breaking news
PM visiting
-
మృతులు 300కు చేరువలో...
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం దేశమంతటినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. శుక్రవారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి ఏడింటి ప్రాంతంలో బహనగా రైల్వేస్టేషన్ సమీపంలో మెయిన్ ట్రాక్ నుంచి లూప్ లైన్లోకి వెళ్లడం, దానిపై ఆగి ఉన్న గూడ్స్‌ను గంటకు 128 కి.మీ. వేగంతో ఢీకొనడం తెలిసిందే. దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడటం, అదే సమయంలో దానిపై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 70 మందికి పైగా మరణించినట్టు తొలుత భావించినా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చిక్కుకుపోయిన బోగీలను విడదీస్తూ గాలింపు కొనసాగిన కొద్దీ శవాలు భారీగా బయట పడుతూ వచ్చాయి. 288 మంది మరణించినట్టు ఇప్పటిదాకా తేలింది. 1,175 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని పలు ఆస్పత్రుల్లో చేర్చారు. వీరిలో 700 మందికి పైగా డిశ్చార్జి కాగా మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరికాస్త పెరిగేలా కన్పిస్తోంది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి రిజర్వుడ్ ప్రయాణికులే 2,400 మంది దాకా ఉన్నారు. వీరు గాక జనరల్ బోగీల్లో భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అంతా కలిపి 3,000 మందికి పైగా ఉంటారని చెబుతున్నారు. ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యమే ప్రధాన కారణమని రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అదనపు పరిహారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయన వెంట ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వేతో సహా పలు శాఖ ఉన్నతాధికారులతో మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. ప్రమాద స్థలి నుంచి బాధితుల తరలింపు దాదాపుగా పూర్తయింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు వేలాది మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోదీ, రైల్వే మంత్రి బదులివ్వాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. పెను విషాద సమయం గనుక సహాయక చర్యలు పూర్తవడానికే ప్రస్తుతానికి ప్రాధాన్యమిస్తున్నామని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. లోకో పైలట్లకు గాయాలు భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో లోకోపైలట్ జీఎన్ మహంతి, సహాయ లోకో పైలట్ హజారీ బెహరా తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఇరువురూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి, ఉన్నత స్థాయి చికిత్స అందిస్తున్నారు. జీఎన్ మహంతికి పక్కటెముక విరిగింది. దుర్ఘటనలో ఊపిరితిత్తులు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అంతర్గత రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. హజారీ బెహరా ఎడమకాలి ఎముక విరగడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. -
నేడు కోమటిబండకు మోదీ
-
నేడు కోమటిబండకు మోదీ
‘మిషన్ భగీరథ’కు వేదికైన కోమటిబండ పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్న ప్రధాని 243 గ్రామాలకు ఏకకాలంలో నీటి సరఫరా సర్వత్రా ఉత్కంఠ.. ఆసక్తి అంతటా ఒకటే ఉత్కంఠ.. అందరిలోనూ ఆసక్తి.. పల్లె గొంతు తడిపే బృహత్తర ‘మిషన్‌భగీరథ’ స్వప్నం సాకారమయ్యే క్షణాలు సమీపించిన వేళ అందరి చూపూ గజ్వేల్ మండలంలోని కోమటిబండ వైపే.. గుక్కెడు నీళ్ల కోసం తండ్లాడిన మహిళలు.. నేటి నుంచి ఇంటి చెంతనే గోదావరి నీటిని ఒడిసి పట్టుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ప్రధాని నరేంద్రమోది ఆదివారం ప్రారంభించే ఈ కార్యక్రమానికి సంబంధించి సర్వం సిద్ధమైంది. గజ్వేల్: గజ్వేల్ మండలం కోమటిబండలో మోడీ సభకు సర్వం సిద్ధమైంది. జాతీయ స్థాయిలో చర్చనీయంశమయ్యేవిధంగా భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత... ప్రధాని తొలి పర్యటన కావడం ఈ సభకు మరో విశేషం. 1998లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రారంభించిన మంచినీటి పథకాన్ని అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ‘మిషన్ భగీరథ’గా పరిచయం చేస్తున్న ప్రతిష్టాత్మక మంచినీటి పథకానికి ఈ సభ వేదికవుతోంది. ప్రధాని పంప్‌హౌస్‌ను ప్రారంభించడంతో ఏకకాలంలో నియోజకవర్గంలోని 243 గ్రామాలకు నీటి సరఫరా జరగనుండడంతో... మహిళల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆదివారం నాటి సభపై అంతటా ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం నియోజకవర్గంలోని 243 గ్రామాల్లో 67275 నల్లా కనెక్షన్లను దాదాపు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే గజ్వేల్ మండలంలోని 27 ఆవాసాల్లోని 38931 జనాభాకు, జగదేవ్‌పూర్ మండలంలోని 42 ఆవాసాల్లోని 47073 జనాభాకు, కొండపాక మండలంలోని 38 ఆవాసాల్లోని 46766 జనాభాకు, ములుగు మండలంలోని 42 ఆవాసాల్లోని 39821 జనాభాకు, తూప్రా¯ŒS మండలంలోని 53 ఆవాసాల్లోని 47287 జనాభాకు, వర్గల్ మండలంలోని 46 ఆవాసాల్లోని 43278 జనాభాకు నీటి సరఫరాకు ఏర్పాట్లు జరిగాయి. దశాబ్ధాలుగా మంచినీటి కష్టాలతో తల్లడిల్లుతున్న జనం ఈ పథకంతో శాశ్వత పరిష్కారాన్ని పొందగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గజ్వేల్ మండలం కోమటిబండ, వర్గల్ మండలం మైలారం, నెంటూరు,, జగదేవ్‌పూర్ మండలంలోని తిమ్మాపూర్, అంగడి కిష్టాపూర్ గ్రామాల్లో మహిళలను ‘సాక్షి పలుకరించగా ఏండ్ల సంది మంచినీటికి అరిగోస పడుతున్నం... కేసీఆర్ సారూ పుణ్యమా అని... ఇక మంచినీటి గోస పోతుంది అంటూ మురిసిపోయారు. ఈ మంచి పథకాన్ని ప్రారంభించేం దుకు ఢిల్లీకెళ్ళి మోడీ సాబు వస్తుండట.. మేమ్ కూడా సభకు పోతున్నం... ఆడ చెప్పిన ముచ్చ ట్లు ఇంటం.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తరలింపునకు ఏర్పాట్లు సభకు 2 లక్షల మందికిపైగా జనాన్ని తరలించడానికి ఇప్పటికే ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 4500 ఆర్టీసీ బస్సుల్లో జనం తరలివస్తున్నట్లు చెబుతున్నారు. కోమటిబండ గుట్టపై హెడ్‌వర్కŠస్ ప్రాంతాన్ని ఎస్పీజీ బృందం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడికి ప్రధాని వచ్చే సందర్భంలో మీడియాకు కూడా ప్రవేశం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రధా ని హెలికాప్టర్లో కోమటిబండ సభాస్థలి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత కేసీఆర్‌తో కలిసి కాన్వాయ్‌లో కోమటిబండ గుట్టపై ఉన్న ‘మిష¯ŒS భగీరథ’ హెడ్‌వర్కŠస్పై పైలా¯ŒSను ఆవిష్కరిస్తారు. అలాగే, పంప్‌హౌస్, నల్లా నీటిని ప్రారంభిస్తారు. ఇదే ప్రదేశంలో తెలంగాణలోని ‘మిష¯ŒS భగీరథ’ 26 గ్రిడ్ల డిజై¯ŒSను సూచిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తారు. ‘మిషన్ భగీరథ’పై వీడియో ప్రదర్శన కూడా ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత ప్రధాని సభావేదిక వెనుక భాగంలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి, రామగుండం ఎరువులు కర్మాగారం పునఃరుద్ధరణ, వరంగల్ కాళోజి హెల్త్ అండ్ సైన్ యూనివర్సిటీ శిలాఫలకాల ఆవిష్కరణ, 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్స్టేన్ జాతికి అంకితం చేస్తారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలై¯ŒSకు శంకుస్థాపన చేస్తారు. వేదికపై పది మందే.. ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం కేసీఆర్, గవర్నర్ నర్సింహ¯ŒSతో పాటు ఐదుగురు కేంద్ర మంత్రులు, మరో 10 మంది మాత్రమే వేదికపై ఉంటారు. కుడివైపున ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, ఇతర ముఖ్యులు ఉంటారు. ఎడమవైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు కూర్చుంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేసే అవకాశముండగా... సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వందన సమర్పణ చేస్తారు. ఇది పూర్తి కాగానే ప్రధాని హెలిపాడ్ గుండా సుమారు 4:15 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. సభా వేదిక వద్ద సేద తీరే ఏర్పాట్లు ప్రధాని మోదీ సేద తీరేందుకు మూడు ప్రత్యేకమైన రెయి¯ŒSప్రూఫ్ గదులను ఏర్పాటు చేశారు. సభావేదిక వద్ద ప్రముఖులకు, మీడియాకు మధ్యాహ్నం 1 గంటకు భోజన ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు.. నెంటూరు–చౌదర్పల్లి–వర్గల్ చౌరస్తా– రాజీవ్ రహదారి మార్గంలో జన సంచారాన్ని నిలిపివేశారు. శనివారం ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. వీరు ప్రధాని గుట్టపై తిరిగే ప్రదేశాలు, సభావేదిక, హెలిపాడ్ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదిలా ఉంటే ‘మిష¯ŒS భగీరథ’ వైస్ చైర్మ¯ŒS వేముల ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిష¯ŒS తదితరులు సైతం ఏర్పాట్లు పరిశీలించారు.