Philippine president
-
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు దుతర్తే అరెస్ట్
మనీలా: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే మంగళవారం అరెస్ట య్యారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ఆయన్ను మనీలా లోని అంతర్జాతీయ విమా నాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చంపేయాలంటూ దుతర్తే ఇచ్చిన పిలుపుతో వేలాది మంది దారుణ హత్యకు గురవడం తీవ్ర వివా దాస్పదమైంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)ఆయనపై విచారణకు చర్యలు ప్రారంభించింది.అయితే, ఆ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఐసీసీ నుంచి వైదొలగుతున్నట్లు అధ్యక్షుడిగా ఉన్న దుతర్తే ప్రకటించారు. 2022 ఎన్నికల్లో ఫెర్డినాండ్ మార్కోస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతర పరిణామాల్లో దుతర్తేపై వచ్చిన ఆరోప ణలపై విచారణను తిరిగి ప్రారంభించనున్నట్లు 2023 జూలైలో ఐసీసీ ప్రకటించింది.జన హననా నికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై దుతర్తే కు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లకు స్పందనగానే దుతర్తేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలి పారు. దుతర్తేపై విచారణకు ఐసీసీకి సహక రిస్తామని అధ్యక్షుడు మార్కోస్ ప్రకటించారు. -
అధ్యక్షుడినే చంపేయిస్తా
మనీలా: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌లో రెండు శక్తివంత రాజకీయ కుటుంబాల మధ్య మళ్లీ అగ్గిరాజుకుంటోంది. ఈ కుటుంబాల మధ్య పాత వైరం మరోసారి బట్టబయలైంది. తన ప్రాణానికి ముప్పు వాటిల్లితే ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్ మార్కోస్ జూనియర్‌ను చంపేస్తానని ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టే బహిరంగ ప్రకటన చేసి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించారు. సారా డ్యుటెర్టే తండ్రి రోడ్రిగో డ్యుటెర్టేకు, ఫెర్డినాడ్ తండ్రి మార్కోస్ సీనియర్‌కు మధ్య చాన్నాళ్ల క్రితం బద్దశత్రుత్వం ఉన్న విషయం తెల్సిందే. ఫెర్డినాడ్ జూనియర్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా రాజీనామాచేసినప్పటికీ సారా ఇంకా దేశ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవలికాలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులకు అస్సలు పొసగట్లేదు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున సారా ఆన్లైన్లో మీడియాసమావేశంలో మాట్లాడారు. ‘‘నా యోగక్షేమాల గురించి ఎవరికీ ఎలాంటి భయాలు అక్కర్లేదు. అయితే మీకో విషయం చెప్తా. ఇటీవల నేను ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌తో మాట్లాడా. నా ప్రాణాలను హాని ఉండి, నన్ను ఎవరైనా చంపేస్తే వెంటనే దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్, ఆయన భార్య లిజా అరనేటా, పార్లమెంట్లో ప్రతినిధుల సభ స్పీకర్ మారి్టన్ రోమాల్డేజ్ను చంపేసెయ్. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకునేదాకా దాడిచెయ్ అని చెప్పా. అందుకే తను సరేనన్నాడు. ఇది సరదాకి చెప్పట్లేను. ఇది జోక్ కానేకాదు’’అని సారా చెప్పారు. అధ్యక్షుడిని అంతం చేయాలని కాంట్రాక్ట్ కిల్లర్‌తో మాట్లాడినట్లు స్వయంగా ఉపాధ్యక్షురాలే ప్రకటన చేయడంతో అధ్యక్షుడి కమ్యూనికేషన్స్ కార్యాలయం అప్రమత్తమైంది. ‘‘అధ్యక్షుని ప్రాణాలకు ఇంతటి హాని పొంచి ఉందని తెలిశాక భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం. రక్షణ బాధ్యతలను అధ్యక్షుడి రక్షణ దళాలకు అప్పజెప్తున్నాం. సారా వ్యాఖ్యలపై తగు చర్యలకు సిద్ధమవుతున్నాం’’అని కార్యనిర్వాహక కార్యదర్శి లూకాస్ బెర్సామిన్ చెప్పారు. 2022 మేలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మార్కోస్, ఉపాధ్యక్షురాలిగా సారా పోటీచేసి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్య ధోరణులు, తదితర అంతర్జాతీయ, దేశీయ అంశాల్లో ఇద్దరు నేతల మధ్య ఇటీవలికాలంలో తీవ్ర బేధాభిప్రాయాలొచ్చాయి. ఈమధ్య ఓసారి అధ్యక్షుడి తలను నరుకుతున్నట్లు ఆలోచనలొస్తున్నాయని సారా వ్యాఖ్యానించారు. ‘‘అధ్యక్షుడు అవినీతిలో కూరుకుపోయారు. పరిపాలించే సత్తా లేదు. అబద్ధాలకోరు. మా కుటుంబాన్ని రాజకీయంగా బలహీనపరచాలని కుట్ర పన్నుతున్నారు’’అని సారా ఆరోపించారు. సారా తండ్రి రోడ్రిగో డ్యుటెర్టో ఫిలిప్పీన్స్‌లో కరడుగట్టిన రాజకీయనేతగా పేరొందారు. దేశంలో మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపారు. దావో సిటీ మేయర్‌గా, ఆతర్వాత దేశాధ్యక్షుడిగా తన పరిపాలనాకాలంలో ‘డెత్ స్క్వాడ్’పేరిట వేలాది మంది డ్రగ్స్‌ముఠా సభ్యులను అంతమొందించారు. ఆనాడు దేశాధ్యక్షుడిగా ఉంటూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. సారా ప్రకటనపై దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ రోమియో బ్రేవ్నర్ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘లక్షన్నరకుపైబడిన దేశ సైనికులు ఎల్లప్పుడూ పక్షపాతరహితంగా పనిచేస్తారు. ప్రజాస్వామ్యయుత రాజ్యాంగబద్ధ సంస్థలు, పౌరవ్యవస్థల ఆదేశాలను శిరసావహిస్తారు’’అని అన్నారు. -
అమెరికా బలగాలు వెనక్కువెళ్లాల్సిందే
టోక్యో: రానున్న రెండేళ్లతో తమ దేశం నుంచి వెనక్కు వెళ్లిపోవాలని అమెరికా బలగాలను పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె కోరారు. టోక్యోలో జరుగుతున్న ఆర్థిక సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో బరాక్ ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ వెనక్కు తీసుకున్నారు. కాగా తమ భూ భాగంపై నుంచి ఇతర దేశాల సైన్యం వెళ్లిపోవాలని అమెరికాను ఉద్దేశించి అన్నారు. అలాగే అగ్ర దేశంతో రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే అంశాన్నీ పరిశీలిస్తామన్నారు. దశాబ్దాల క్రితం స్పానిస్ నుంచి పిలిప్పీన్స్‌ను కొనుగోలు చేసిన అమెరికా ఉగ్రవాదం పేరుతో ఇప్పటికీ ఆ దేశంలో మిలిటరీ బేస్ క్యాంప్‌లను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పతాక శీర్షికల్లో నిలవడం డుటెర్టెకు పరిపాటిగా మారింది. -
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఫిలిప్పీన్స్: డ్రగ్ డీలర్స్ను కాల్చి పారేయండంటూ ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్తు పదార్థాల దొంగ రవాణాపై చర్యలు తీసుకునే విషయాన్ని తాను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని, ఈ విషయం ఎవరికి నచ్చదో వారికి తాను వీర అభిమానినంటూ వ్యాఖ్యానించారు. ఏ డ్రగ్ డీలర్ అరెస్టుకు సహకరించకుండా వ్యతిరేకిస్తాడో అతడిని ప్రజలే కాల్చిపారేయాలని, లేదంటే కొట్టి చంపేయాలని ఆయన బహిరంగా వ్యాఖ్యాలు చేశారు. గత నెలలో (మే) 9న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డ్యూటర్టీ విజయం సాధించారు. ఈ సందర్భంగా తొలిసారి పెద్ద సమూహం మధ్య మీడియా కవరేజ్ లో మాట్లాడిన ఆయన డ్రగ్స్ కట్టడిలో తనకు ప్రజలంతా సహకరించాలని డిమాండ్ చేశారు. 'ఈ విషయం(డ్రగ్స్ కట్టడి)లో అంతా స్వేచ్ఛంగా ఆలోచించండి. మాకుగానీ, పోలీసులకు గానీ ఫోన్ చేయండి. లేదా మీరే చేయండి.. మీ దగ్గర తుపాకీ ఉందా మీకు నా మద్దతు ఉంటుంది. డ్రగ్స్ డీలర్లను కాల్చిపారేయండి. మీ సహకారం అందిస్తే ఆరు నెలల్లో అవినీతిని అంతం చేస్తాను. నేరాలను తగ్గిస్తాను. డ్రగ్స్ మాఫియాను తేలికగా తీసుకుంటే అది ఫిలిప్పీన్స్‌ను ఆక్రమిస్తుంది. దీనికి నేను ఏమాత్రం అంగీకరించను. ఇప్పటికే మీరు డ్రగ్స్‌లోనే మునిగి ఉంటే మిమ్మల్ని చంపేస్తాను. ఇది మీరు జోక్ తీసుకోవద్దు. ఈ విషయం మీరు నవ్వేందుకు చెప్పడం లేదు.. చాలా తీవ్రంగా భావించి చెబుతున్నాను' అని ఆయన అన్నారు.