breaking news
Pension sanctioned
-
అర్హులకు మాత్రమే ఇక పింఛన్లు
పింఛన్ల కోసం నిరంతరం కొనసాగుతున్న ఆందోళనలు, కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న దరఖాస్తులు అధికారులను ఊపిరి సలుపకుండా చేస్తున్నాయి. వృద్ధులు, మహిళలూ, వికలాంగులూ రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. * భారీ కసరత్తు చేస్తున్న అధికారులు * సమగ్రసర్వే వివరాల ఆధారంగా * వడపోత దిశగా కలెక్టర్ చర్యలు ప్రగతినగర్: అర్హులకే ఆసరా పథకం అమలయ్యేలా జిల్లా అధికార యంత్రాంగం భారీ కసరత్తే చేస్తోంది. కలెక్టర్ రొనాల్డ్ రోస్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆయన సూచనల మేరకు అధికారులు జాబితాలను సరి చూస్తున్నారు. లబ్ధిదారులు దరఖాస్తులలో పేర్కొ న్న వివరాలను సమగ్ర సర్వే వివరాలతో పోల్చి చూస్తున్నారు. అవి, ఇవి సరిపోతేనే పింఛన్ మంజూరు ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,00,690 పింఛన్లను మంజూరు చేశారు. వాటిని పంపిణీ చేస్తున్న క్రమంలో చాలా మంది అర్హులకు పింఛన్ మంజూరు కాలేదనే విమర్శలు వినిపించాయి. నిరసనలు వ్యక్తమయ్యాయి.ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.దీంతో ప్రత్యే క కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కౌంటర్లతోపాటు, ప్రజావాణి, మండల కేంద్రాలలో వచ్చిన దాదాపు 60 వేల దరఖాస్తులను నిశితంగా పరిశీలించే పనిలో అధికారులు పడిపోయారు. పింఛన్ కోసం కోసం దరఖాస్తు చేసుకొంటే గతంలో సంబంధిత మున్సిపాలిటీ, మండలాల అధికారులు, బీఎల్ఓ,గ్రామ కార్యదర్శి చేత సర్వే చేయించేవారు. వారు దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్లో డీఆర్డీఏకు పంపించేవారు. ఇపుడు అలా కాకుండా, గత అగస్టు 19న చేపట్టిన సర్వే ఆధారంగా వివరాలను సరి చూస్తున్నారు. అనంతరమే డీఆర్డీఏ కు పంపిస్తున్నారు. ఈ విధానంతో అర్హులకు తప్పకుం డా పింఛన్ అందుతుందని భావిస్తున్నారు. సమగ్ర సర్వే అనంతరం చాలా మందికి పింఛన్లలో కోత విధించడంతో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఉన్న పింఛన్ నిలిపేశారు చిన్నప్పటి నుంచి మాట రాని నాకు గత నవంబర్ వరకు రెండు వం దల రూపాయల పిం ఛన్ వచ్చేది. ఇటీవల జరిపిన సర్వేలో భాగంగా నాకు పించన్ రాకుండా చేశారు. దీంతో నేను షాక్కు గురయ్యాను. తల్లిదండ్రులకు భారంగా మారానని కుమిలిపోతున్నాను. నాకు అధికారులే న్యాయం చేయాలి. - సుజిత్ రెడ్డి, మూగ విద్యార్థి, నిజామాబాద్ మై నైజాంకే జమానేమే పైదా హువా మై నైజాంకే జమానే మే పైదా హువా బేటా. హమారేకో ఉమర్ క్యామాలుమ్. నవంబర్ సే పింఛన్ నహీ ఆరా! అభీ క్యా కరూంగా, ఇస్సే పహిలే దో సౌ రూపియే ఆతేథే. అబ్ వోభీ రుక్గయే. కైసాభీ కర్కే హమారేకో పింఛన్ దిలాదో బేటా. -నజర్ అహ్మద్,నిజామాబాద్ ఉమర్కే లియే కహా జావూ మై ఉమర్కే లియే కహా జావూ, కిదర్ జావూ. పింఛన్ నికాల్కే అన్యాయ్ కర్దియా. మైతో స్వాతంత్స్రే పైలే పైదా హువీ. హమారేకో భీ పింఛన్ నహీ దియేతో కైసా బేటా. ఉమర్కా సర్టిఫికేట్ లావ్ బోల్తే. అబ్ కహా మిలేగా. బుడ్డే లోగోంకో సతానా అచ్ఛా నహీ హోతా బేటా - అజ్మీరాబేగం, నిజామాబాద్ -
ఈ పాపకు 52ఏళ్లా..!
చిన్నారికి ‘ఆసరా’ పెన్షన్ మంజూరు చేసిన జోగిపేట ఆధికారులు జోగిపేట: జోగిపేట పట్టణానికి చెందిన దీక్షిత అనే పాపకు ఆసరా పథకం కింద అధికారులు వెయ్యిరూపాయలు మంజూరు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పట్టణంలోని 17వ వార్డులో దీక్షిత పేరు మీద మూడవ విడత కార్యక్రమంలో పెన్షన్ మంజూరైంది. ఇంత చిన్నారికి పెన్షన్ ఎలా మంజూరైందంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పైగా జాబితాలో పాపకు 52 ఏళ్లని, చేనేత కార్మికురాలని పేర్కొన్నారు. నగర పంచాయతీ కమిషనర్ ప్రభాకర్ దృష్టికి ఈ విషయం తీసుకువెళితే ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


