breaking news
PMP doctors
-
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్‌ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్‌పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్‌లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
గ్రామీణ వైద్యులు సహకరించాలి
జేసీ–2 రాజ్‌కుమార్ నెల్లూరు(అర్బన్) : జిల్లాలో విషజ్వరాలు ప్రబలకుండా గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీలు, పీఎంపీలు సహకరించాలని జేసీ–2 రాజ్‌కుమార్ కోరారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో గురువారం దోమలపై దండ యాత్ర– పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి జ్వరం వచ్చినా గ్రామాల్లో మొదట పీఎంపీ, ఆర్ఎంపీ దగ్గరకు ప్రజలు వైద్యం కోసం వెళ్తారన్నారు. ఎలీసా పరీక్ష చేయకుండా, లక్షణాలను బట్టి డెంగీ అని నిర్ధారించకూడదని సూచించారు. దోమలు నివారణకు, పరిసరాల పరిశుభ్రత కోసం వైద్యశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు సహకరిస్తునాన్నారని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం, పీఎంపీ అధ్యక్ష, కార్యదర్శిలు శాఖవరపు వేణుగోపాల్, షేక్ సత్తార్, తెలుగునాడు పారామెడిక్స్ అసోసియేషన్ నాయకులు రత్నం తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 1 నుంచి ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ
హైదరాబాద్ : గ్రామాల్లో పనిచేసే ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏడాదిపాటు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిందని వైద్యసంఘాల సభ్యులు చెప్పారు. శిక్షణకు విధి విధానాలను ఖరారు చేయడానికి సోమవారం సచివాలయంలో కమ్యూనిటీ పారా మెడికల్ కార్యదర్శి కుమార్ అధ్యక్షతన, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు. గతంలో శిక్షణ ఇచ్చిన వైద్యులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని, ఇప్పటివరకు కమ్యూనిటీ పారా మెడికల్ బోర్డులో నమోదు చేసుకున్న 24 వేల మందికి శిక్షణ ఇవ్వాలని కోరామని వైద్య సంఘాల సభ్యులు మీడియాతో పేర్కొన్నారు. ఇందుకు అవసరమ్యే నిధులను మంజూరు చేసినందుకు ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆర్ఎంపీ, పీఎంపీ సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.వి.రావు, అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, పట్టణ, గ్రామీణ వైద్యుల ఐక్య వేదిక అధ్యక్షుడు బాలబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.