పొలాల్లో వరికుప్పలు దగ్ధం
జి.మాడుగుల: విశాఖ జిల్లాలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల విలువైన చేతికొచ్చిన ధాన్యం అగ్నికి ఆహుతైపోయింది. జి.మాడుగుల మండలం కరకపల్లి గ్రామానికి చెందిన జమ్మిని నాగేశ్వరరావు, చిన్నారావు అనే రైతుల పొలాల్లో కోసిన వరిధాన్యాన్ని కుప్పగా పోశారు. ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదంలో వీరికి చెందిన వరికుప్పలు 70 శాతం కాలిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.