breaking news
Personal purposes
-
పోలీస్ దొంగాట@ఆళ్లగడ్డ
-
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వలసలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ సాక్షి, న్యూఢిల్లీ : సిద్ధాంతాలను నమ్ముకునే వారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లరని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వలస వెళతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వలసలు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా మాట్లాడుతూ ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్‌కు తమ పార్టీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు.