breaking news
Phile lyandar
-
ఫీలే.. నిద్ర లేచింది!
తోకచుక్కపై మేలుకొన్న ఫీలే ల్యాండర్ పారిస్: భూమికి కోట్ల కి.మీ. దూరంలో వేగంగా దూసుకుపోతున్న ఓ తోకచుక్కపై దిగి, చీకట్లో పడిపోయి, మూగబోయిన ఫీలే ల్యాండర్ ఎట్టకేలకు మేలుకొంది! ఏడు నెలల తర్వాత శనివారం ‘హెలో.. ఎర్త్’ అంటూ భూమికి సందేశం పంపింది. ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) పదేళ్ల క్రితం ప్రయోగించిన రోసెట్టా వ్యోమనౌక గతేడాది నవంబర్‌లో ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను చేరడం, అదే నెల 12న ఫీలే అనే ల్యాండర్‌ను ఆ తోకచుక్కపైకి జారవిడిచి చరిత్ర సృష్టించడం తెలిసిందే. అయితే, తోకచుక్కపై పడిన ల్యాండర్ మూడు సార్లు ఎగిరి పడటంతో సూర్యరశ్మి సోకని చోట చీకట్లో ల్యాండ్ అయింది. దీంతో బ్యాటరీ అయిపోయేదాకా 60 గంటలు మాత్రమే పనిచేసి ఆ తోకచుక్కకు చెందిన సమాచారాన్ని ఫీలే భూమికి పంపింది. తోకచుక్క ప్రస్తుతం సూర్యుడి వైపుగా దూసుకుపోతుండటంతో ఫీలే ఉన్న చోట సూర్యరశ్మి పడుతోందని, దీంతో స్వల్పంగా రీచార్జ్ అయిన ఫీలే భూమికి రెండు నిమిషాలు సంకేతాలు పంపిందని, 40 సెకన్ల సమాచారం అందిందని ఆదివారం ఈసా వెల్లడించింది. తోకచుక్క చుట్టూ తిరుగుతున్న రోసెట్టా ద్వారా సంకేతాలను పంపుతూ ఫీలేను నిద్రలేపేందుకు శాస్త్రవేత్తలు మే నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్ముందు ఫీలేపై మరింత వెలుతురు పడి, బాగా పనిచేస్తుందని, మరికొన్ని ప్రయోగాలు చేసి సమాచారం పంపుతుందని భావిస్తున్నారు. ఇవీ విశేషాలు... 8 మంచు, ధూళి, వాయువులతో కూడి ఉండే తోకచుక్కలు సౌరకుటుంబం ఏర్పడిన తొలినాళ్లలో మిగిలిపోయిన పదార్థంతో ఏర్పడ్డాయని అంచనా. ఈ తోకచుక్కపై అధ్యయనం ద్వారా తోకచుక్కలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయన్నది తెలుసుకునేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. 8 67పీ తోకచుక్క ప్రస్తుతం భూమికి 30 కోట్ల కి.మీ. దూరంలో, సెకనుకు 31.24 కి.మీ. వేగంతో సూర్యుడి వైపు వెళుతోంది. 8 ఆగస్టు 13 నాటికి సూర్యుడికి అతి సమీపంలోకి చేరి, తిరిగి దూరం వెళ్లడం మొదలుపెడుతుంది. 8 రోసెట్టా, ఫీలే కలిసి 690 కోట్ల కి.మీ. దూరం ప్రయాణించి తోకచుక్కను చేరాయి. 8 ఫీలే బరువు భూమిపై 100 కిలోలు. తోకచుక్కపై గురుత్వాకర్షణ చాలా తక్కువ కాబట్టి.. అక్కడ ఒక కిలోనే! 8 67పీ తోకచుక్క 4. కి.మీ. వెడల్పు, 5 కి.మీ. పొడవు, బరువు 1000 కోట్ల టన్నులు ఉంటుంది. 8 రోసెట్టా జీవితకాలం 12 ఏళ్లు కాగా, ఈ ఏడాది డిసెంబర్ దాకా పనిచేయనుంది. -
తోకచుక్కపై తొలి అడుగు!
* దిగ్విజయంగా తోకచుక్కపై దిగిన ఫీలే ల్యాండర్ * పదేళ్లు ప్రయాణించి ల్యాండర్‌ను జారవిడిచిన రోసెట్టా వ్యోమనౌక * ఖగోళ చరిత్రలో అద్భుత ఘట్టం * ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) అరుదైన విజయం * చైనాకు మోదీ పరోక్ష చురక * దక్షిణ చైనా సముద్రంలో శాంతి నెలకొనాలని ఆకాంక్ష లండన్: ఖగోళ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. తొలిసారిగా ఓ తోకచుక్క చేతికి చిక్కింది. ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ పదేళ్లుగా అంతరిక్షంలో ప్రయాణించిన ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా)కు చెందిన రోసెట్టా వ్యోమనౌక ఎట్టకేలకు ఫీలే ల్యాండర్‌ను తోకచుక్కపైకి జారవిడిచింది. తోకచుక్కపై తమ ఫీలే ల్యాండర్ విజయవంతంగా దిగిందని బుధవారం ఈసా ప్రకటించింది. దీంతో ఓ తోకచుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను దింపిన ఘనతను ఈసా సొంతం చేసుకుంది. తోకచుక్కలపై అధ్యయనం ద్వారా 450 కోట్ల ఏళ్ల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. అందుకే సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈసా ఈ ప్రయోగం చేపట్టింది. ఉత్కంఠగా ఆ ఏడుగంటలు... ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న ‘67పీ’ తోకచుక్క సెకను 18 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకోసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ తోకచుక్క సమీపంలోకి వెళ్లి, దాని చుట్టూ తిరుగుతూనే ల్యాండర్ దానిపై పడేలా జారవిడవటం అనేది అతిక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ఈసా శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొంది. 2004లో నింగిలోకి వెళ్లిన రోసెట్టా పదేళ్లుగా తోకచుక్క వెంటాడుతూ ఈ ఏడాది సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ల్యాండర్‌ను జారవిడిచింది. సుమారు ఏడు గంటల పాటు 20 కి.మీ. దూరం కిందికి దిగిన ఫీలే ఎట్టకేలకు తోకచుక్కపై దిగిపోయి కొక్కేలను గుచ్చి దిగబడిపోయింది.