breaking news
pilot tests
-
5G: రిలయన్స్ జియో ‘5జీ’ కసరత్తు.. ఓ రేంజ్‌లోనే!
Reliance Jio About 5G Plan: దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్క్ రిలయన్స్ జియో భారీ ప్రణాళికకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వెయ్యి నగరాల్లో 5జీ నెట్వర్క్ కవరేజ్‌ను విస్తరించేందుకు ప్లానింగ్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఫైబర్ సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు ఆయా సైట్లలో పైలట్‌ను నిర్వహిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ ప్రదర్శనలో జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ వివరాల్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1,000 టాప్ సిటీలకు 5G కవరేజ్ ప్లానింగ్ పూర్తయింది. 5జీ టెక్నాలజీతో హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో అధునాతన సదుపాయాలను ఉపయోగించి జియో ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. అంతేకాదు త్రీడీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ ద్వారా 5జీ సేవల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్లు థామస్ తెలిపారు. నెట్వర్క్ ఫ్లానింగ్ కోసం అత్యాధునిక సేవల్ని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రూ.151.6 కు పెరిగింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 8.6 శాతం ఎక్కువ. ఇటీవల జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. 2021 డిసెంబర్ నాటికి భారత్ లో జియో వినియోగదారుల సంఖ్య 42.1 కోట్లకు చేరింది. 2020తో పోలిస్తే దాదాపు కోటి మంది వినియోగదారులు జియోకు పెరిగారు. స్పెక్ట్రమ్ సంబంధిత బకాయిలన్నింటినీ టెలికం శాఖకు జియో ఇటీవలే ముందస్తుగా చెల్లించింది. 2021 మార్చి వరకు వడ్డీతో కలిపి మొత్తంగా రూ.30,791కోట్ల చెల్లింపు చేసింది. 5g స్పెక్ట్రమ్ వేలం ఈ వేసవిలోపే జరిగే అవకాశం ఉండగా.. ఈ లోపు జియో కసరత్తులు పూర్తి చేసుకోవడంతో పాటు 6జీ మీద ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. -
పరీక్షలు లేకుండానే.. విమానాలు నడిపేశారు!!
గడిచిన సంవత్సరంలో.. అంటే 2014లో ఏకంగా 320 మంది పైలట్లు తగిన సామర్థ్య పరీక్షలు చేయించుకోకుండానే విమానాలు నడిపేశారు. వాళ్లలో 219 మంది ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌కు చెందినవారు కాగా మరో 101 మంది మాత్రం ఎయిరిండియా వాళ్లు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. అత్యధికంగా జెట్ ఎయిర్వేస్ పైలట్లు 130 మంది ఈ పరీక్షలు చేయించుకోలేదు. తర్వాతి స్థానంలో ఎయిరిండియా నిలిచింది. ఈ పైలట్లందరికీ డీజీసీఏ వర్గాలు లైసెన్సులను సస్పెండ్ చేసి, హెచ్చరిక లేఖలు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. 19 కేసుల్లో అయితే పైలట్ లైసెన్సులు పొందడానికి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినట్లు కూడా జైపూర్‌లోని రాజస్థాన్ ఫ్లయింగ్ స్కూట్ చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ గుర్తించారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో అలాంటి కేసులేవీ డీజీసీఏ దృష్టికి రాలేదని అశోక్ గజపతి రాజు చెప్పారు.