breaking news
pandithapuram
-
ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణలు..
సాక్షి, ఖమ్మం జిల్లా: కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్టీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హనుమంతరావు, అతని అనుచరులతో కలిసి కాంగ్రెస్‌కు చెందిన మేకపోతుల మహేష్ గౌడ్‌పై కత్తులతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహేష్‌కు తీవ్ర గాయాలవ్వడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా గతంలోనూ మహేష్‌పై అనేకసార్లు దాడికి యత్నించినట్లు తెలిసింది. పలుమార్లు పలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో పండితాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
వినాయక చవితి వేడుకల్లో అపశృతి
కామేపల్లి(ఖమ్మం జిల్లా): కామేపల్లి మండలం పండితాపురంలో జరిగిన వినాయకచవితి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జన ఉత్సవం సందర్భంగా గ్రామంలోని యువకులు బాణసంచా పేల్చారు. దీంతో పక్కనే ఉన్న పశువులు బెదిరి ఇద్దరు మహిళలను తొక్కాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ దనియాకుల శకుంతల(50) అనే మహిళ బుధవారం మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.