breaking news
p k mahanthi
-
అవే కీలకం...
జాతరలో నీరు.. పారిశుద్ధ్యమే ప్రధానం మహాజాతరకు నిధుల కొరత లేదు రెండ్రోజుల ముందే పనులు పూరి ్తచేయాలి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష మేడారంలో మొక్కులు చెల్లించుకున్న సీఎస్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ కోటి మందికి పైగా హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయూలని, కీలకమైన శానిటేషన్, తాగునీటి వసతులపై దృష్టి సారించాలని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి సూచించారు. మేడారం మహాజాతర నేపథ్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పనులన్నీ జాతర ప్రారంభానికి రెండు రోజుల ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం జిల్లాకు వచ్చిన సీఎస్ ఉదయం మేడారంలో వనదేవతలను సందర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మ తల్లులకు మొక్కులు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయూణంలో జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కలెక్టర్ కిషన్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రట్రరీ వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వర్ హాజరుకాగా.. జిల్లా అధికారుల కు మహంతి పలు సూచనలు చేశారు. రాష్ర్టంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి జాతరకు వచ్చే భక్తులు సంతోషంగా, ప్రశాంతం గా తల్లులను దర్శనం చేసుకునేలా పటిష్టమైన ఏర్పా ట్లు చేయాలన్నారు. అన్ని పనులను జాతరకు రెండురోజుల ముందే పూర్తి చేసి.. సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోవాలని ఆదేశించారు. గద్దెల తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య రాకుండా చూడాలన్నారు. వైద్యసేవలు ఆస్పత్రుల వద్దే కాకుండా మొబైల్ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శభాష్ కిషన్... దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అరుున మేడారంలో తాను స్వ యంగా పనులు పరిశీలించానని... భక్తులకు సౌకర్యాలు కల్పించేం దుకు కలెక్టర్ కిషన్ ఆధ్వర్యంలో చేస్తున్న కృషి అభినందనీయమని సీఎస్ మహంతి కితాబిచ్చారు. అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే *100 కోట్లు కేటాయించామని... నిధులు విడుదల విషయంలో ఆందోళన చెందొద్దన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్ ద్వా రా తన దృష్టికి తేవాలని సూచించారు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు... జాతర సమయంలోనే కాకుండా భక్తులు మేడారానికి అన్నివేళల్లో వస్తున్నందున వారికోసం శాశ్వత సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎస్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం టీటీడీ నిధులతో వసతి సముదాయాల ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. మేడారంలో శాశ్వత ఆస్పత్రి ఏర్పాటుచేయాలని డీంహెచ్ఓ సాంబశివరావు కోరగా... పరిశీలిస్తామని హామీ ఇచ్చి సీఎస్, తాగునీరు, పా రిశుద్ధ్యంపై కూడా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం : కలెక్టర్ మేడారం జాతరలో అమ్మవార్లను నాలుగు రాష్ట్రాలవారు సందర్శిస్తారని కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. మేడారంలో కంట్రోల్‌రూం ఏర్పాటు, రెస్క్యూటీంలు, అత్యవసర వైద్యసేవలు అందుబాటు లో ఉంటాయన్నారు. పనులు సకాలంలో పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నా. గిరిజన సంప్రదాయాలు, సం స్కృతికి ఆటంకం కలుగకుండా జాతరను నిర్వహిస్తామన్నారు. ఎన్పీడీసీల్కు చెల్లించాల్సిన బకాయిలను ఇతర శాఖలు వెంటనే చెల్లించాలని సూచించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ సమాచార వ్యవస్థ సక్రమంగా ఉండేలా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలన్నారు. జాతరలో భద్రతాపరమైన చర్యలను డీఐజీ కాంతారావు, రూరల్ ఎస్పీ కాళిదాసు వివరించారు. అంద రి కృషితో జాతరను విజయవంతం చేద్దామని, తాను కూడా ఒక అధికారిలా మేడారంలో పనిచేస్తానని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సమీక్షలో జేసీ పౌసుమిబసు, అర్బన్‌ఎస్పీ వెంకటేశ్వర్రా వు, సీఎండీ కార్తికేయమిశ్రా, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ సంజీవయ్య, వరంగల్ కమిషనర్ పాండాదాస్, అధికారులు పాల్గొన్నారు. మేడారంపై ఛాయా చిత్ర ప్రదర్శన మేడారం పాత, కొత్త చిత్రాలతో కలెక్టరేట్లో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటుచేయగా, సీఎస్ ఆసక్తిగా తిలకించారు. జాతరలో కూడా ప్రదర్శన, సంగీత నాటక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు డీపీఆర్వో వెంకటరమణ మహంతికి వివరించారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ సూపర్ సైక్లోన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి కోరారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెలెన్ తుపాను తర్వాత లెహర్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందన్నా రు. లెహర్ తుపాను సూపర్ సైక్లోన్‌గా మారి ఈ నెల 28 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని చెప్పారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముం దస్తు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, మిలటరీ, నెవీ, కోస్ట్‌గార్డులను సహాయ చర్యల కు వినియోగిస్తామని తెలిపారు. పంట కోతకు వచ్చిన సమయంలో రైతులు మరింత నష్టపోకుండా ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఈ విషయంలో రైతులను అప్రమత్తం చేయాలని కోరారు. స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా 450 మంది ఫైర్ ఆఫీసర్లను, 450 మంది పోలీసు అధికారులకు శిక్షణనిచ్చి సిద్ధం చేశామన్నారు. గతంలో కురిసిన వర్షాలకు చెరువులకు గండ్లు పడిన చోట మరింత అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు కిరోసిన్ ఇతర ఆహార పదార్థాల నిల్వల విషయంలోప్రతిపాదనలు పంపాలని కోరారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామని తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని జిల్లాకు పంపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇప్పటికే అన్ని చెరువులు నిండి ఉన్నాయని, వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ప్రభాకర్‌రావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఏఎస్పీ రమారాజేశ్వరి, ఇన్చార్జీ డీఆర్ఓ అంజయ్య, ట్రాన్స్‌కో ఎస్ఈ కరుణాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు పాల్గొన్నారు.