patients complain
-
డాక్టర్లకూ రేటింగ్ తంటాలు పేషెంట్లు జాగ్రత్త!
ఒకప్పుడు డాక్టర్ అంటే దైవంతో సమానం. ఇప్పుడు ఒక ‘ప్రోడక్ట్’తో సమానం!అమెజాన్ లో మిక్సీ కొనేటప్పుడు ముందు రేటింగ్, తర్వాత రివ్యూలు చూస్తాం. ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడూ ఇదే స్టోరీ ‘రేటింగ్ తక్కువగా ఉందంటే వద్దు!’ఇప్పుడు ఇదే అలవాటు ఆరోగ్య రంగంలోకి కూడా వచ్చేసింది. ఫోన్ లో డాక్టర్ పేరు టైప్ చేస్తే చాలు, పక్కనే మెరుస్తున్న ఐదు స్టార్లు. అంతే, మన మెదడు వెంటనే ‘ఈ డాక్టర్ బాగుంటారు!’ అనే తీర్పు చెప్పేస్తుంది. ఇలా వైద్యుడి నైపుణ్యం కంటే, వెబ్సైట్లో కనిపించే స్టార్లకే ప్రాధాన్యత! అయితే ఆన్ లైన్ లో జరుగుతున్న ఈ స్టార్ వార్స్‌లో, ప్రాణం విలువ నిజంగా ఆ ఐదు స్టార్లేనా?డిజిటల్ యుగం పుణ్యమా అని, ఒకప్పుడు ఆసుపత్రి క్యూల్లో గంటల తరబడి తపస్సు చేయాల్సిన పేషెంట్లు ఇప్పుడు సోఫాలో కూర్చునే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పై డాక్టర్ల ‘జాతకాలు’ చూసేస్తున్నారు. అపాయింట్మెంట్ బుక్ చేయడం ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసినంత ఈజీ అయిపోయింది! ముందు ఆసుపత్రి నాలుగు గోడల మధ్య గుట్టుగా సాగిపోయే వైద్యం ఇప్పుడు రివ్యూలు, రేటింగ్స్‌తో పారదర్శకంగా మారింది. రోగుల చేతిలోకి ఒక డిజిటల్ మైక్ వచ్చినట్టే. తమ అనుభవాన్ని ప్రపంచానికి చెప్పే అవకాశం దొరికింది. కాని, ఇక్కడే అసలు కామెడీ మొదలైంది. కొన్ని రివ్యూలు చదివితే నవ్వాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాదు. ‘డాక్టర్ ప్రాణాలు కాపాడారు. కాని, క్లినిక్ బయట పార్కింగ్ లేదు. అందుకే ఒక స్టార్!’ అని ఒకరు.ఇంకొకరు, ‘నా సర్జరీ సక్సెస్ అయింది. హాస్పిటల్లో వైఫై సిగ్నల్ సరిగ్గా లేదు’ అని, మరొకరు, ‘డాక్టర్ గారు రాసిన మందులు వాడాక జ్వరం తగ్గింది. కాని, ఆయన చెప్పిన డైట్ పాటించడం చాలా కష్టంగా ఉంది.’ అంటూ కొన్ని కొన్ని విచిత్రమైన కారణాలతో సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చే బ్యాచ్ తయారైంది. ఇలాంటి బ్యాచ్‌తో వైబ్సైట్లో వైద్యుడి హస్తవాసితో పనిలేకుండానే, ఆయన స్టార్ పవర్ తగ్గుతూ పోతుంటే, ఇంకొంతమంది ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్యాకేజీలు, పేషెంట్లను ప్రత్యేకంగా రివ్యూలు పెట్టమని అడగడం, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించడం, లేదా డిజిటల్ మార్కెటింగ్ సహాయంతో మంచి రేటింగ్స్‌ను పెంచుకోవడం జరుగుతోంది.ఇలా నిజమైన వైద్య నైపుణ్యంతో సంబంధం లేకుండానే, కొందరి ప్రొఫైల్‌లు ఆన్ లైన్ లో ఎక్కువ ‘స్టార్స్’తో మెరిసి పోతుంటాయి. దీంతో, కొత్తగా డాక్టర్‌ను వెతుకుతున్న పేషెంట్లకు, ఎవరి నైపుణ్యం నిజంగా ఎంత ఉందో అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది. మరి ఇది నిజంగా పెరిగిన జవాబుదారీతనమా లేక డిజిటల్ లోకం తెచ్చిన కొత్త రకం రేటింగ్ వెర్రా అనే ఈ వింత పరిస్థితిని చూస్తుంటే, ఈ ‘స్టార్ల’ వెనుక ఉన్న అసలు కథను కాస్త లోతుగా తవ్వి చూడాల్సిందే! ఒకప్పుడు డాక్టర్ ఎంపిక ఎలా ఉండేది?కొన్ని సంవత్సరాల క్రితం వరకు డాక్టర్‌ను ఎంచుకోవడం ఒక చిన్న సామాజిక ప్రక్రియలా ఉండేది. మంచి డాక్టర్ పేరును గూగుల్ కంటే ముందు పక్కింటి వాళ్లే చెప్పేవారు. అందుకే, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే, మొదట ఫోన్ తిప్పేది పక్కింటి వారికే. ‘ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతారు’ అనే ఒక మాటే సిఫారసుగా సరిపోయేది. ఇలా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహచరుల మాటలతోనే నమ్మకం పంచుకునేది. ఆ నమ్మకం ఒక్కరోజులో ఏర్పడేది కాదు. అనుభవాల నుంచి, కాలంతో పెరిగిన విశ్వాసం నుంచి అది వస్తుంది. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైద్యం కూడా ఒక కొత్త స్టార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రపంచంలో ఏళ్ల తరబడి చదువు, అనుభవం, వేలాది రోగులకు చేసిన చికిత్స ఇవన్నీ ఐదు చిన్న స్టార్లలోనే సరిపెట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ఆన్ లైన్ డాక్టర్ రేటింగ్స్‌ను నిజంగా విశ్వసించాలా? లేక కొంచెం ఆలోచించాలా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు కొన్ని విషయాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. రేటింగ్స్ చెప్పేది ఏమిటి? ఆన్ లైన్ రివ్యూలు ఎక్కువగా ఒక రోగి అనుభవాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. అందుకే, ఆ రివ్యూలు చదువుతుంటే మనకు డాక్టర్ ‘సర్జరీ’ కంటే, అక్కడ దొరికే ‘లగ్జరీ’ గురించే ఎక్కువ సమాచారం ఉంటుంది. డాక్టర్ ఎలా మాట్లాడారు? ఎంతసేపు వేచి చూడాల్సి వచ్చింది? సిబ్బంది ఎలా వ్యవహరించారు? హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి అంశాలపై ఆధారపడి ఎక్కువగా రివ్యూలు వస్తాయి. ఇవి ఆరోగ్య సేవలో ముఖ్యమైన భాగమే అయినా, ఇక్కడే, డాక్టర్ అసలు నైపుణ్యం ఈ స్టార్ల మధ్యలో నలిగిపోతోంది. వైద్యం అంటే కేవలం తీపి మాటలు, మెరిసే టైల్స్ కాదు. అది ఏళ్ల తరబడి చేసిన తపస్సు, క్లిష్ట పరిస్థితుల్లో సెకన్ల వ్యవధిలో తీసుకునే ప్రాణసంకట నిర్ణయాల సమ్మేళనం! అందుకే, ఒకే చికిత్స ఇద్దరు వేర్వేరు పేషెంట్స్‌కు చేసినా ఫలితం ఒకేలా ఉండదు. ఒకరు వారం రోజుల్లో జిమ్‌కి వెళ్తే, మరొకరు నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావచ్చు.వయసు, వ్యాధి తీవ్రత, ఆ వ్యక్తి శరీర తత్త్వం వంటి బోలెడు ట్విస్టులు ఈ చికిత్స వెనుక ఉంటాయి. కాని, ఆన్ లైన్ రివ్యూ ఇచ్చే పేషెంట్ మాత్రం, ‘పక్కింటి పుల్లయ్యకి మూడు రోజుల్లో తగ్గింది, నాకు ఐదు రోజులైనా తగ్గలేదు.. సో వన్ స్టార్!‘ అని తీర్పు ఇచ్చేస్తుంటారు. పాపం, మెడికల్ సైన్ ్స లోని లోతుపాతులను పక్కన పెట్టి, కేవలం ఆ క్షణం కలిగిన ‘అనుభవం’ ఆధారంగానే మార్కులు వేసేస్తున్నారు. అందుకే గుర్తుంచుకోండి– ఆ స్టార్ రేటింగ్స్ అవి ఒక అనుభవాన్ని మాత్రమే నమోదు చేస్తాయి. కాని, అది డాక్టర్ మేధస్సుకు సర్టిఫికెట్ కాదు! అసంతృప్తి గళం ఎక్కువగా వినిపిస్తుంది! మనిషి సాధారణ నైజం, అన్నీ బాగానే ఉన్నప్పుడు హాయిగా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అదే ‘మౌనం అర్ధాంగీకారం’ అన్నట్టే. చికిత్స అద్భుతంగా జరిగి ప్రాణాలు నిలబడినా, ‘అబ్బా, డాక్టర్ గారు దేవుడండీ!’ అని మనసులో అనుకుని ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. కాని, ఫోన్ తీసుకుని రివ్యూ రాయాలని మాత్రం ఎక్కువగా అనిపించదు. అదే, ఆసుపత్రి వాతావరణంలో కాని, డాక్టర్ నిర్లక్ష్యం, మరేదైనా చిన్న అసంతృప్తి వచ్చినా సరే, వెంటనే, తనలోని ‘సోషల్ మీడియా సింహం’ గర్జిస్తుంది! ఎవరూ అడగకపోయినా పేజీల కొద్దీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ అడ్వైజ్ సంస్థ నివేదిక ప్రకారం, కొత్త వైద్యుడిని ఎంచుకునే ముందు దాదాపు 94 శాతం రోగులు ఆన్ లైన్ రివ్యూలను పరిశీలిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ రివ్యూలలో చాలా భాగం అసంతృప్తి చెందిన రోగుల నుంచే వస్తున్నాయి. సుమారు 70 శాతం మంది రోగులు తమకు కోపం వచ్చినప్పుడు మాత్రమే రివ్యూ రాస్తారని ఈ సర్వే చెబుతోంది. దాంతో చికిత్సతో సంతృప్తి చెందిన చాలామంది రోగుల అభిప్రాయాలు ఆ వెబ్సైట్లలో కనిపించకుండా పోతున్నాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా వందమందికి ప్రాణం పోసిన డాక్టర్‌కు వచ్చిన ప్రశంసలు నిశ్శబ్దంగా ఉండిపోతే, పార్కింగ్ దొరకలేదని ఒక పేషెంట్ ఇచ్చే ఆ ఒక్క ‘స్టార్’ మాత్రం పెద్దగా కనిపిస్తుంది. ఆ ఒక్క రేటింగ్ వెనుక వందలమంది సంతృప్తి చెందిన రోగుల మౌనం దాగి ఉందని చాలామంది గుర్తించరు. అందుకే ఆన్ లైన్ స్టార్లను చూసి డాక్టర్‌ను అంచనా వేయడం అంటే, సినిమా ట్రైలర్లో ఒక సీన్ చూసి, సినిమా మొత్తం ఎలా ఉందో తీర్పు చెప్పేసినట్టే! ఒక నక్షత్రం, ఒక ప్రతిష్ఠ! నెగటివ్ రివ్యూల ప్రభావం ఇప్పుడు ఒక సైలెంట్ వైరస్‌లా మారుతోంది. ఒక్క నెగటివ్ రివ్యూ కూడా కొన్ని సందర్భాల్లో ఒక డాక్టర్ ప్రతిష్ఠను తీవ్రంగా ప్రభావితం చేయగలదు. వందమంది రోగుల వ్యాధులను నయం చేస్తే వచ్చే కాస్తో కూస్తో గుర్తింపు, అసంతృప్తి చెందిన ఒక్క రోగి రాసే ఘాటైన రివ్యూతో ఆ డాక్టర్ ప్రతిష్ఠ డిజిటల్ నడిబజారులో మంటగలసిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ నెగటివ్ వ్యాఖ్యలు నిమిషాల్లో వేలాది మందికి చేరిపోతాయి. నిజం బయటపడేలోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చినట్టే, ఆ డాక్టర్ నైపుణ్యంపై ఒక వ్యతిరేక ముద్ర పడిపోతుంది.ఇక్కడ అసలు చిక్కు ఏమిటంటే, డాక్టర్లు తమ వృత్తి గోప్యత, నైతిక విలువల కారణంగా ఈ రివ్యూలకు బహిరంగంగా స్పందించలేరు. పేషెంట్ తన అనుభవాన్ని బహిరంగంగా చెబుతాడు. కాని, ‘ఆపరేషన్ థియేటర్లో నిజంగా ఏమైంది?’ అనే విషయాన్ని డాక్టర్ డిజిటల్ వేదికలపై వివరించలేడు. దాంతో ఆయన మౌనంగా ఉండాల్సిందే. ఈ ఏకపక్ష పరిస్థితి వల్ల డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినడమే కాకుండా, కొత్తగా వచ్చే పేషెంట్లు కూడా ఆ స్టార్ రేటింగ్స్ చూసి భయపడి మంచి వైద్యులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. ఇంకో వైపు, సరుకు లేని డబ్బా ఎక్కువ చప్పుడు చేసినట్లు, కొన్ని ఆసుపత్రుల్లో జరిగే హడావిడి ప్రచారం, ఆకర్షణీయమైన ప్రదర్శనలతో మెరిసే రేటింగ్స్ చూసి మోసపోయే పేషెంట్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది.వైద్యులపై ఆన్ లైన్ రేటింగ్స్ విశ్లేషణ1 చెప్పటం లేదు?సుమారు 88 శాతం సంతృప్తి చెందిన రోగులు రివ్యూ రాయడానికి ముందుకు రారు.2 అసంతృప్తి అసంతృప్తి చెందిన రోగులు సుమారు 21 శాతం ఎక్కువగా ఆన్ లైన్ లో రివ్యూ రాస్తున్నారు.3 సౌకర్యాలు దాదాపు 70 శాతం రివ్యూలు వెయిటింగ్ టైమ్, సిబ్బంది ప్రవర్తన, పార్కింగ్ వంటి సౌకర్యాలు, బిల్లింగ్ వెసులుబాట్లు, ఆఫర్లు, ప్యాకేజీల గురించే ఉంటాయి.4 నైపుణ్యం కేవలం 30 శాతం రివ్యూలు మాత్రమే డాక్టర్ నైపుణ్యం, చికిత్స నాణ్యత ఆధారంగా ఉంటున్నాయి.5 నకిలీ రివ్యూలు కొన్ని సందర్భాల్లో సంస్థలు తమ ప్రతిష్ట పెంచుకోవడానికి సుమారు 10 శాతం వరకు రివ్యూలను స్వయంగా జోడించే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.ఆన్ లైన్ వైద్య రేటింగ్స్‌పై పరిశోధనలు – గణాంకాలు...హార్వర్డ్ వైద్య పాఠశాల అధ్యయనం ప్రకారం, ఆన్ లైన్ రేటింగ్స్ వైద్య రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. సుమారు 800 మంది వైద్యులు, 400 మందికి పైగా రోగులు పాల్గొన్న వివిధ పరిశోధనల విశ్లేషణ ప్రకారం, దాదాపు 78 శాతం వైద్యులు ఆన్ లైన్ లో వచ్చే నెగటివ్ వ్యాఖ్యలు తమపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సుమారు 46 శాతం వైద్యులు ఈ రేటింగ్స్ వల్ల వైద్యుడు, రోగి మధ్య ఉండాల్సిన నమ్మకం, సంబంధం దెబ్బతింటున్నాయని అభిప్రాయపడ్డారు.డిజిటల్ ప్రపంచంలో స్టార్లు మెరుస్తున్నాయంటే, నిజం చీకటిలో దాగుందని అర్థం. అందుకే డాక్టర్‌ను ఎంచుకునేటప్పుడు స్టార్స్ కంటే, అనుభవం, సామర్థ్యాన్ని నమ్ముకోవడం ఉత్తమం. చివరికి జీవితాన్ని కాపాడేది వెబ్సైట్లో మెరిసే స్టార్లు కాదు, వైద్యుడి చేతిలోని నిజమైన నైపుణ్యమే.డాక్టర్లకు స్మార్ట్ టిప్స్ఈ డిజిటల్ ప్రపంచంలో స్టెతస్కోప్ పక్కనే ఇప్పుడు మరో శక్తిమంతమైన సాధనం ఉంది. అదే స్టార్ రేటింగ్. అందుకే ఇప్పుడు వైద్యరంగంలో పేషెంట్‌ను మాత్రమే కాదు, రివ్యూను కూడా కేర్ చేయాలి! దాదాపు 94 శాతం మంది పేషెంట్లు ఒక డాక్టర్‌ను ఎంచుకునే ముందు ఆన్ లైన్ రివ్యూలు చదువుతారు. దాదాపు 77 శాతం మంది కొత్త డాక్టర్ కోసం వెతకడం కూడా గూగుల్‌తోనే మొదలుపెడతారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, నాలుగు స్టార్లకంటే తక్కువ రేటింగ్ ఉంటే 84 శాతం మంది సిఫారసు చేసిన డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లరు! అంటే ఇప్పుడు వైద్య నైపుణ్యం ఎంత ముఖ్యమో, డిజిటల్ స్టార్ పవర్ కూడా అంతే ముఖ్యమైపోయింది.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సెర్చ్ రిజల్ట్స్‌లో ర్యాంకింగ్‌లో దాదాపు 13 శాతం ప్రభావం ఆన్ లైన్ రివ్యూలదే. ఎందుకంటే 92 శాతం మంది గూగుల్‌లో మొదటి పేజీ కూడా దాటరు. అంటే మొదటి పేజీలో కనిపించకపోతే, మీరు ఉన్నా లేనట్టే! అందుకే, ఆన్ లైన్ లో డాక్టర్ లేదా ఆసుపత్రి యాజమాన్యం తమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి నిపుణులు సూచించిన కొన్ని సింపుల్, స్మార్ట్ టిప్స్ ఇవి. ముందుగా వినండి, తర్వాత స్పందించండి.సోషల్ మీడియా, గూగుల్ రివ్యూలు, కామెంట్లు ఇవన్నీ ఇప్పుడు పేషెంట్ల డిజిటల్ ఫీడ్‌బ్యాక్ బాక్స్ లాంటివి. అక్కడ ఏమి జరుగుతోంది అన్నది తరచు గమనించాలి. ఎక్కడైనా పేషెంట్ ప్రశంసిస్తే వెంటనే స్పందించాలి. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే మరింత త్వరగా స్పందించాలి. హ్యాష్‌ట్యాగ్‌లు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలు ఏదైనా మీ హాస్పిటల్ గురించి వస్తే అది మీకు ఒక ముఖ్యమైన సూచనగా తీసుకోవాలి.స్పందనకు ఒక ప్లాన్ ఉండాలి.ఎవరైనా రివ్యూ పెట్టగానే ఎలా స్పందించాలి? ఎవరు స్పందించాలి? ఏ టోన్ లో మాట్లాడాలి? ఇవన్నీ ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ హాస్పిటల్ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా ఒక ‘వాయిస్’ ఉండాలి. సున్నితంగా, మానవీయంగా, నిజాయితీగా. ముఖ్యంగా పేషెంట్ సమాచారాన్ని ఎప్పుడూ పబ్లిక్‌గా చెప్పకూడదు. అవసరమైతే ప్రైవేట్‌గా మాట్లాడి సమస్యను పరిష్కరించాలి.రోజువారీ అలవాటుగా మార్చండి.రివ్యూలను ఒకసారి చూసి వదిలేయడం కాదు. ప్రతిరోజూ గమనించడం, స్పందించడం అలవాటుగా మారాలి. టీమ్‌లో ఎవరికైనా ఈ బాధ్యత అప్పగించాలి. ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఎక్కువగా వస్తోంది? ఎక్కడ మెరుగుపరచాలి? అన్నది అనలిటిక్స్ ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆన్ లైన్ సెర్చ్ ద్వారా హాస్పిటల్లకు వచ్చే పేషెంట్లు ఆఫ్‌లైన్ పద్ధతుల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.∙ దీపిక కొండి -
Corona patients: ఆక్సిజన్ అందక.. లైన్లో ఉండలేక..
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్): ‘సమయం మధ్యాహ్నం 12.50 గంటలు.. పాతబస్తీ నుంచి 26 ఏళ్ల యువతిని కుటుంబ సభ్యులు కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 78 నుంచి 84 మధ్య ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. ఎమర్జెన్సీ అమ్మా.. తొందరగా అడ్మిట్ చేసుకోండంటూ కుటుంబ సభ్యులు అక్కడున్న సిబ్బందిని ప్రాధేయపడ్డారు.ఎవరైనా ఒకటేనమ్మా లైన్లో నిలబడండి, రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ స్లిప్ లెఫ్ట్‌లో ఉన్న క్యాబిన్లో ఇవ్వండనే సమాధానం వచ్చింది. అప్పటికే లైన్లో 15మందికి పైగా ఉన్నారు. వారందర్నీ రిక్వెస్ట్ చేసిన కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేశారు. స్లిప్ తీసుకుని ఎడమవైపు ఉన్న సమాచార క్యాబిన్లో ఉన్న నర్సులకు ఇచ్చారు. ఇక ఇక్కడ నిమిషాల కొద్దీ ఆలస్యం. సుమారు 45 నిమిషాల పాటు వెంట తెచ్చుకున్న ఆక్సిజన్ అయిపోతుంది, మహిళ తీవ్ర నిస్పృహకు గురవుతోంది. ఎంత వేడుకున్నా అస్సలు వినలేదు. 45 నిమిషాల తర్వాత ఒకేసారి ఐదుగురికి అడ్మిషన్ స్లిప్పులు ఇచ్చి 1.30గంటలకు పైకి పంపారు’. ‘వజ్రమ్మ వయస్సు 92 ఏళ్లు. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 86 నుంచి 80కి పడిపోతున్నాయని కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె కుటుంబీకులు అడ్మిషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసి అడ్మిషన్ స్లిప్ కోసం కనీసం 45 నిమిషాలకు పైగా వేచి చూశారు. ఓ పక్క వృద్ధురాలు వీల్‌చైర్‌లో అనేక అవస్థలు పడుతోంది. పెద్దామే బాధ చూడలేకపోతున్నాం.. త్వరగా అడ్మిట్ చేసుకోమని ప్రాధేయపడినా సరే.. అందరితో పాటే అడ్మిషన్ స్లిప్‌ని వృద్ధురాలికి కూడా ఇచ్చి పైకి పంపిన ఈ రెండు ఘటనలు బుధవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలో చోటు చేసుకున్నాయి’. కంటతడి పెట్టిస్తున్న నిర్లక్ష్యం ఓ పక్క అయినవారు బతకాలనే ఆశ. మరో పక్క సిబ్బంది నిర్లక్ష్యం. ఈ రెండింటితో ఎవరిని ఏం అనాలో తెలియక పేషెంట్ల వెంబడి ఉన్న కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు. సిబ్బందిపై కొద్దిగా కొప్పడితే బెడ్ ఇవ్వరేమో అనే భయం. కొద్దిగా ఓర్చుకో అమ్మా.. అంటూ పెషెంట్‌నిని ప్రాధేయపడుతున్న క్రమంలో.. ఆమె నిస్సాహాయకురాలిగా ఉంటుంది. కనీస పర్యవేక్షణ లేకపోవడం వల్ల, నిత్యం వందలాది మందికి సర్వీస్ ఇవ్వడం వల్ల సిబ్బంది సైతం విసిగెత్తిపోతున్నారు. ప్రాణం పోతే ఆ బాధ, వేదన తమకే తెలుస్తోందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 15 నిమిషాల్లోనే అడ్మిట్ ఎవరినీ ఎక్కువ సేపు వెయిట్ చేయించేది లేదు. ఎమర్జెన్సీ ఉంటే పేషెంట్‌ని అడ్మిట్ చేసుకుని అడ్మిషన్ ప్రక్రియ వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం. ఒక్కోసారి ఆలస్యం అవుతుంటుంది. కానీ.. ఉద్ధేశపూర్వకంగా ఎవరినీ ఎక్కువ సేపు వేచి ఉంచేలా చేయము. – డాక్టర్ రాజేంద్రనాథ్, కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ ( చదవండి: వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి! ) -
ప్రైవేట్ ‘సేవ’లో
ఈ ఫొటోలో కనిపిస్తున్నది జిల్లాకేంద్ర ఆసుపత్రి.. ఆవరణలో నిలిచి ఉన్న వాహనాలు ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్‌లు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ఈ వాహనాలేంటి..? అనుకుంటున్నా రా.. ప్రమాదంబారిన పడిన రోగులను తీసుకొచ్చే 108 సిబ్బంది కోసం.. ప్రభుత్వ వైద్యులు రెఫర్ చేసే కేసుల కోసం ఇలాంటి వాహనాలు ఇక్కడ నిలిపి ఉండడం ఆసుపత్రి వద్ద నిత్యకృత్యం. కరీంనగర్‌హెల్త్: పెద్దపల్లి బ్రిడ్జి సమీపంలో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని రోడ్డువైపు ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రైవేటు ఉద్యోగి కటుకూరి చందుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన సిబ్బంది మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు రెఫర్ చేశారు. అదే వాహనంలో కరీంనగర్‌కు బయలుదేరారు. దారి మధ్యలో.. ముఖానికి చాలావరకు గాయాలయ్యాయని.. రక్తంకూడా ఎక్కువగా పోయిందని.. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అంతంత మాత్రంగానే వైద్యసేవలు అందుతాయని సదరు అంబులెన్స్ సిబ్బంది రోగి బంధువులను భయపెట్టారు. దీంతో హైరానాపడిన బంధువులు ఏదైనా మంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరారు. ‘మనకు తక్కువ ఖర్చులో వైద్యంచేసే మంచి హాస్పిటల్ ఉంది. కానీ.. 108లో ప్రభుత్వ ఆస్పత్రికే తీసుకెళ్లాలి. అక్కడినుంచి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం. అంతా మేం చూసుకుంటాం..’ అని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. అక్కడికి చేరుకోగానే అప్పటికే ఓ ప్రైవేటు ఆస్పత్రి అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. వెంటనే అక్కడి నుంచి వారిని తీసుకెళ్లి ప్రైవేటులో చేర్పించారు. విచిత్రం ఏంటంటే.. ఆ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు స్వయంగా 108 సిబ్బంది ఒకరు సాయం అందించడం. క్షతగాత్రుడిని ఎమర్జెన్సీలోకి తరలించిన వెంటనే ఆస్పత్రి యాజమాన్యం అందించిన రూ.5వేల కవర్‌ను తీసుకుని అక్కడినుంచి జారుకున్నట్లు సమాచారం. ఈ ఒక్క సంఘటన చాలు 108 సిబ్బంది అత్యవసర సమయంలో ఉన్నవారిని ప్రైవేటు ఆస్పత్రులకు ఎలా తరలిస్తున్నారో చెప్పడానికి. వైద్యసేవల ముసుగులో జిల్లాలో దళారీ రాకెట్ వ్యవస్థ నడుస్తోంది. దళారీ వైద్య వ్యవస్థలో అంబులెన్స్ నిర్వాహకులే ప్రధానపాత్ర పోషిస్తూ ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను జిల్లాకేంద్రంలోని సూపర్‌స్పెషాలిటీ, మల్టీస్పెషాల్టీ ఆసుపత్రులుగా చెప్పుకునే నిర్వాహకులే పెంచిపోషిస్తున్నారంటే అతిశయోక్తి కలగక మానదు. ఈ దందా ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా పదేళ్లుగా కొనసాగుతుండడంతో అంబులెన్స్ నిర్వాహకులు తమను ఎవరూ ఏమిచేయలేరు.. అన్నట్లు మారింది. వీరితోపాటు ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకులూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే వైద్యాధికారులను సైతం తమ కనుసన్నల్లోకి తిప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లుగా వేళ్లూనుకుపోయిన ఈ దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చికిత్స పేరుతో ప్రజల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. అంబులెన్స్‌లే దళారీలు.. జిల్లా కేంద్రంలో హంగుఆర్భాటాలతో నడిపిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలకు అంబులెన్స్ నిర్వాహకులు దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవస్థలో రెండు రకాలు. మొదటిది రోగాలబారిన పడిన వారిని నమ్మించి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించడం. రెండోది ప్రమాదంలో గాయపడి.. ఆపదలో ఉన్నవారికి మాయమాటలు చెప్పి భారీగా కమీషన్లు ఇచ్చే ఆస్పత్రుల్లో చేర్పించడం. ఉన్నట్టుండి తీవ్ర కడుపునొప్పి రావడం, గుండెపోటు, విషం తాగిన వంటి కేసులు స్థానిక అంబులెన్స్‌లను ఆశ్రయిస్తుంటారు. వీరి ఆపద, ప్రమాదస్థాయిని ఆసరాగా చేసుకుని ఆ స్థాయి ఆస్పత్రికి తరలిస్తుంటారు. మంచి డాక్టర్ ఉన్న ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తానని చెప్పి ‘మీ ప్రాణాలకు ఢోకాలేదు..’ అని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా ప్రజలను నమ్మించి ఎక్కువ కమీషన్లు వచ్చే హాస్పిటల్లో చేర్పిస్తారు. బాధితులతో అంబులెన్స్ అక్కడికి చేరుకోగానే హాస్పిటల్ వద్ద డాక్టర్, నర్సు, బాయ్స్‌తో కలిసి హంగామా చేస్తుంటాడు. వాహనం ఆగడంతోనే బాధితులను స్ట్రచ్చర్‌పై వేసి లోనికి పంపించి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం కమీషన్ జేబులో వేసుకుని కనిపించకుండా వెళ్లిపోతారు. అంబులెన్స్‌ల హవా.. ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య పెరగడంతోపాటు వారిలో పోటీ నెలకొనడంతో ఈ మధ్యకాలంలో అంబులెన్స్‌ల దళారీ వ్యవస్థ మొదలైంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కేసులను తీసుకువచ్చిన అంబులెన్స్ నిర్వాహకులకు కమీషన్లు ఇచ్చేవారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రమే సొంత అంబులెన్స్‌లు ఉండేవి. ఇవి కూడా అనుబంధంగా మాత్రమే నడిచేవి. ఇపుడు ప్రతి హాస్పిటల్‌కు ఒకటి, పెద్ద ఆస్పత్రులకు నాలుగైదు అంబులెన్స్‌లు ఉంటున్నాయి. వీటితోపాటు మండల హెడ్‌క్వార్టర్స్‌లో కూడా అంబులెన్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఎక్కువ కేసులు తమ హాస్పిటల్‌కే పంపించాలని అంబులెన్స్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు తీసుకువస్తే ఒక కొత్త అంబులెన్స్ వాహనం గిఫ్టుగా ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ ఒప్పందం కారణంగానే డ్రైవర్లుగా ఉన్న వారు అంబులెన్స్ ఓనర్లు అయ్యారు. జిల్లాలో మూడు వందలకుపైగా ప్రైవేటు అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటిలో సగం కంటే ఎక్కువ జిల్లా కేంద్రంలో ఆయా ఆస్పత్రుల పేర్లతో కనిపిస్తుంటాయి. ప్రభుత్వాస్పత్రి చుట్టూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి చుట్టు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ప్రైవేటు అంబులెన్స్‌లు మోహరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ప్రహారీ గోడ చుట్టు కనీసం 50వరకు ప్రైవేటు అంబులెన్స్‌లు ఏర్పాటు చేసుకుని నిర్వాహకులు రోగులకోసం వార్డుల్లో తిష్టవేసి తిరుగుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఏదైనా సీరియన్ కేస్ వచ్చిందంటే చాలు వారిని ప్రైవేటుకు తరలించుకుపోయే చర్యలు చేపడుతున్నారు. అందుబాటులోనే మంచి డాక్టర్ ఉన్నాడని, తక్కువ ఖర్చులో చేపిస్తామంటూ కమీషన్ల కోసం మాయమాటలతో వారిని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. ఫిర్యాదులు అందితే చర్యలు: బాలక్రిష్ణ, 108 ఐదు జిల్లాల ఇన్చార్జి, ప్రోగ్రాం మేనేజర్ 108 సిబ్బంది క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులు అందితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా అందుబాటులో ఉన్న ప్రభు త్వ ఆస్పత్రికి మాత్రమే తీసుకువెళ్లాలి. బా ధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి బంధువులు ప్రైవేటుకు తీసుకువెళ్లాలని కోరితే ఉన్నతాధికారుల అనుమతితోనే ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకుపోతుంటారు. ప్రైవేటుకు వెళ్లాలని సూచించడం.. ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులు ఏమీ అందలేదు. -
నాణ్యత నగుబాటు
సాక్షి, కర్నూలు : ఉన్నట్టు తెలుస్తోంది. వేస్తున్న రోడ్డు కూడా క్రమబద్ధంగా కాకుండా వంకర టింకర్లుగా సాగుతోంది. ఇందుకు అధికారులు కూడా అభ్యంతరం తెలపడం లేదు. వారు కనీసం పనులు జరిగే ప్రదేశాన్ని తనిఖీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంకర వేశారు... రోడ్డు మరిచారు! పెద్దాసుపత్రి అంతటా అంతర్గతంగా సీసీ రోడ్లను వేసేందుకు రూ.2 కోట్లతో మొదటిసారి టెండర్ పిలిచారు. అయితే, ఒక్కరే వచ్చారనే కారణంగా రెండోసారి టెండర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి షెడ్యూళ్లు దాఖలు చేసిన ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లను రింగు చేసి.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడికే దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు రోజులు గడుస్తున్నప్పటికీ పనులను ప్రారంభించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఉన్న రోడ్లనూ తీసేయడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు వివిధ పరీక్షల కోసం మెడాల్ యూనిట్ వద్దకు వెళ్లేందుకు ఉన్న దారిలో కంకర వేసి నెల రోజులు గడుస్తున్నాయి. రోగులే రోలర్లు! ఏదైనా సీసీ రోడ్డును వేసే సమయంలో మొదట జేసీబీతో ఒక లెవల్‌గా చేస్తారు. అనంతరం కంకర, డస్ట్ వేస్తారు. దీనిపై రోలర్‌తో రోల్ చేస్తారు. ఈ విధంగా నాలుగైదు రోజులు చేసిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడతారు. అయితే, ఇక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. మొదటగా కంకర వేశారు. అది కూడా చిన్నరకం కంకర వాడుతున్నారు. దీనిపై కనీసం డస్ట్ కూడా వేయలేదు. రోడ్డు రోలర్‌తో తిప్పిన దాఖలాలు అసలే లేవు. ఈ కంకర మీద రోగులు, స్ట్రెచర్లు, రోగుల సంబంధీకులు నడవడంతో రోలింగ్ అవుతున్న పరిస్థితి కన్పిస్తోంది. కనీసం రోలింగ్ చేస్తే రోడ్డు పూర్తయ్యే వరకూ కనీసం నడిచేందుకు రోగులకు ఇబ్బంది ఉండదు. అధికారులు మాత్రం ఆ వైపు కనీస చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్టర్‌ను ఏమైనా అంటే ఎక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని జంకుతున్నట్టు ప్రచారం సాగుతోంది. నాణ్యతలో రాజీ లేదు పెద్దాసుపత్రి అంతర్గత రోడ్ల నిర్మాణం నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఒక లేయర్లో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిపై మరో లేయర్ వస్తుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు ఉండేలా చూస్తాం. – విజయభాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్ఐడీసీ -
వైద్యం.. దైన్యం!
ప్రభుత్వ దవాఖానాలో వైద్యాధికారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుడు అందుబాటులో లేక ఆస్పత్రి బోసిపోయింది. సమస్య పరిష్కరించాల్సిన ఆశాఖ అటువైపు దృష్టి సారించకపోవడంతో రోగులు చిన్నపాటి జబ్బుకు కూడా వేలాది రూపాయలు ఖర్చుచేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. నర్వ : నిరంతర సేవల ద్వారా ప్రజావైద్యం అందించే ఆసుపత్రి సేవల్లో సిబ్బంది మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోవడం మూలంగా పరిస్థితి విషమించే ప్రమా దం ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. లూజ్ మోషన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ బాలుడిని గురు వారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. సిబ్బం ది లేకపోవడంతో గంటల తరబడి వేచి చూశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. తెరుచుకోని యునాని కేంద్రం ఆస్పత్రిలో దీర్ఘకాలిక రోగుల కోసం ఏర్పాటు చేసిన యునాని వైద్య కేంద్రం ఎప్పుడు రోగులకు అందుబాటులో ఉంటుందో దేవుడికే తెలియాలి. నామమాత్రపు సేవలు, ప్రచారం లేని ఆయు ర్వేద కేంద్రంతో ఎలాంటి ప్రయో జనం లేదని ప్రజలు వాపోతున్నారు. ఓపీ సేవలు పెంచాలి నిత్యం వివిధ రోగాలపై ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ సేవలను అందించే సమయాన్ని పెంచాలి. ఓపీ తర్వాత కూడా ఎమర్జెన్సీ కేసులు వస్తే అందుబాటులో వైద్య సిబ్బంది ఉండాలని ప్రజలు కోరుతున్నారు. సిబ్బంది ఉండక పోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బందే ఉండరు.. మా బందువుల బాబుకు మోషన్స్ ఉన్నాయని ఆసుపత్రికి వచ్చాం. సిబ్బంది ఎవ్వరూ లేరు. గతంలో చాలా సార్లు ఆసుపత్రికి వచ్చిన సేవలు అందించడంలో సిబ్బంది రోగులను మాటలతో ఇబ్బందులకు గురిచేస్తారు. ‘మీకు కావాల్సినప్పుడే డాక్టర్ వస్తాడా.. మా సమయంలోనే మేము వస్తాం’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మూడు గంటలు ఎదురుచూశాం. చివరికి గోళి ఇచ్చి పంపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – సైఫల్ అన్సారీ, లంకాల్ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలి మా బాబు మతిన్‌కు మోషన్స్‌లో బ్లడ్ వస్తుందని ఆసుపత్రికి వెళ్లాం. ఆస్పత్రిలో సిబ్బంది ఎవ్వరూ లేరు. రెండు గంటలు వేచి చూసిన తర్వాతనే సిబ్బంది వచ్చారు. రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. – చాంద్‌పాష, నర్వ, గ్రామం సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమో అందించి వివరణ కోరాం. మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తాను. ఓపీ సేవలను పెంచి రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – సిద్దప్ప, పీహెచ్సీ వైద్యులు, నర్వ -
రోగులపై లైంగిక వేధింపులు: డాక్టర్ అరెస్టు
కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన పలువురు రోగులను లైంగికంగా వేధించి, మూడేళ్లుగా పరారీలో ఉన్న ఓ ముసలి డాక్టర్‌ను బ్రెజిల్ పోలీసులు అరెస్టు చేశారు. రోజర్ అబ్దెల్మసీ (70) అనే ఈ డాక్టర్ బ్రెజిల్ వదిలిపెట్టి పొరుగునున్న పరాగ్వే దేశంలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అక్కడ అతడిని అరెస్టు చేసి బ్రెజిలియన్ అధికారులకు అప్పగించారు. వీసా కూడా లేకుండా పరాగ్వేలో ఉంటున్నందుకు అతడిని అరెస్టు చేశారు. ఇన్నాళ్లుగా ఎవరికీ చిక్కకుండా పలు యూరోపియన్ దేశాలలో తిరుగుతూ మూడు నెలల క్రితమే ఆ డాక్టర్ పరాగ్వే చేరుకున్నాడు. బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరమైన సాన్ పాలోలో కృత్రిమ గర్భధారణ నిపుణుడిగా పేరొందిన రోజర్ మీద దాదాపు 35 మంది మాజీ రోగులు ఫిర్యాదు చేశారు. అతడు తమను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఆయనపై 56 కౌంట్ల అత్యాచారం, లైంగిక వేధింపులు 2010లోనే రుజువయ్యాయి. దాంతో 278 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. దాంతో శాన్ పాలో మెడికల్ కౌన్సిల్ అతడి లైసెన్సును రద్దుచేసింది.


