వాగులో కొట్టుకుపోయిన కారు: తల్లీ, కొడుకు గల్లంతు
నిజామాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. వేల్పూర్ మండలం పడకల వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. వాగులో శనివారం కారు కోట్టుకుపోయింది. దీంతో అందులోని తల్లీ, కొడుకు గల్లంతయ్యారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1084 అడుగుల నీరు వచ్చి చేరింది.
ప్రాజెక్టులో ఇన్ఫ్లో లక్షా 31 వేల 713 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 11 వేల క్యూసెక్కులు ఉంది.నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులో నీటిమట్టం 1405 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1377 అడుగులకు నీరు వచ్చి చేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 18 వేల క్యూసెక్కులు ఉంది.