28న ప్రత్యేక హోదా ప్రజాబ్యాలెట్
–కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి
భీమవరం టౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజాతీర్పు కోరుతూ ఏపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 28న తిరుపతిలో ప్రజాబ్యాలెట్ నిర్వహించనున ్నట్టు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. భీమవరంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి తర్వాత జిల్లాల వారీగా బ్యాలెట్ కార్యక్రమం చేపడతామన్నారు. అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చాక హోదా అలంకారప్రాయమని అనడం సరికాదని ఆమె అన్నారు. విభజనకు బీజం వేసింది బీజేపీయే అని విమర్శించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముగ్గురు ఇన్చార్జిలను నియమించారని డీసీసీ అధ్యక్షుడు రఫీఉల్లాబేగ్ తెలి పారు. పనబాక లక్ష్మి, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నర్సింహరావు, సీనియర్ నేత రవణం స్వామినాయుడును నియమించారన్నారు.
కరపత్రాల ఆవిష్కరణ
టీడీపీ, బీజేపీ రెండేళ్ల పాలనా వైఫల్యాలు, హామీల అమలులో వంచన, ప్రత్యేక హాదాపై చేస్తున్న ద్రోహం తదితర అంశాలతో రూపొందించిన కరపత్రం, రాష్ట్ర విభజనకు ప్రధాన పార్టీలు ఇచ్చిన లేఖలు ముద్రించిన మరో కరపత్రాన్ని భీమవరంలో కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు.