pant pocket
-
విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన మొబైల్ ఫోన్
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాలో విద్యార్థి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే తనూజ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయగా.. జేబులో ఉన్న సెల్ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా, విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ఓవర్ హీట్ కారణంగానే పేలినట్లు భావిస్తున్నారు. బ్యాటరీ డ్యామేజీ కావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఓవర్ హీట్ కాకుండా చూసుకోవాలని.. చల్లటి ప్రదేశాల్లో ఉంచాలని సూచిస్తున్నారు. -
ప్యాంటు జేబులోని సెల్ ఫోన్ కాలిపోవడంతో..
వాషింగ్టన్: అమెరికాలోని పుయల్లుప్ సిటీలో ఓ వ్యక్తికి విభ్రాంతికర సంఘటన ఎదురైంది. షాపింగ్ చేస్తున్న సమయంలో అతని ప్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ కాలిపోయింది. ప్యాంటు జేబులోంచి మంటలు రావడంతో అతను తనను కాపాడుకోవడానికి వెంటనే ప్యాంటు విప్పేశాడు. జాకెట్ విప్పి నడుం చుట్టు కట్టుకున్నాడు. ఓ ఉద్యోగి అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పివేశాడు. ఈ ఘటన జరిగినపుడు షాపులో ఉన్న ఎవరెట్ ట్రెల్ అనే ప్రత్యక్ష సాక్షి ఈ వివరాలు చెప్పాడు. ఇలాంటి ఘటనను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, భారీగా పొగలు వ్యాపించాయని, అక్కడున్నవారు భయపడ్డారని చెప్పాడు. షాపు మేనేజర్ బాధితుడికి జత కొత్త ప్యాంట్లు అందజేశాడు. బాధితుడికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాడు. అతని సెల్ ఫోన్ కాలి బూడిదైందని, ప్యాంటు పడిన చోట నల్లగా మరక ఏర్పడిందని చెప్పాడు. బాధితుడి పేరు, ఫోన్ ఎందుకు కాలిందన్న వివరాలు తెలియరాలేదు.