breaking news
Padmalakshmi
-
కరోనా: ప్రఖ్యాత చెఫ్ మృత్యువాత
న్యూజెర్సీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్(59)ను బలితీసుకుంది. మార్చి 18న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో గత కొన్ని రోజులుగా న్యూజెర్సీలోని మౌంటేన్‌సైడ్ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఫ్లాయిడ్ కార్డోజ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న హంగర్ ఐఎన్‌సీ. హాస్పిటాలిటీ సంస్థ ధ్రువీకరించింది. ‘‘చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాం’’అని ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా బాంబేలో పుట్టిన ఫ్లాయిడ్ కార్డోజ్ తొలుత బయోకెమిస్ట్‌గా శిక్షణ పొందారు. అనంతరం తన అభిరుచికి అనుగుణంగా చెఫ్‌గా మారారు. భారత్, స్విట్జర్లాండ్‌లో శిక్షణ పొంది.. న్యూయార్క్‌కు షిఫ్ట్ అయ్యారు. ప్రఖ్యాత.. ‘‘టాప్ చెప్ మాస్టర్’’ టైటిల్ పొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. (డేంజర్ బెల్స్!) కాగా భారత సంతతికి చెందిన మరో సెలబ్రిటీ చెఫ్ పద్మా లక్ష్మి ఫ్లాయిడ్ కార్డోజ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఫ్లాయిడ్ మనల్నందరినీ గర్వపడేలా చేశారు. న్యూయార్క్ వాసులు ఆయన చేతి రుచికరమైన భోజనాన్ని ఎన్నడూ మరచిపోలేరు. తన చిరునవ్వుతో చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచేవారు. ఆయన మరణం తీరని లోటు’’అని ట్విటర్లో విచారం వ్యక్తం చేశారు. ఇక బాలీవుడ్ తారాగణం సైతం ఫ్లాయిడ్ మృతికి సంతాపం తెలిపింది. క్యాన్సర్‌కు న్యూయార్క్‌లో చికిత్స పొందిన నటుడు రిషీ కపూర్ ఫ్లాయిడ్ చేతి వంటను గుర్తుచేసుకున్నారు. రాహుల్ బోస్, సోనం కపూర్ తదితరులు ఫ్లాయిడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. (చైనా దాస్తోంది: పాంపియో ) .@floydcardoz made us all so proud. Nobody who lived in NY in the early aughts could forget how delicious and packed Tabla always was. He had an impish smile, an innate need to make those around him happy, and a delicious touch. This is a huge loss... pic.twitter.com/Q6eRVIpZkL — Padma Lakshmi (@PadmaLakshmi) March 25, 2020 -
యూఎన్డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) తన నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మిని నియమించింది. టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మిని అంబాసిడర్‌గా నియమిస్తున్నుట్లు యూఎన్డీపీ ప్రకటించింది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలైన ఆమె అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి పాటుపడాల్సి ఉంటుంది. ‘ప్రపంచంలోని అనేక మంది మహిళలు, బాలికలు ఎన్నో వివక్షలను, అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న సంగతి మనం మరచిపోకూడదు. ప్రధానంగా అసమానతపై దృష్టి సారిస్తా’ అని ఈ సందర్భంగా పద్మాలక్ష్మీ అన్నారు. -
స్త్రీలోక సంచారం
పదహారేళ్ల వయసులో తనపై తన బాయ్‌ఫ్రెండ్ అత్యాచారం చేసిన సంగతిని ప్రముఖ మోడల్, టీవీ హోస్ట్ పద్మాలక్ష్మి.. ‘వై ఐ డిడ్ నాట్ రిపోర్ట్’ (అప్పుడే ఎందుకు చెప్పలేదంటే) అనే ఒక కొత్త మహిళా ఉద్యమానికి మద్దతుగా బహిర్గతం చేశారు. యు.ఎస్. సుప్రీంకోర్టు ఆటార్నీగా నామినేట్ అయిన జస్టిస్ బ్రెట్ ఎం.కవానా తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ‘అప్పుడే ఎందుకు చెప్పులేదు?’ అని అనడంతో మొదలైన ఈ ‘వై ఐ డిడ్ నాట్ రిపోర్ట్’ ఉద్యమానికి.. ఒక్కో మహిళా ముందుకొచ్చి ‘అప్పుడే ఎందుకు చెప్పలేదంటే..’ అంటూ తన జీవితంలోని లైంగిక అకృత్యపు చేదు అనుభవాన్ని పది మందికీ చెప్తున్న క్రమంలో పద్మాలక్ష్మి బయటికి వచ్చి, తనపై టీనేజ్‌లో జరిగిన అత్యాచారాన్ని లోకానికి వెల్లడిస్తూ... ‘‘బాధితురాలు తన బాధను పైకి చెప్పుకోడానికి కాలపరిమితి ఉంటుందా!’’ అని ప్రశ్నించారు. బెంగళూరులోని మాన్యత టెక్ పార్క్‌లో ‘టైమ్స్ క్రియేషన్స్’ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 3న జరుగనున్న ‘ప్యూరిటీ అండ్ ఎక్స్ప్రెషన్’ సంగీత కార్యక్రమంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ప్రదర్శన ఉండడంపై స్థానిక అతివాద సంస్థలు కొన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో గత ఏడాది డిసెంబర్ 31 నాటి సన్నీ ప్రదర్శనలాగే ఇదీ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసభ్యతకు ప్రతీక అయిన సన్నీలియోన్‌ను ఈ కార్యక్రమానికి అనుమతించేది లేదని ‘కర్ణాటక రక్షణ వేదిక యువ సేన’ అంటుండగా, నిర్వాహకులు మాత్రం.. లియోన్ ప్రదర్శన వల్ల కన్నడ సంస్కృతికి జరిగే చేటు ఏమీ ఉండబోదని, అయినా లియోన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు తప్ప, మిగతా కార్యక్రమమంతా కన్నడ నేపథ్య సంగీతకారుడు రఘు దీక్షత్ మాత్రమే నడిపిస్తారని చెబుతున్నారు. అమృత్‌సర్‌లోని షాదజా గ్రామ మాజీ సర్పంచ్ బల్వంత్ సింగ్‌ను రాజకీయ ప్రేరేపణలపై అరెస్టు చేయడానికి వెళ్లిన పంజాబ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పోలీసులు.. అతడు ఇంట్లో లేకపోవడంతో, అతడి కోడలు జస్వీందర్ కౌర్‌ను.. ‘‘ఏ కారణంతో మా మామగారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు?’’ అని అడిగిందన్న ఆగ్రహంతో ఆమెను జీప్ బోనెట్‌పై వేసుకుని తీసుకెళుతుండగా.. మూడు కిలోమీటర్లు ఎలాగో పట్టు తప్పకుండా నిలదొక్కుకున్న కౌర్ ఓ మలుపులో రోడ్డుపై పడి.. గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించిన పంజాబ్ హోం శాఖ.. ఆ మహిళపై దురుసుగా ప్రవర్తించిన పోలీసుల వెనుక ఏ పార్టీ నాయకులు ఉన్నారనే దాని పైనా దృష్టి సారించింది. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో చదువుతున్న కాంగో విద్యార్థిని ముకోకో మిసా ట్రెసార్ పై 2014 సెప్టెంబర్ 26న మూక దాడి జరిపిన కేసులో.. ఆ మూకల్ని రెచ్చకొట్టి, దాడికి పురికొల్పిన నేరారోపణలకు తగిన రుజువులు ఉండడంతో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతిపై అభియోగ పత్రాలను దాఖలు చేయాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల తర్వాత ఖిర్కీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ, వ్యభిచారం చేస్తున్నారన్న అనుమానంతో అక్కడి కొందరు ఆఫ్రికన్ మహిళలపై దాడి జరిపిన దుండగులు.. విద్యార్థిని అయిన ముకోకో మిసా ట్రెసార్పైన కూడా మూకుమ్మడి దాడికి పాల్పడగా.. ఆ ప్రాంతం ఉన్న మలావియా నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి హస్తం ఈ దాడుల వెనుక ఉందన్న ఆరోపణపై అప్పట్లోనే కేసు నమోదు అయింది. రాఫెల్ డీల్‌పై ఓ వ్యంగ్యాస్త్రంగా ప్రధాని మోదీ ఫొటోను అనుచితంగా చిత్రీకరించి ట్విట్టర్లో పెట్టిన కాంగ్రెస్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్చార్జి, మాజీ ఎం.పి. దివ్య స్పందన అలియాస్ రమ్యపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. దివ్య స్పందన ట్వీట్ చేసిన ఆ ఫొటో దేశ ప్రధానిని కించపరచడమే కాకుండా, దేశ ప్రతిష్టను సైతం భంగపరిచేలా ఉందని లక్నోకు చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది అయిన సయీద్ రిజ్వాన్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దివ్య స్పందనపై పోలీసులు సెక్షన్ 67 ఐటీ యాక్ట్, సెక్షన్ 124ఎ (దేశద్రోహం) ఐ.పి.సి. యాక్టు కింద కేసులు నమోదు చేశారు. ఇంగ్లండ్ నవ రాకుమారి, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ తన కారు డోరును తనే వేయడం బ్రిటన్ రాజప్రాసాదాన్ని, బ్రిటన్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది! మేఘన్ మంగళవారం నాడు లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో జరుగుతున్న ఎగ్జిబిషన్‌లోని ఒక కార్యక్రమానికి హాజరయేందుకు వచ్చినప్పుడు, తానొచ్చిన నల్ల రంగు సెడెన్ కారులోంచి దిగి, అక్కడి భద్రతా సిబ్బంది ఆమె దిగిన వైపు కారు డోరును వేసేలోపే, అసంకల్పితంగా ఆమే కారు డోరు వెయ్యడం.. సోషల్ మీడియాలో ఒక నివ్వెరపరిచే వార్తలా వైరల్ అవుతుండగా... ‘‘రాజకుటుంబ సంప్రదాయాలు తెలియక కాదు, అలవాటు కొద్దీ మేఘన్ అలా చేశారు’’ అని ఆమె ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. అమన్‌దీప్ మాధుర్ అనే 26 ఏళ్ల భారతీయ సంతతి బ్రటిష్ మహిళ తన ప్రేమను కాదన్న మాజీ ప్రియుడిని, అతడి కుటుంబాన్ని గత ఐదేళ్లుగా వేధింపులకు గురి చేస్తూ, మత విశ్వాసాలు గాయపడేలా అతడి ఇంట్లోకి ఆవు మాంసాన్ని విసురుతూ.. అతడి చెల్లెళ్లపై, తల్లిపై అత్యాచారం జరుపుతామని మనుషుల్ని పెట్టి బెదిరిస్తూ, ఇంటిని బాంబులు పెట్టి పేల్చేస్తానని భయపెడుతూ.. ఇన్ని రకాలుగా చిత్ర హింసలు పెట్టిన నేరానికి యు.కె. కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫోన్ కాల్స్ ద్వారా, సోషల్ మీడియాలోనూ అమన్‌దీప్ పెట్టిన టార్చర్‌కు బాధితుడు అన్ని విధాలా మానసికంగా కృంగిపోయాడని నిర్థారించుకున్న కోర్టు ఆమె శిక్ష విధించడంతో పాటు, కౌన్సెలింగు కూడా అవసరమని సూచించింది. పరస్త్రీ, పరపురుష సంబంధాలు (అడల్టరీ) తప్పు కాదని గురువారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బాహాటంగా వ్యతిరేకించిన ఢిల్లీ ఉమెన్ పానెల్ చీఫ్ స్వాతీ మలీవాల్‌పై సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ఈ తీర్పు మన వివాహ వ్యవస్థ పవిత్రతనే పంకిలపరిచింది’’ అనే అర్థంలో ఆమె చేసిన ట్వీట్‌కు ప్రతి స్పందనగా సోషల్ మీడియాలో ముక్కూమొహం లేని అకౌంట్ల నుండి అమె మనసును గాయపరిచే కామెంట్లు అనేకం వెల్లువెత్తాయి. -
ప్రపంచం చిన్నదైంది... మచ్చ పెద్దదైంది
టాప్ షెఫ్ పద్మాలక్ష్మి పుస్తకాలు చదివి జీవితాన్ని నేర్చుకున్న వాళ్లున్నారు. జీవితాన్ని చూసి పుస్తకాలు రాసిన వాళ్లున్నారు. కానీ.. పద్మ రాసిన పుస్తకాలు చూసి పొయ్యి వెలిగించినవాళ్లు చాలామందే ఉన్నారు. వెలుగులో వేడి ఉన్నట్లే... పద్మాలక్ష్మి జీవిత పుస్తకంలో గొప్ప వేడి ఉంది. ప్యాషన్ ఉంది. ఫ్యాషన్ ఉంది. అందుకే పద్మాలక్ష్మి... భోజ్యేషు పద్మ– లవ్వేషు లక్ష్మి! ది వే టు ఎ మాన్స్ హార్ట్ ఈజ్ హిజ్ స్టొమక్. రుచికరంగా వండిపెడితే మగాడు ఢమాల్‌మని ప్రేమలో పడిపోతాడట! ఫుడ్డుతోనా, ఫుడ్డును వండిపెట్టిన వాళ్లతోనా? ఎవరితో పడిపోతాడు ప్రేమలో?! ప్రేమను ఫుడ్డుతో కలిపి పెట్టినవాళ్లతో! సరేనా? రేపు వాలెంటైన్స్ డే. ‘టాప్ చెఫ్’ పద్మాలక్ష్మి రేపు ఇండియా వస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు చెన్నై నుంగంబాక్కంలోని తాజ్ కోరమండల్ హోటల్లో.. తను వండి వార్చిన పుస్తకాన్ని వడ్డించబోతున్నారు. ‘లవ్, లాస్ అండ్ వాట్ వియ్ ఏట్ : ఎ మెమైర్’ ఆ వంటకం పేరు. అదొక గైడ్. హెల్త్ గైడ్, ఫుడ్ గైడ్, లవ్ గైడ్. ఎలా అన్నిటినీ మిక్స్ చేయగలిగారు పద్మాలక్ష్మి! ఆమె జీవితంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి, అవన్నీ లేవు కూడా కాబట్టి! బ్యాచిలర్స్కి పద్మపూర్ణమ్మ! అమెరికన్ టీవీ చానల్ ‘బ్రేవో’ లో ‘టాప్ చెఫ్’ అనేది పాపులర్ రియాలిటీ షో. దాని హోస్ట్ పద్మాలక్ష్మి. తమిళ్ అమ్మాయి. చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోయింది. అప్పుడప్పుడూ ఇండియా వచ్చి వెళుతుంటుంది. గత సోమవారం మన హైదరాబాద్‌కి కూడా వచ్చింది. ఏడేళ్ల చిన్న పాప, తను! ఇదే ఆమె ఫ్యామిలీ. అయితే పద్మాలక్ష్మి సృష్టించిన రెసిపీలను ఇష్టంగా ఆరగించేవారందరినీ కలుపుకుంటే ఆమెదొక ఖండాంతర ఫ్యామిలీ అనుకోవాలి. ఖండఖండాలలోని కిచెన్ రూమ్‌లలో ఆమె వంటల పుస్తకాలు కనిపిస్తాయి. ఆమె రాసిన త్రీ మినిట్, ఫోర్ మినిట్ ‘తయారీ’లతో బతుకు లాగించేస్తున్న బ్యాచిలర్లు, నిర్బంధ బ్యాచిలర్లు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. ఇల్లాళ్లకైతే పండగే. పద్మాలక్ష్మి పుణ్యమాని ఇంటాయన్ల కడుపులోంచి హృదయంలోకి వారు అవలీలగా ప్రవేశించ గలుగుతున్నారు. కొంచెం ఎక్కువనిపించినా ఇది నిజం. అయితే.. కిచెన్, ఫ్యాషన్, ఫెమినిజం, యాంటీ రేసిజం.. వీటితోపాటు పద్మాలక్ష్మి జీవితంలో దారుణమైన అనుభవాలు ఉన్నాయి! బాల్యంలో లైంగిక వేధింపులు ఉన్నాయి. నెలనెలా వదలక వెంటాడిన ‘దెయ్యమూ’ ఉంది! పద్మాలక్ష్మీ జీవితంలోంచి సంతోషాన్ని దూరం చేసిన మొదటి వ్యక్తి ఆమె తండ్రి! రెండో టార్చర్.. ‘ఎండోమెట్రియోసిన్’! పొత్తికడుపు నొప్పి. నాన్న వడ్డించని.. ప్రేమ విస్తరి! పద్మ తండ్రి వైద్యనాథన్ ఫైజర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్. తల్లి విజయ నర్సు. ఆంకాలజీ నర్సింగ్‌లో స్పెషలిస్టు. పద్మకు రెండేళ్ల వయసప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. విజయకు పద్మ ఒక్కటే కూతురు. పద్మకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. వీళ్లిద్దరూ తండ్రి రెండో భార్య సంతానం. మామూలుగా తన చెల్లి గురించి మాట్లాడరు పద్మాలక్ష్మి. కానీ ‘గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె హార్ట్ దాదాపుగా బ్రేక్ అయింది. ‘‘నా చెల్లి కెరీర్ కోసం నాన్న ఫైజర్‌లో ఉద్యోగం మాని, తన కెరీర్‌ని త్యాగం చేశాడు. ఆ ప్రేమ నా మీద ఏమైందో అర్థం కాదు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు పద్మాలక్ష్మి. ఆ వెంటనే సర్దుకున్నారు. ఇది ఆమెకు జీవితం నేర్పిన పాఠం. ‘నీకు జరుగుతున్న దాన్ని నువ్వు ఆపలేవు. కానీ, నీకు జరుగుతున్న దానికి నువ్వెలా ఉండాలన్నది మాత్రం నీ చేతుల్లోనే ఉంది’. పద్మాలక్ష్మి ఫిలాసఫీ ఇది. అందుకే ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. యు.ఎస్.లో అమ్మ.. చెన్నైలో పద్మ భర్త నుంచి విడిపోగానే, ఇండియా నుంచీ మానసికంగా విడిపోయారు పద్మ తల్లి. చెన్నై నుంచి న్యూయార్క్ వెళ్లిపోయారు. కూతుర్ని ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంచేశారు. అలా న్యూయార్క్–చెన్నైల మధ్య పద్మ బాల్యం మొదలైంది. పద్మ అయ్యంగార్ల అమ్మాయి. ఆమె తల్లిదండ్రుల పూర్వీకులది కేరళ. న్యూ యార్క్‌లో తల్లి దగ్గరికి, చెన్నైలో అమ్మమ్మ దగ్గరికి తిరుగుతూ సంప్రదాయం, ఆధునికం కలగలిసిన విలక్షణమైన స్త్రీగా ఎదిగారు పద్మ. ఆమె పూర్తి పేరు పద్మాపార్వతీలక్ష్మీ వైద్యనాథన్. పద్మ టీనేజ్ హాయిగా సాగలేదు. పద్నాలుగవ యేట పద్మ మూడు వారాలు న్యూయార్క్ ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. వైద్యులు ఆమెకు ‘స్టీవెన్స్–జాన్సన్ సిండ్రోమ్’ అని తేల్చారు. ప్రాణాంతకమైన చర్మ వ్యాధి. ఫస్ట్ స్టేజీలో ఉన్నప్పుడు కనిపెట్టారు. మంచి మెడిసిన్‌తో బయట పడేశారు. ఈ లోపు పద్మాలక్ష్మి జీవితంలో ఊహించని ఘటన జరిగింది. హాస్పిటల్ ఉంచి డిశ్చార్జి అయిన రెండు రోజుల తర్వాత.. కాలిఫోర్నియాలో కారు ఆక్సిడెంట్ జరిగి పద్మ కుడి తుంటి విరిగింది. కుడి చెయ్యి పైభాగంలో ఎముక చిట్లింది. సర్జరీ తర్వాత నయం అయ్యింది కానీ, ఆమె కుడి చేతి భుజం కింద ఇప్పటికీ ఏడంగుళాల పొడవున సర్జరీ జరిగిన మచ్చ కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచం చిన్నదైంది... మచ్చ పెద్దదైంది పద్మాలక్ష్మి మరీ నలుపు కాదు, చామన ఛాయా కాదు. కానీ అమెరికన్ స్కూళ్లలో అది కారునలుపే. పద్మ క్లాస్మేట్స్ ఆమెను వేధించేవాళ్లు. ఏడిపించేవాళ్లు. రంగు కారణంగా ఆమె తెలివితేటలు వెలవెలపోయాయి. అత్యాచారానికి ఏ మాత్రం తక్కువకాని విధంగా అమెపై ‘బుల్లీయింగ్’ జరిగింది. అప్పుడే అనుకుంది పద్మ. లోపల్నుంచి తను స్ట్రాంగ్‌గా ఎదగాలని. రేసిజాన్ని ఆమె తన మోడలింగ్‌తో డీ కొట్టాలనీ. కొట్టారు! స్కూలింగ్ అయింది. థియేటర్ ఆర్ట్స్‌లో డిగ్రీ అయింది. మోడలింగ్ కోసం మ్యాడ్రిడ్ వెళ్లిపోయారు. కనీసం నాలుగు భాషలైనా తెలిసిన అమ్మాయికి ప్రపంచం చిన్నదైపోతుంది. కానీ మోడలింగ్ ప్రపంచానికి ఆమె చేతి మీద మచ్చ పెద్దదిగా కనిపించింది. పద్మకు ఇంగ్లిష్, తమిళ్, హిందీ, ఇటాలియన్, స్పానిష్ భాషలు వచ్చు. అవేమీ పని చేయలేదు. మోడలింగ్ మహానీయులు ఆమె దేహం.. తెలుపు రంగును మాట్లాడ్డంలేదని తిరస్కరించారు! మోడలింగ్.. ఫ్యాషన్.. కిచెన్ బుక్స్ అప్పటికి పద్మ వయసు 21. మ్యాడ్రిడ్లోని ఒక కెఫెలో ఒంటరిగా కూర్చొని ఉంది. ఆ మధ్యాహ్నం ఒక ఫ్యాషన్ ఏజెంటు వచ్చి ఆమెను కలిశాడు. పద్మకు అదే ఫస్ట్ మోడలింగ్ డీల్. ఆ తర్వాత కొద్ది కాలానికే పారిస్‌లో, మిలాన్‌లో, న్యూయార్క్‌లో ఒకేసారి కెరీర్‌ను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్‌గా పద్మాలక్ష్మికి గుర్తింపు వచ్చింది. ఆమెను స్వీకరించినట్లే, ఆమె మచ్చనూ స్వీకరించడం మొదలుపెట్టింది ఫ్యాషన్ ప్రపంచం! పెద్ద పెద్ద అంతర్జాతీయ పత్రికల ముఖచిత్రంగా పద్మాలక్ష్మి దర్శనమిచ్చారు. మోడలింగ్ నుంచి టీవీలకు, టీవీల నుంచి సినిమాలకు వెళ్లారు! వాటిని మించి రిసిపీ బుక్స్ ఆమెకో ఇమేజ్ తెచ్చిపెట్టాయి. పద్మ రాసిన మొదటి పుస్తకం ‘ఈజీ ఎక్సాటిక్’. రెండో పుస్తకం ‘ట్యాంగీ, టార్ట్, హాట్ అండ్ స్వీట్’. ఇటీవలి పుస్తకమే.. ‘లవ్ , లాస్, వాట్ వియ్ ఏట్’. ప్రేమానుబంధాలు! ముప్పై నాలుగేళ్ల వయసులో వివాదాస్పద రచయిత సాల్మన్ రష్దీని పెళ్లి చేసుకున్నారు పద్మాలక్ష్మి. అయితే మూడేళ్లు మాత్రమే కలిసున్నారు. ఈ మధ్యలో రష్దీ.. ‘ఫ్యూరి’ అనే నవలను రాసి పద్మకు అంకితం ఇచ్చారు. రష్దీతో విడాకులు తీసుకున్నాక వెంచర్ క్యాపిటలిస్టు ఆడమ్ డెల్‌కు దగ్గరయ్యారు పద్మ. వాళ్లకు పుట్టిన పాపే.. ఎప్పుడూ పద్మ వెంట కనిపించే కృష్ణ (6). డెల్‌తో విడిపోయాక ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూపు (ఐ.ఎం.జి) సిఇవో టెడ్డీ ఫార్స్›్టమన్తో ప్రేమలో పడ్డారు పద్మ. 71 ఏళ్ల టెడ్డీ 2011లో చనిపోయారు. టీనేజ్‌లో మొదలైన నరకం! ఇరవై ఏళ్ల పాటు పద్మ ఎండోమెట్రియోసిస్‌తో బాధపడ్డారు. దీనిని 16 వ యేట, 26 వ యేట, కనీసం 32 వ యేట గుర్తించినా నేను నా కుటుంబంతో, నా స్నేహితులతో హాయిగా ఎక్కువ సమయం గడపడానికి వీలయ్యేది అని పద్మ ఇప్పటికీ బాధపడుతుంటారు. తనలా బాధపడే వారికోసం పద్మాలక్ష్మి ‘ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ను నెలకొల్పారు. పచ్చళ్లలో కారం.. ప్రేమలో మమకారం పద్మాలక్ష్మికి నిల్వ పచ్చళ్లంటే ఇష్టం. చిల్లీస్ అంటే చచ్చేంత ఇష్టం. అమ్మమ్మ తనకు అందకుండా పై షెల్ఫులో పచ్చడి సీసాను పెడితే, స్టూల్ ఎక్కి సీసాను తియ్యబోతూ దాన్ని పడేసి తిట్లు తిన్న పిల్ల. ఘాటు కోసం తనేమైనా చేస్తుంది. అదే ఘాటును ఆమె ఫుడ్డులోను, ప్రేమలోనూ కోరుకున్నారు. ఆ ఘాటునే కొసరి కొసరి వడ్డించారు. ఇక ఆమె కొత్తగా ఏం సర్వ్ చేయబోతున్నారన్నది రేపు చెన్నై తాజ్ కోరమండల్లో తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటే నేర్చుకోలేం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ప్రముఖ అంతర్జాతీయ మోడల్, టీవీ హోస్ట్, నటి, రచయిత్రి పద్మాలక్ష్మితో ఇటీవల జరిగిన ప్రియభాషణలో ‘సాక్షి’ సిటీ బ్యూరో రిపోర్టర్ ఓ మధు పాల్పంచుకున్నారు. పచ్చళ్లంటే మీకు ఎందుకంత ఇష్టం?! ఘాటుగా ఉంటాయి. రిలేషన్షిప్స్లో కూడా మీరు అంతే గాఢతను ఆశించినట్లున్నారు! వెల్, పైపైన ఇష్టపడడం ప్రేమ అవుతుందా! మోడలింగ్ మిమ్మల్ని పైకి తెచ్చింది. మీరేమో రెసిపీలను పైకి తెస్తున్నారు. మోడలింగ్ మానేసినట్లేనా? దుస్తులకు మోడలింగ్ తగ్గించేశాను. నా ఇష్టాలకు మోడలింగ్ చేస్తున్నాను. రుచికరమైన భోజనం జీవితంపై ప్రేమను కలిగిస్తుంది. ఆ విధంగా నేను ప్రేమకు మోడలింగ్ చేస్తున్నాను. మీ పాకశాస్త్ర గురువు మీ అమ్మమ్మ అని చెప్పారు. ప్రేమశాస్త్రంలో? ప్రేమ.. శాస్త్రం కాదు. ఇట్సెల్ఫ్.. ఎ గురు. ప్రేమ చాలా నేర్పుతుంది. మీకేం నేర్పింది? (నవ్వుతూ) ప్రేమించడం నేర్పింది. ప్రేమించడం అంటే.. మనం ప్రేమించినవాళ్ల ఫీలింగ్స్‌ని గౌర వించడం. మంచి షెఫ్ అవడం కన్నా... ప్రేమించడం ఈజీ అనిపిస్తుంది! హహ్హహా.. నాట్ లైక్ దట్! మంచి షెఫ్ అవడం కూడా కష్టం ఏమీ కాదు. బాగా ట్రావెల్ చెయ్యాలి. ఇంట్లో కూర్చుంటే కొత్తగా ఏం నేర్చుకోలేం. మాధవ్ శింగరాజు సాల్మన్ రష్దీతో... ఆడమ్ డెల్‌తో... టెడ్డీ ఫార్స్మన్తో...