breaking news
Phnom Penh
-
చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండి అసభ్యంగా..
నాంఫెన్: అమెరికాలో ఓ వైమానిక సంస్థకు చెందిన మాజీ ముఖ్య కార్యదర్శికి పదేళ్ల జైలు శిక్ష పడింది. అతడు చైల్డ్ ప్రాస్టిట్యూషన్కు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు నిజమేనని ధ్రువీకరిస్తూ కాంబోడియా కోర్టు అతడికి శిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు భారీ మొత్తంలో ఫైన్ కూడా విధించింది. నాంఫెన్కు చెందిన వైమానిక సంస్థ ఎయిరో కాంబోడియాకు బ్రియాన్ నస్వాల్ (53) అనే వ్యక్తి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు. అతడు చైల్డ్ ప్రాస్టిట్యూషన్కు పాల్పడుతూ గత ఏడాది మే 22న పట్టుబడ్డాడు. కో పిచ్ అనే నాంఫెన్కు చెందిన దీవిలో ఓ పదమూడేళ్ల బాలికను మరో ఇద్దరు బాలికల ముందే అసభ్యకరంగా తాకాడు. అలా, మొత్తం ఎనిమిదిమంది బాలికలతో అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా అతడి నేరం చేసినట్లు కోర్టు కూడా స్పష్టం చేసింది. పదేళ్ల జైలు శిక్షతోపాటు బాధితులకు ఒక్కోకరికి దాదాపు రెండు వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అమెరికా చైల్డ్ సెక్స్ సంబంధించిన అంశాలను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. -
కంబోడియాలో వరదలు:168 మంది మృతి
దేశంలోని మెకంగ్ నదీ వరద పోటెత్తింది. దాంతో 168 మంది మరణించారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కమిటీ అధికార ప్రతినిధి కియో వై మంగళవారం కంబోడియా రాజధాని నామ్ ఫెన్ లో వెల్లడించారు. ఆ వరదల వల్ల 1.7 మిలియన్ల మంది నిరాశ్రయులయారని తెలిపారు. రూ.500 మిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. దాదాపు 500 హెక్టార్ల వరి పంట వరదల వల్ల నీట మునిగిందన్నారు. అలాగే దేశంలోని 240 కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రావెన్స్లు వరద నీటిలో మునిగి ఉన్నాయన్నారు.