breaking news
Peddamudium
-
చాళుక్య వంశ మూలపురుషుడి జన్మస్థలం.. ‘పెద్దముడియం’
జమ్మలమడుగు: ప్రాచీన మధ్య యుగ దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన రాజవంశాలలో చాళుక్యవంశం ఒకటి. బాదామి(వాతాపి) చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కల్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు ఇలా శాఖోపశాఖలుగా దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలను సుదీర్ఘంగా పలించిన చాళుక్య వంశంలో మూల పురుషుడు విష్ణువర్థనుడు. విష్ణువర్థనుడు దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం గురించి వీరచోడుడు వేయించిన చెల్లూరు(తూర్పుగోదావరి జిల్లా) తామ్రా శాసనం వివరిస్తుంది. ఈ శాసనం ప్రకారం చాళుక్యులు అయోధ్యా నగరానికి చెందిన చంద్రవంశరాజులు. వీరి పరంపరలో ఉదయనుడు అనే రాజు తరువాత 59 మంది రాజులు అయోధ్యను పాలించారు. తరువాత ఆ వంశంలోని విజయాదిత్యుడు అనే రాజు దక్షిణ జనపథానికి వచ్చాడు. విజయాదిత్యుడు పల్లవ రాజు త్రిలోచనుడుకి జరిగిన యుద్ధంలో విజయాదిత్యుడు మరణించాడు. విజయాదిత్యుడి భార్య అప్పటికే గర్భవతి. ఆమె ముదివేము అనే అగ్రహారంలో విష్ణుభట్ట సోమయాజి అనే బ్రహ్మణుడి వద్ద ఆశ్రయం పొందింది. ఆమెకు మగ శిశువు జన్మించగా తమకు ఆశ్రయం ఇచ్చిన విష్ణుభట్ట పేరుమీద ఆ రాణి ఆ బాలుడికి విష్ణువర్థనుడు అని పేరు పెడుతుంది. విష్ణువర్థనుడు పెరిగి పెద్దయిన తర్వాత జరిగిన చరిత్రంతా తల్లి ద్వారా తెలుసుకుని చాణ్యు గిరికి వెళ్లి నందాదేవిని ఆరాధించి, కుమార నారాయణ, మాతృగణములను తృప్తి పరచి రాజచిహ్నాలైన శ్వేతా పత్రంలో శంఖము, పంచ మహా శబ్దము జెండా(పాలికేతన) వరాహా లాంఛనములు, పింఛ కుంత(బల్లెము) సింహాసనం మొదలైన వాటిని తీసుకుని కాదంబ, గాంగ రాజులను ఓడించి సమస్త దక్షిణ పథమును ఏలినాడు. ఈ విష్ణువర్థనుడే బాదామి చాణక్యులకు మూల పురుషుడు. చెల్లూరు శాసనంలో ముదివేము నేడు కడప జిల్లాలో ఉన్న పెద్దముడియం అని 1903లో జమ్మలమడుగు తాలూకా డివిజన్ ఆఫీసర్ అయిన శ్రీరామయ్య పంతులు ప్రతిపాదించారు. నేడు కడప జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో పెద్దముడియం మండలకేంద్రంగా కుముద్వతీ (కుందూ)నది తీరాన ఉన్నది పెద్దముడియం. విష్ణు వర్థనుడి తండ్రి విజయాదిత్యుడు యుద్ధం చేసింది త్రిలోచన పల్లవుడితో కాగా పెద్దముడియం ఆగ్రహారాన్ని దానమిచ్చింది కూడా త్రిలోచన పల్లవుడే. పెద్దముడియం శాసనాలలో విష్ణు వర్ధునుడి జన్మ వృత్తాంతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. -
పంటను కాల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
జమ్మలమడుగు/పెద్దముడియం: పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తకు సంబంధించిన శనగ పంటను కాల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హనుమంతరెడ్డి, పోరెడ్డి మహేశ్వరరెడ్డి బాధితులతో కలిసి రూరల్ స్టేషన్లో సీఐ మురళినాయక్తో మాట్లాడారు.లక్షలు పెట్టుబడులు పెట్టి భూములు కౌలుకు తీసుకొని సాగుచేసిన శనగ పంటను రాత్రికి రాత్రే కాల్చివేడయం దారుణమన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన ఏ వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడరని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరిగిందని, వారిపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తే దానికి పోలీసులు సహకరించడం వల్ల తిరిగి గ్రామాల్లో ఫ్యాక్షన్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామ నాయకుడు చక్రపాణి రెడ్డి అతని అనుచరులు కాల్చారంటూ రూరల్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కక్షతోనే పంటను కాల్చేశారు.. తాను వైఎస్సార్సీపీకి మద్దతు దారుడిగా ఉన్నానని, ఆర్థికంగా దెబ్బతియాలనే ఉద్దేశంతోనే దాదాపు రూ. 12 లక్షల విలువగల శనగ పంటను కాల్చేశారని బాధితుడు శేఖర్‌రెడ్డి వాపోయారు. తనపై కుట్ర పని మొత్తం 29 ఎకరాల పంటను కాల్చిబూడిదచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చక్రపాణిరెడ్డి, రామసుబ్బయ్య, రామచంద్రుడు ,వెంకటేశ్వర్లు, గంగాధర్‌లు కాల్చేశారని కన్నీంటిపర్యంతమయ్యారు. కఠిన చర్యలు తీసుకుంటాం– డీఎస్పీ తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ టి.సర్కార్ అన్నారు. సోమవారం ఆయన కల్వటాల గ్రామంలో తగులబడిన శనగ పంటను పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తామని తెలిపారు.