breaking news
Overwhelming public
-
ఇంత ప్రేమ ఇంతకుముందెన్నడూ చూడలేదు: హీరో సూర్య
సాక్షి, హైదరాబాద్: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన జైభీమ్ వివాదం, ఈ నేపథ్యంలో తనకు లభిస్తున్న స్పందనపై సూర్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సూర్య బుధవారం ట్వీట్ చేశారు. (Jai Bhim: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది ) జైభీమ్ మూవీని ఆదరిస్తున్న తీరు, ప్రేమ అపారమైనది. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ప్రేమ చూడలేదంటూ సూర్య తన ఆనందాన్ని ప్రకటించారు. ఈ సమయంలో తమకు అందించిన విశ్వాసం, భరోసాకు ఎంత కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో చెప్పలేనంటూ ట్వీట్ చేశారు. జైభీమ్ సినిమా వివాదం నేపథ్యంలో హీరో సూర్యకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించింది. స్టాండ్ విత్ సూర్య అంటూ నెటిజనులు సూర్య అండ్ టీంకు అండగా నిలబడు తున్నారు. కాగా ఈ మూవీలో ప్రకాష్ రాజ్ చెంపదెబ్బ సీన్‌పై వివాదం సమసిపోకముందే ఈ సినిమాలోని పలు అంశాలు ఓ వర్గం వారికి కించపరిచేలా ఉన్నాయని పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. ఈ ఆరోపణలను హీరో సూర్య ఖండించారు. మరోవైపు హీరో సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని పీఎంకే పార్టీ నేతలు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే జైభీమ్ సినిమా వివాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయ వద్దని, ఆవేశకావేశాలకు లోను కావద్దని తన ఫ్యాన్స్‌కు పిలుపు నిచ్చారు. అన్ని వర్గాలు, కులాల వారిని సమంగానే చూడాలని ఎవరినీ కించపరచొద్దంటూ ఒకలేఖ రాశారు. అటు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జైభీమ్ సినిమా ఓటీటీలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీ రేటింగ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకు పోతోంది. Dear all, this love for #Jaibhim is overwhelming. I’ve never witnessed this before! Can’t express in words how thankful I am for the trust & reassurance you all have given us. Heartfelt thanks for standing by us ✊🏼 — Suriya Sivakumar (@Suriya_offl) November 17, 2021 -
ఉప్పొంగిన ప్రజాభిమానం - ముందుకు కదలలేకపోతున్న జగన్
-
ఉప్పొంగిన ప్రజాభిమానం
రాజమండ్రి: ప్రజాభిమానం ఉప్పొంగటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముందుకు కదలలేకపోతున్నారు. జగన్ వస్తున్నట్లు తెలిసి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మధురపూడి విమానాశ్రయం వద్దకు తరలి వచ్చారు. విమానాశ్రయం వద్ద జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా జగన్‌ను చూసేందుకు జనం తరలి రావడంతో విమానాశ్రయం నుంచి రాజమండ్రి వరకు ట్రాఫిక్ జాం అయింది. మదురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి పది కిలో మీటర్లు రావడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. దారి పొడువునా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అభిమానుల తాకిడితో ఆయన కాన్వాయి ముందుకు కదలలేని పరిస్థితి. రాజమండ్రి కంబాల చెరువు జంక్షన్‌కు చేరుకున్న జగన్ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అక్కడ భారీ స్థాయిలో గుమ్మిగూడిన జనంను ఉద్దేశించి కొద్దిసేపు మాత్రమే ప్రసంగించారు. ప్రసంగించాలని జనం కోరారు. అయితే తాను ఒక పెళ్లికి వెళుతున్నానని, మళ్లీ ఇక్కడికి వస్తానని వారికి నచ్చజెప్పారు. జగన్ ప్రసంగం చివరలో జై తెలుగు తల్లీ - జై సమైక్యాంధ్ర - జోహార్ వైఎస్ఆర్ - జోహార జక్కంపూడి అని నినదించారు. జనం జై జగన్, జై జగన్... అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.