breaking news
paper valuation
-
బాబుగారూ.. ‘టెన్త్’లో మీరు, మీ కొడుకు ఫెయిల్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) చురకలంటించారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్(Nara Lokesh) టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని(10th Papers Valuation) కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.సుమారు 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025 .. చంద్రబాబుగారూ(Chandrababu Gaaru) దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ టెన్త్ ఫలితాలు సరైనవేనా? -
ఇంత జరిగినా మౌనమేలా మంత్రి లోకేశా?: YSRCP
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థపై ఘోరమైన మరక పడింది. పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు జరిగాయి. వేలమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి మరీ మౌనంగా ఉండిపోయారంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది... పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత 60% మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. బోర్డు చేసిన దారుణమైన తప్పులు పాసైన వారిని కూడా ఫెయిల్ చేశాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వమే ప్రమాదంలోకి నెట్టింది. ఇంత దారుణం జరిగినా మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని వైఎస్సార్సీపీ(YSRCP) ప్రశ్నించింది. .. నారా లోకేష్ చేసిన తీవ్రమైన ఒత్తిడి వలనే ఉపాధ్యాయులు మార్కులు తారుమారు చేయటానికి కారణమైంది. మొత్తం 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటి వరకు టెన్త్ రీవాల్యూషన్(AP 10th Class Revaluation) 11,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్వయానా ప్రభుత్వమే ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోందట. ఈ పరిణామంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని వైఎస్సార్సీపీ(YSRCP), ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనను జోడించి తన ట్వీట్లో పేర్కొంది. అలాగే ఈ విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో.. అన్ని నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.Unprecedented chaos in 10th class exam evaluation! Thousands of students’ futures at stake as 60% have applied for revaluation — a first in AP history. Shocking errors by the board failed even those who passed. Due to Nara Lokesh’s pressure, marks were tampered with. 66,363… pic.twitter.com/q34Gm46Yj1— YSR Congress Party (@YSRCParty) May 30, 2025 -
ఇంటర్ ‘స్పాట్’ షురూ
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల వాల్యూయేషన్ మంగళవారం ప్రారంభమైంది. అబిడ్స్‌లోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్పాట్ వాల్యూయేషన్ ఏర్పాటు చేశారు. తొలిరోజు 350 మంది లెక్చరర్లు రిపోర్టు చేశారు. ఒక్కో గదిలో పది నుంచి 15 మంది లెక్చరర్లకు వసతి కల్పించారు. జవాబు పత్రాలతో పాటు ఆయా స్పాట్ వాల్యూయేషన్ గదులను పూర్తిగా శానిటైజ్ చేశారు. లెక్చరర్లు మాస్క్‌లు ధరించి..భౌతిక దూరం పాటిస్తూ పేపర్లను దిద్దారు. ఒక్కో లెక్చర్ 45 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేస్తున్నారు. బుధవారం నుంచి ఇదే అబిడ్స్‌లోని సెయింట్‌జార్జ్, సుజాత జూనియర్ కాలేజీ కేంద్రాల్లోనూ ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీసర్ జయప్రద బాయి తెలిపారు. అన్ని సవ్యంగా జరిగితే..20 రోజుల్లో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తవుతుందని స్పష్టం చేశారు. -
11 నుంచి ఇంటర్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీ డియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మే 11వతేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో ఇంటర్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి.రమేష్‌లతో కలిసి మంత్రి 13 జిల్లాల ఆర్ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓలతో చర్చించి పలు సూచనలు చేశారు. 60 లక్షల పత్రాల మూల్యాంకనం... ► మే 11 నుంచి ఆరెంజ్, గ్రీన్జోన్లలో ఇంటర్ జవాబు పత్రాల మూ ల్యాంకనం మొదలవుతుంది. లాక్డౌన్ ముగిసిన అనంతరం రెడ్జోన్లలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమవుతుంది. 13 జిల్లాల్లోనూ జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటవుతాయి. ► మూల్యాంకనానికి రెండు, మూడు భవనాలను గుర్తించి ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి మూల్యాంకన నిర్వహిస్తారు. ► ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ పరీక్షలకు తేదీలు ఖరారు చేసినందున ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారు. ► మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారు. ► 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. -
ఇంటి దొంగల పనే..!
సాక్షి, జేఎన్టీయూ : రమేష్ అనే విద్యార్థి ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఎలాగైనా బీటెక్ ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఓ మధ్యవర్తిని కలిశాడు. ఆయన నేరుగా పరీక్షల విభాగంలోని ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగితో సంప్రదింపులు జరిపాడు. ఆ సబ్జెక్టుకు సంబంధించి ఎలా ఉత్తీర్ణుడిని చేయించాలనే అంశంపై ప్రణాళికను వివరించాడు. కోడింగ్ సెక్షన్లో నిబద్ధతగా పనిచేసే అధికారి ఉండటంతో నిర్ధేశించిన జవాబుపత్రాన్ని మూల్యాంకనం (వాల్యుయేషన్)లో పసిగట్టడం చాలా కష్టం. దీంతో జవాబుపత్రంలో ఒక సింబల్‌ను హైలైట్ చేసి పరీక్ష రాయమని సూచించాడు. ఆ మేరకు రమేష్ ఓ సింబల్‌ను హైలైట్ చేసి పరీక్ష రాశాడు. ఇదే జవాబు పత్రాన్ని తనకు అనుకూలమైన ఎగ్జామినర్ వద్దకు మూల్యాంకనానికి పంపాడు. కచ్చితంగా రమేష్ ఉత్తీర్ణుడయ్యాడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేస్తున్న అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. జయసింహ అనే అధ్యాపకుడు ప్రైవేట్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నాడు. అక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. అదే మూల్యాంకనం(వాల్యుయేషన్) డ్యూటీకి వెళ్తే మంచి రెమ్యునరేషన్ వస్తుంది. ఆన్‌డ్యూటీ మీద కళాశాల జీతం కూడా చెల్లిస్తుంది. అయితే ఏడాదిలో రెండు సెమిస్టర్ల పరీక్షలు జరిగితే.. ఐదు దఫాలు పైగానే వాల్యుయేషన్ డ్యూటీ వేశారు. ఈ లెక్కన తరచూ వాల్యుయేషన్ డ్యూటీ వేయడానికి రెమ్యునరేషన్లో కొంత నజరానా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ దందాను ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నడిపిస్తున్నాడు. ఇలా నిత్యం వాల్యుయేషన్‌కు అనుకూలమైన అధ్యాపకులను వేయిస్తూ.. ప్రతి రోజూ రూ.20వేలకు పైగా సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కోడింగ్ ముగిసిన వెంటనే విద్యార్థి జవాబు పత్రంలో ముందస్తుగా నిర్ధేశించిన విధంగా ఏదో ఒక సింబల్‌ను హైలైట్ చేసి ఉంటారు. వేలల్లో జవాబు పత్రాలు ఉంటాయి. కానీ ఆ జవాబుపత్రాన్ని గుర్తుపట్టడానికి ఓ అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న అటెండర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ అటెండర్ నేరుగా వాల్యుయేషన్ హాలులో ప్రాతినిధ్యం వహిస్తున్న అవుట్సోర్సింగ్ బాస్ అయిన ఉద్యోగికి ఇస్తాడు. సదరు ఉద్యోగి ముందే నిర్ధారించుకున్న ఎగ్జామినర్‌కు ఆ జవాబుపత్రాన్ని ఇచ్చి విశాలహృదయంతో మార్కులు వేయిస్తాడు. జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగంలో ముగ్గురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమిష్టిగా అక్రమాలకు తెరతీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు సంవత్సరాల సర్వీసు లేకుండానే మూల్యాంకనం జేఎన్టీయూ అనంతపురంలో పరీక్షల విభాగం వర్సిటీకి హృదయం లాంటిది. చాలా నిబద్ధతగా పనిచేసే రెగ్యులర్ అధికారులు కోడింగ్ సెక్షన్లో, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నారు. ఏదైనా ఒక చిన్న పొరుపాటు జరిగితే వర్సిటీ పరువు పోతుందని అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. అలాంటి వారు ఉండటంతోనే జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగం విశ్వసనీయతను నిలుపుకుంటోంది. అయితే రెగ్యులర్ ఉద్యోగాలు కాకపోవడంతో, కేవలం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు కావడంతో .. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే రీతిలో అక్రమాలకు తెరతీస్తున్నారు. ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి కాకుండనే అధ్యాపకులకు మూల్యాంకనం అవకాశం కల్పిస్తున్నారు. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు పంపించే డేటా ఆధారంగా మూల్యాంకనం విధులకు వేస్తున్నారు. అయితే పదేపదే వారినే మూల్యాంకనానికి వేస్తుండటంతోనే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రోస్టర్ వారీగా అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ మూల్యాంకనం విధులకు కేటాయించాలి. కానీ అలా జరగలేదు. ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎవరైతే అక్రమాలకు దన్నుగా నిలుస్తున్నారో అలాంటి అధ్యాపకులనే విధులకు వేస్తుండటం అక్రమాలకు తావిస్తోంది. కళాశాల ఉద్యోగులే మధ్యవర్తులు అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా పరీక్షల విభాగం పేరుతో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఉద్యోగులు పరీక్షల విభాగంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నిత్యం ఫోన్లో సంభాషణలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షల విభాగంలో పనిచేసే ఉద్యోగి నుంచి ఒక రోజులోనే ఈ ముగ్గురి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 దఫాల కాల్స్ వెళ్లాయి. అధికారికంగా వారితో ఎలాంటి లావాదేవీలు జరపకూడదు. ఏదైనా పని ఉంటే పరీక్షల విభాగం ఉన్నతాధికారులతోనే ఉంటుంది. కానీ ఈ ముగ్గురు ఉద్యోగులు దందా నడుపుతున్నట్లు స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకుంటాం అధ్యాపకులను వాల్యుయేషన్‌కు కేటాయించే విధానంపై అక్రమాలకు పాల్బడి ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ముగ్గురు ఉద్యోగుల తీరుపై అనుమానాలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఇది వరకే విన్నవించాం. – ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, జేఎన్టీయూ అనంతపురం -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఆందోళన
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పేపర్ వాల్యూవేషన్లో అన్యాయం జరిగిందని ఫిజియోథెరపి విద్యార్థులు బుధవారం ధర్నా చేపట్టారు. తక్కువ మార్కులు ఇచ్చి, కావాలనే ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఎటెంమ్ట్ చేసిన ప్రశ్నలకు కనీస మార్కులు ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీస మర్యాద కూడా లేకుండా యూనివర్సిటీ సిబ్బంది అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ ద్వారా అన్యాయం జరుగుతోందని, రీ వాల్యూవేషన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. -
ఏకమైన ఉపాధ్యాయ సంఘాల జేఏసీలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని మూడు ఉపాధ్యాయ జేఏసీలు, వాటిల్లోని 54 సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. వేర్వేరు జేఏసీల పరిధిలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై పోరాటాలు సాగించాలని నిర్ణయించాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్‌గా (జేసీటీయూ) ఏర్పడ్డాయి. ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు 30 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాయి. వచ్చే నెల 2 నుంచి జరగాల్సిన 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించాయి. బహిష్కరణను విజయవంతం చేసేందుకు ఈనెల 28, 29 తేదీల్లో అన్ని జిల్లాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించాలని నిర్ణ్ణయించాయి. దీనిపై ఈనెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసిచ్చేందుకు సిద్ధమయ్యాయి. మూడు జేఏసీలకు నాయకత్వం వహిస్తున్న పీఆర్టీయూ అ«ధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా 9 ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సంఘాల నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, రఘునందన్, చెన్నయ్య, అంజిరెడ్డి, రాజన్న పాల్గొన్నారు. ఇవీ ప్రధాన డిమాండ్లు.. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం న్యాయపరమైన ఆటంకాలు తొలగించి, వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి. కొత్త పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. 2016 వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలి. ఎయిడెడ్, మోడల్ స్కూల్, కేజీబీవీ, గిరిజన, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలి. ఎస్సెస్సీ పరీక్షల విధులు, మూల్యాంకనం రేట్లను రెట్టింపు చేయాలి. -
మూల్యాంకన లోపాలపై విచారణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వ విద్యాలయంలో న్యాయ విద్య (ఎల్ ఎల్ఎం) మూల్యాంకనంలో దొర్లిన పొరపాట్లపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇలా అయితే ఎ లా?’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురి తమైన కథనంపై ఆయన స్పందించారు. విచారణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన జరిపినట్లు పేర్కొన్నారు. పొరపాటుకు బాధ్యులైన ఉద్యోగులకు షోకాజ్ నోటీసు పంపించినట్లు వెల్లడించారు. అలాగే ఒక అభ్యర్థికి సంబంధించిన జవాబు పత్రా లను మరో అభ్యర్థికి సంబంధించిన చిరు నామా కలిగిన కవర్లో పెట్టి పంపిం చారని (ఫొటో కాపీ కోసం రూ. 1,000 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే) పేర్కొ న్నారు. మూల్యాంకనం సమయంలో జవాబుపత్రంపై జవాబుల పక్కన మార్కులు వేయమని వెల్లడించారు. వీటిపై స్పష్టత ఏదీ? అయితే, సదరు పేపరుకు సంబంధించిన మార్కుల స్లిప్‌లో మాత్రం మార్కులను కచ్చితంగా వేయాల్సి ఉన్నప్పటికీ మా ర్కులను వేయలేదు. ఎల్ఎల్ఎం సెకండ్ సెమిస్టర్ నాలుగో పేపరుకు సంబంధిం చి అభ్యర్థికి ఇచ్చిన ఫొటో కాపీలో మా ర్కులనే వేయకుండా ఇచ్చారు. ఫలితాల్లో మాత్రం అతనికి 23 మార్కులు వచ్చిన ట్లు ఇచ్చారు. కానీ మార్కుల స్లిప్‌లో ఎక్కడా వాటిని చూపించలేదు. పైగా ఎల్ఎల్ఎం థర్డ్ సెమిస్టర్ ఐదో పేపరుకు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థికి ఎల్ ఎల్బీ థర్డ్ సెమిస్టర్ మార్కుల స్లిప్‌ను ఇచ్చారు. అందులో 33 మార్కులు వచ్చి నట్లు చూపించారు. కానీ ఫలితాల్లో అవి లేనేలేవు. పైగా జవాబు పత్రాల ఫొటో కాపీ కూడా ఎల్ఎల్బీ విద్యార్థిదే ఎల్ఎల్ ఎం విద్యార్థికి ఇవ్వడం గమనార్హం. -
వచ్చే నెల మొదటి వారంలో పది ఫలితాలు
► 92 శాతం ముల్యాంకనం పూర్తి ► టెన్త్ స్పాట్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్జేడీ కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షల ముల్యాంకనం పూర్తి కావొచ్చిందని, వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఆర్జేడీ బి. ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన టెన్త్ స్పాట్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ప్రతి గదిని తనిఖీ చేసి, టీచర్లుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీసీఈ విధానంలో పరీక్షలు జరిగినా ఫలితాలపై ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. గతేడాది కంటే మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీసీఈ విధానంపై పదో తరగతి విద్యార్థులు మొదటి నుంచి అవగహన కల్పించామన్నారు. వచ్చే ఏడాది నుంచి నూతన విధానాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షల్లో కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో డీఈఓ తహెరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనానికి మూల్యం!
జేఎన్ టీయూ, జవాబు పత్రాల మూల్యంకనం, వై వేణుగోపాల్ రెడ్డి కమిటీ, ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ కోర్టులో ‘గ్లోబరీనా’ వ్యవహారం అతీగతీ లేని వేణుగోపాలరెడ్డి కమిటీ విచారణ జేఎన్టీయూకేలో ఎంఓయూ కొనసాగింపుపై వివాదం సాక్షి ప్రతినిధి, కాకినాడ: జేఎన్టీయూ కాకినాడలో జవాబు పత్రాల మూల్యాంకన ఒప్పందంపై రాజుకున్న వివాదం గవర్నర్ కోర్టులో నలుగుతోంది. వర్సిటీ పరిధిలోని 276 ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న 4 లక్షల మంది విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనానికి గ్లోబరీనా అనే సంస్థతో నాలుగేళ్ల కాలానికి గతేడాది డిసెంబరులో రూ.130 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంవల్ల విద్యార్థులకు మేలు జరగకపోగా, జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్ర జాప్యం జరుగుతోందని మొదటి సంవత్సరంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమవడంతో పాటు పలు సంఘాల ఫిర్యాదు మేరకు గవర్నర్ నరసింహన్ ఉన్నత విద్యామండలి చైర్మన్ వై.వేణుగోపాలరెడ్డితో విచారణ కమిటీ వేశారు. ఆ విచారణ ఏమైందనేది ఇంతవరకూ అతీగతీ లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నుంచి సీపీఐ నేత మీసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఒప్పందాన్ని రదు ్దచేయాలని కోరుతూ లేఖ ఇచ్చారు. విచారణ జరుగుతోందని వారికి గవర్నర్ తెలిపారు. ఈ క్రమంలో వర్సిటీ-గ్లోబరీనా ఒప్పందం మరోసారి తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారింది. ఒప్పందం పూర్వాపరాలు ఒప్పందంలో భాగంగా ప్రతి సమాధాన పత్రంలోని 32 పేజీలను స్కాన్ చేయడం, ప్రశ్నల వారీగా వైఫై టాబ్లెట్ పీసీ సహకారంతో గ్లోబరీనా ఫ్యాకల్టీ మూల్యాంకనం చేస్తారు. రెండు మూల్యాంకనాల వివరాలు సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ వివరాలను ఫలితాల ప్రాసెసింగ్‌కు సమర్పిస్తారు. ఇందుకు కావలసిన సాఫ్ట్‌వేర్‌ను వర్సిటీ సమకూర్చినా సమాధాన పత్రం మూల్యాంకనానికి గ్లోబరీనాకు వర్సిటీ రూ.130 చెల్లిస్తుంది. ఈ రకంగా వర్సిటీ పరిధిలో నాలుగు లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను (ప్రతి విద్యార్థికీ ఆరు చొప్పున 24లక్షల పేపర్లు) మూల్యాంకనం చేయాలనేది 2013 డిసెంబరు నాటి ఒప్పందం. గ్లోబరీనాకు యూనివర్సిటీ ఒక సెమిస్టర్‌కు సుమారు రూ.31.24 కోట్లు, ఏడాదికి రెండు సెమిస్టర్లకు రూ.62.40 కోట్లు చెల్లిస్తుంది. 2013కు ముందు ఒక జవాబుపత్రాన్ని అధ్యాపకులు మూల్యాంకనం చేస్తే రూ.25 వంతున వర్సిటీ చెల్లించేది. విద్యార్థి నుంచి పరీక్ష ఫీజు రూపంలో రూ.760 వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.600లు వర్సిటీకి, రూ.160 కళాశాలలకు చెందుతాయి. జవాబుపత్రానికి రూ.25 వంతున ఆరు పేపర్ల మూల్యాంకనానికి రూ.150 పోతే వర్సిటీకి రూ.450 మిగిలేది. ఆ రకంగా వర్సిటీకి విద్యాసంవత్సరానికి రూ.32 కోట్ల మిగులు నిధులు ఉండేవి. అయితే.. గ్లోబరీనా ఒప్పందం ప్రకారం ఒక విద్యార్థి జవాబుపత్రాల మూల్యాంకనానికి రూ.780 వెచ్చించాల్సి వస్తోంది. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో విద్యా సంవత్సరంలో వచ్చే రూ.50 కోట్లతోపాటు అదనంగా రూ.12.40 కోట్లు ఎదురు ఖర్చు అవుతోందని అఖిలపక్షం వాదిస్తోంది. ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం గ్లోబరీనా ఒప్పందం అనంతరం ఈ ఏడాది ఇంజనీరింగ్ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థుల మొదటి సెమిస్టర్ ఫలితాలు ఫిబ్రవరి నెలకల్లా విడుదల చేయాలి. వర్సిటీ అధ్యాపకులతో జవాబు పత్రాల మూల్యాంకనం చేయించేటప్పుడు కూడా ఫిబ్రవరి దాటకుండానే ఫలితాలు విడుదలయ్యేవి. కంప్యూటర్ ఆధారంగా పేపర్లు స్కాన్ చేసి అత్యంత ఆధునిక పద్ధతిలో ఫలితాలు ప్రకటిస్తామని గొప్పలకుపోయిన వర్సిటీ.. గ్లోబరీనా ఒప్పందం తరువాత సమయానికి ఫలితాలు విడుదల చేయలేక చేతులెత్తేసిందని అఖిలపక్ష నేతలు గవర్నర్‌కు నివేదించారు. విద్యార్థులు పోరుపెట్టగా ఫలితాలను ఏప్రిల్‌లో విడుదల చేశారు. అదీ వర్సిటీ పరువు బజారునపడుతుందనే భయంతో వర్సిటీ అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించి విడుదల చేయడం కొసమెరుపు. ఇంత జరిగినా గ్లోబరీనాతో ఒప్పందం కొనసాగించడంపై వర్సిటీలోనే కొందరు అధ్యాపకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీకి దండగమారిదైన ఈ కొరగాని ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని అందరూ కోరుతున్నారు.