breaking news
Overdraft facility
-
జన్‌ధన్ ఖాతాలకు ఓవర్ డ్రాఫ్టు!
న్యూఢిల్లీ: జన్‌ధన్ ఖాతాదారులతోపాటు ఇతరులకు ఆర్థిక లబ్ధి కల్పించడం ద్వారా ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటును విస్తృతం చేసే పలు పథకాలను స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి మోదీ ప్రకటించనున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎండీజేవై) కింద జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాలున్న వారికి రూ.10వేల వరకు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించనుంది. రూపే కార్డు దారులకు ఉచిత ప్రమాద బీమా మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.లక్ష నుంచి మరింత పెంచనుంది. సూక్ష్మ బీమా పథకాన్ని కూడా తీసుకురానున్నారు. వీటితోపాటు అసంఘటిత రంగ కార్మికులకు మాత్రమే ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పింఛను మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచనున్నట్లు కూడా ప్రకటించవచ్చునని సమాచారం. ప్రభుత్వం 2014లో ప్రకటించిన పీఎండీజేవై కింద 32.25 కోట్ల ఖాతాలు ప్రారంభం కాగా రూ.80,674.25 కోట్లు జమ అయ్యాయి. -
పంచాయతీ సొమ్ము ఫలహారం
కోదాడటౌన్, న్యూస్‌లైన్: నల్లబండగూడెం గ్రామ సొమ్మును తలా ఇంత తిన్నారు. జరిగిన అన్యాయాన్ని గ్రామస్తులు స్థానిక అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదు చేశారు. కానీ వారి రోదన అరణ్యరోదనగా మారింది. పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా చేసుకొని అధికారుల, ప్రజాప్రతినిధుల అవినీతి బండారాన్ని సాక్ష్యాధారాలతో వెలికి తీసి లోకాయుక్తాకు ఫిర్యాదు చేయడంతో ఈ అవినీతి డొంక కదిలింది. దీనిలో అందరూ పాత్రధారులగా మారిన వైనం, చట్టాలున్నా, నిబంధనలున్నా కనీస భయం లేని వైనం ఈ కుంభకోణంలో కళ్లకు కడుతున్నది. ప్రతి సంవత్సరం తనిఖీ చేయాల్సిన అధికారులు చూసి చూడ నట్లు వ్యవహరించన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ) సౌకర్యం కూడా కల్పించారు.. నల్లబండగూడెం గ్రామ పంచాయతీకి కోదాడ సబ్ ట్రెజరీ అధికారులు ఓవర్‌డ్రాఫ్ట్ (ఖాతాలో నిల్వ డబ్బులు లేకపోయినా అప్పు రూపంలో నగదు తీసుకోవచ్చు) సౌకర్యం కల్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పంచాయతీ ఖాతాలో నిధులు లేకున్నా 2005 అక్టోబర్ 1వ తేదీన ట్రెజరీ ఉద్యోగులు ప్రజాప్రతినిధికి 25,656 రూపాయలను ఓడిగా ఇచ్చారు. 2005 అక్టోబర్ 28న కూడా మరోసారి 40,486 రూపాయలను ఓడి ఇచ్చారు. ఇది 2006 వరకు కొనసాగింది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఆ ప్రజాప్రతినిధిని ఆదర్శంగా తీసుకున్న అధికారి కూడా ఓడి తీసుకొని డబ్బులను డ్రా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2012 మార్చి 6న కూడా ట్రెజరీ కార్యాలయం నుంచి 19,323 ఓడి తీసుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో అనేక ఉల్లంఘనలున్నందున సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు లోకాయుక్తాను ఆశ్రయించారు.