breaking news
Parasurampuram
-
గీతా గోవిందం దర్శకుడితో ‘మహేష్‌బాబు’ సినిమా
సింహాచలం(పెందుర్తి): గీత గోవిందం సినిమా తనని సినీ ప్రేక్షకులను ఎంతో దగ్గర చేసిందని దర్శకుడు పరశురామ్ అన్నారు. వరాహ లక్ష్మీ నృసింహస్వామిని బుధవారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో అష్టోత్తరం పూజ, గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. వేద ఆశీర్వచనాన్ని అర్చకులు అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో రామారావు అందించారు. ఈ సందర్భంగా పరశురామ్ విలేకరులతో మాట్లాడారు. ‘యువత’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యానని, ఆ తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. గీత గోవిందం సినిమా ప్రేక్షకులను బాగా దగ్గర చేసిందన్నారు. తన తదుపరి చిత్రం నాగచైతన్యతో ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు. అలాగే మహేష్‌బాబుతో సినిమా ఉంటుందని, ఆ సినిమా కథ ఇప్పటికే సిద్ధమైందన్నారు. నర్సీపట్నం తన సొంత ఊరని పరశురామ్ తెలిపారు. -
రాష్ట్ర సమైక్యతే వైఎస్ఆర్సీపీ ధ్యేయం
పరశురాంపురం(కొమరాడ),న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బేబీనాయన అన్నారు. మండలంలోని పరశురాంపురం గ్రామం లో పలువురు మాజీ ప్రజాప్రతినిధులతోపాటు 230 కుటుంబాల వారు శుక్రవా రం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగతనేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి దేశంలో ఎక్క డా లేనివిధంగా సంక్షేమపథకాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశారన్నారు. మరలా ఆ పథకాల అమలు ఒక్క జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 సీట్లకు గానూ 150 గెలుచుకుంటుందని జాతీయ సంస్థల సర్వే తెలుపుతోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణకు మద్దతు తెలిపార ని, ఆయనకు దమ్ముంటే జై సమైక్యాంధ్ర అని చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నా రు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎంతగానో శ్రమిస్తున్నారని తెలిపారు. రాజులకు బ్రహ్మరథం బొబ్బిలి యువరాజు, అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బేబీనాయ న, కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజులకు పరశురాంపురం ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు బ్రహ్మరథం పట్టారు. గ్రామం నుం చి పురవీధుల మీదుగా బాణసంచా వెలి గిస్తూ, మేళతాళాల ఊరేగించారు. మహిళలు హారతులు పట్టి, కుంకుమ దిద్ది స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గులిపల్లి సుదర్శనరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శకుంతలమ్మ, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్తలు జమ్మాన ప్రసన్నకుమార్, ఉదయభాను, పార్వతీ పురం పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు మజ్జి వెంకటేష్, ఆదివాసీ జిల్లా అ ధ్యక్షుడు ఆరిక సింహాచలం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం,జియ్యమ్మవలస, పార్వతీపురం మండల కన్వీనర్లు ద్వారపురెడ్డి జనార్దనరావు, కొయ్యాన గోపి, మూడడ్ల గౌరీశంకర్, చుక్క లక్ష్మునాయుడు, నా యకులు డాక్టర్ మధుసూదనరావు, గం డి భాస్కరరావు, నీరస రామస్వామినాయుడు, హరియాల ఆనందరావు, ఎం. శ్రీరాములు, ఎం. నాగేశ్వరరావు, సీరల సింహాచలం, పొట్నూరు జయంతి, టి. చిరంజీవులు, మజ్జి త్రినాథ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్‌లు రఘుమండల పకీరునాయుడు, మజ్జి చిన్నంనాయుడు, ఆర్.మన్మథరావు, కృష్ణంనాయుడు, చల్లా చిన్నంనాయుడు, ఆర్.సత్యనారాయణ ఉన్నారు.