతిచోట ప్రజలను మోసం చేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రేఖపల్లిలో జరిగిన పోలవరం నిర్వాసితుల పోరు బహిరంగ సభలో వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా చంద్రబాబు ఏపీని ప్రకటించారని, కానీ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం స్కూలు విద్యార్థులకు కూడా బాత్ రూములు లేని పరిస్థితి ఉందని, పిల్లలు చెంబులు పట్టుకొని కొండలు ఎక్కుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా సిగ్గు లేకుండా స్వచ్ఛభారత్‌కు తానే అంబాసిడర్ అని చంద్రబాబు ప్రకటించుకుంటున్నారని మండిపడ్డారు. చింతూరు జూనియర్ కాలేజీలో కూడా తమకు బాత్ రూములు లేవని, ల్యాబ్‌లు లేవని విద్యార్థులు, రెండేళ్ల నుంచి జీతాలు కూడా రావడం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రికి అర్హుడేనా అని ప్రశ్నించారు(ఈ సమయంలో ప్రజల నోట కాదు అని అరుపులు). ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు వైద్యులు కనీసం ఉండాలని, కానీ ఒక్కరు కూడా అందుబాటులో లేరని, వైద్యానికి దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జీడీపీలో నాలుగో స్థానంలో ఉందని చంద్రబాబు ప్రకటిస్తున్నారని, సులువుగా ప్రజల చెవుల్లో పూలు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని అన్నారు. విలీన మండలాల్లో నాలుగు నెలల్లో కాళ్ల వాపు వ్యాధితో ఇప్పటికే 14మంది చనిపోయారని, వైద్యం అందక, వైద్యులు లేక ఈ పరిస్థితి దాపురించిందని, మరో 200మంది ఆస్పత్రుల్లో ఉన్నా ఎందుకిలా జరుగుతుందన్న కనీస స్ఫురణ ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు. అలాగే, రాజవొమ్మంగిలో నెలా.. రెండు నెలల పిల్లలు 15మంది పౌష్టికాహారలోపంతో చనిపోతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలో ప్రాజెక్టు ఆఫీసర్లుగా ఐఏఎస్‌లను పెట్టేవారని, కానీ ఇప్పుడు మాత్రం అర్హత లేని వ్యక్తులను నియమిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని భూములు కోల్పోయిన రైతులకు ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ధరలు చెల్లిస్తున్నారని, పట్టిసీమలో ఇస్తున్నట్లుగానే ప్రతి ఎకరాకు రూ.19లక్షలు రైతులకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అందరికంటే ముందే భూములిచ్చిన తమను ఎందుకిలా చేస్తున్నారని రైతులు కంటతడి పెడుతున్నారని, ఆ కన్నీళ్లలో బాబు కొట్టుకోపోవడం ఖాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల బాధలు చంద్రబాబు ఎందుకు పట్టడం లేదో అర్ధంకావడం లేదన్నారు. కొండపోడు భూములపై గిరిజన రైతులకు వైఎస్ హయాంలో హక్కులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని, కానీ వాటిని కూడా చంద్రబాబు లాక్కున్నారని, ఆ భూములకు రైతులకు ఇచ్చినట్లుగా కాకుండా వేర్వేరుగా నష్టపరిహారం చెల్లిస్తున్నారని, సామాన్యంగా రైతులకు ఎంత ఇస్తున్నారో అంతే రేటు గిరిజన రైతుల నుంచి తీసుకున్న భూములకు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు తిరిగి భూములు ఇవ్వాలన్నారు. కొందరికి భూములు ఇచ్చారని, వారికిచ్చిన భూములకు ఏ రేటు ఉంటే అదే రేటును భూములు దక్కని వారికి నష్టపరిహారంకింద చెల్లించాలని ప్రభుత్వానికి సూచించారు. 100 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్న గిరిజనులకు కనీసం ఇళ్లు కట్టించకపోవడం దారుణం అని, ఆ పని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దగ్గర న్యాయం జరగదని, ఆయనకు పోలవరం కాంట్రాక్టుల మీద ఉన్న ధ్యాస ఈ ప్రాజెక్టు కింద మునిగిపోతున్న గిరిజనులపై లేదని మండిపడ్డారు. తరంగానీ కాంట్రాక్టర్లకే చంద్రబాబు ప్రాజెక్టు పనులు అప్పగిస్తారని, గతంలో 16వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం అయితే, ఇప్పుడది 40 వేల కోట్లకు పెంచారని, సబ్ కాంట్రాక్టర్లతో లంఛాలు పంచుకునేందుకే ఆయన వ్యయాన్ని అమాంతం పెంచారని చెప్పారు. సబ్ కాంట్రాక్టర్లలో ఒక సబ్ కాంట్రాక్టర్ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్ యాదవ్ అని, ఆయనకు ఏ రకంగా కాంట్రాక్ట్ ఇచ్చారని నిలదీశారు. చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదని, ఇప్పటికే మూడేళ్ల పాలన ముగిసిందని, దేవుడు అనుకూలిస్తే వచ్చే ఏడాది ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. దేవుడు కూడా చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తాడని, పేదల కెరటం సునామీల తాకి చంద్రబాబును బంగాళాఖాతంలో పడేస్తుందని చెప్పారు. ‘ఈ ప్రభుత్వం తర్వాత వచ్చేది మన ప్రభుత్వం. అప్పుడు మంచి రోజులు వస్తాయి. మీ అందరి కష్టాలు తీరుస్తాను. ఏ సమస్య వచ్చినా నేను ముందుండి పోరాడుతాను’ అని వైఎస్జగన్ సభకు హాజరైన ప్రజానీకానికి హామీ ఇచ్చారు. -
మీ త్యాగాలు మర్చిపోం: వైఎస్ జగన్
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసాయిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో బుధవారం పోలవరం నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. పోలవరం కోసం భూములు ఇచ్చిన రైతులు, గిరిజనులకు న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కారుపై ఒత్తిడి తీసుకున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్యాకేజీ ఇచ్చి స్థానికుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రతి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే కనీసం రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8 లక్షల ఎకరాలపై గిరిజనులకు మహానేత వైఎస్సార్ హక్కులు కల్పిస్తే, చంద్రబాబు ఒక్క ఎకరా ఇవ్వకపోగా భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ‘పోలవరం కావాలి, నిర్వాసితులకు న్యాయం’ జరగాలని నినదించారు. నిర్వాసితులు త్యాగాలు మర్చిపోమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు 19 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని వైఎస్ జగన్ హామీయిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులను జగన్ మాట్లాడించారు. కిశోర్ సత్యనారాయణ పోలవరం కారణంగా సర్వస్వం కోల్పోతున్నాం సరైన జవాబుదారితనం లేకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు మాకు అన్నివిధాలా నష్టం చేశారు దేవిపట్నం మండలంలో 6 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి మాకు 15 ఎకరాల భూమి ఉంది రూ. 2 లక్షల 8 వేల చొప్పున 2012లో పరిహారం ఇచ్చారు. ఈ డబ్బుతో సెంటు భూమి కొనలేని పరిస్థితి భూమికి భూమి ఇస్తామని ఇవ్వలేదు డబ్బులు తీసుకోనివి 2500 ఎకరాలు ఉన్నాయి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని అడుగుతున్నాం చల్లన్న దొర(గిరిజనుడు) మాకు 15 ఎకరాల పొలం ఉంది ఒక్కొక్కరికి ఒక్కో మాదిరిగా ధరలు ఇచ్చి మా మధ్య గొడవలు పెడుతున్నారు గతంలో తక్కువ ధరలు ఇచ్చారు, ఇప్పుడు ఎక్కువ ధరకు భూములు తీసుకుంటున్నారు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మాకు పరిహారం ఇవ్వాలి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రేటు, తూర్పుగోదావరి జిల్లాలో మరో రేటుకు భూములు తీసుకుంటున్నారు అందరికీ ఒకేవిధంగా న్యాయం చేయాలి ఆరండల్ పేట వాసి అందరి ఆమోదంతో పోలవరం కట్టండి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం 20 ఏళ్ల పాటు మా జీవనోపాధికి ప్రభుత్వం హామీయివ్వాలి నిర్వాసితుల కుటుంబంలో చదువుకున్న వారికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలి పట్టిసీమ నిర్వాసితులకు ఇచ్చినట్టుగా పరిహారం కల్పించాలి 6 పంచాయతీలు ముంపు ఎదుర్కొంటున్నాయి మిగిలిన 8 పంచాయతీల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు