breaking news
outsourcing of employees
-
కార్పొరేషన్లు..కాసుల కహానీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ పరిధిలోని కొన్ని కార్పొరేషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇందులో పనిచేస్తున్న కొందరు అధికారులు కాంట్రాక్టర్లు, వ్యాపారులతో కలిసిపోయి క మీషన్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కార్పొరేషన్ బోర్డు సమావేశాల్లో ఆమోదం పొందాయని చెప్పుకుంటూ, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు అనుగుణంగా అధికారులు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో కొన్ని నిర్ణయాలు వివా దాస్పదమవుతున్నాయి. కొన్ని నిర్ణయాలు ఆయా కార్పొరేషన్లకు తీవ్రమైన నష్టాన్ని మిగుల్చుతున్నా యి. కొందరు చైర్మన్లు, అధికారులకు రూ.కోట్లలో జేబులు నిండుతున్నాయి. కొన్ని కార్పొరేషన్లు వ్యా పారులు, కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయన్న విమర్శలూ ఉన్నాయి.అంతేకాదు కొందరు చైర్మన్లు, అధికారుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లు, టూర్లకు వ్యాపారులు, కాంట్రాక్టర్లే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు ఆయా సంస్థల ను నిరీ్వర్యం చేస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. విచారణకే పరిమితమయ్యారు.. ఆయా కార్పొరేషన్లపై విచారణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలోనే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రైతుబంధు సమితి, విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ అథారిటీ, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా), తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, విత్తన అభివృద్ధి కార్పొరేషన్, కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్, కోఆపరేటివ్ యూనియన్, కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్, హారి్టకల్చర్ అభివృద్ధి కార్పొరేషన్, తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) సంస్థలపై ఐఏఎస్ అధికారులు విచారణ చేశారు. వాటి ఆస్తులు, ఆదాయాలు, అప్పులు వంటి సమాచారం అందజేశారు. విచారణ చేశారే కానీ ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని కార్పొరేషన్ల తీరు ఇలా... ⇒ ఆయిల్‌ఫెడ్ ఆయిల్పామ్పైనే దృష్టి సారించింది. కానీ అది కూడా పూర్తిస్థాయిలో విజయవంతం చేయలేకపోయింది. సీజన్లలో అవసరమైన ఆయిల్ సీడ్స్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత ఉన్నా, నిర్వహించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇక మిగిలిన కీలకమైన అనేక విషయాలను పక్కన పెట్టేసింది. మార్కెట్లో విజయ నూనె వాటాలను పెంచుకోవడంలో విఫలమైంది. ప్రైవేట్ కంపెనీలు దూసుకుపోతున్నా, తన షేర్‌ను పెంచుకోలేకపోతోంది. అందుకు అవసరమైన ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం కనిపిస్తున్నది. విజయ బ్రాండ్‌తో మినరల్ వాటర్ ప్లాంట్‌ను రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. అయితే దానికి మార్కెటింగ్ కలి్పంచలేదు. దీంతో ఆయిల్‌ఫెడ్‌కు భారీ నష్టం వాటిల్లుతోంది. ⇒ మార్క్‌ఫెడ్ మరింత దిగజారిపోయింది. అక్కడ పుష్కలంగా ఎరువులు ఉన్నా, వాటిని రైతులకు అందించ లేకపోతున్న విమర్శలున్నాయి. 60 శాతం మార్క్‌ఫెడ్ ద్వారా సహకార సంఘాలు, 40 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తారు. అయితే సహకార సంఘాలకు అడ్వాన్సుగా ఎరువులు ఇవ్వకపోవడంతో రైతులకు సకాలంలో అందడం లేదు. మరోవైపు ఎరువుల రవాణా టెండర్లను రెండుమూడుసార్లు రద్దు చేసి ఇప్పటికీ కొలిక్కి తీసుకురాలేదు. ⇒ ఆగ్రోస్ కార్పొరేషన్ వ్యవసాయ యంత్రాలను సరఫరా చేయడంలో కీలకంగా ఉండాలి. యంత్రాల ధరలను ఖరారు చేయాలి. కానీ వ్యవసాయ యాంత్రీకరణ పథకమే అమలుకాకపోవడంతో ఆ సంస్థ నిరీ్వర్యమై పోతున్నది. ⇒ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా గోదాములు నిర్వహించాలి. కానీ చాలాసార్లు ప్రైవేట్ గోదాములకు లబ్ధి చేకూర్చే విధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ కార్పొరేషన్ జిల్లా మేనేజర్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఉండటం విశేషం. రెగ్యులర్ పద్ధతిలో నియమించకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ⇒ కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు విలాసం కోసం ఆయా సంస్థల సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. తమ చాంబర్లు అంతా బాగానే ఉన్నా, తాము కోరుకున్నట్టు రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేసి తీర్చిదిద్దుకున్నారు. అవసరం లేకపోయినా ఫరి్నచర్ కొనుగోలు చేశారు. ఇక ఆయా సంస్థలకు ఇప్పటికే కార్లున్నా, కొత్త కార్లు కావాలని పేచీ పెడుతున్నారు. దీంతో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, ఎండీల మధ్య తీవ్రమైన అగాధం నెలకొంది. -
‘విద్యుత్’ సమ్మె ఉపసంహరణ
► ప్రభుత్వం, ట్రేడ్ యూనియన్ల మధ్య చర్చలు సఫలం ► దశలవారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ► మార్చి 31లోగా మార్గదర్శకాలు ► నేరుగా వేతనాలపై సీఎం దగ్గర మరోసారి సమావేశం ► ట్రేడ్ యూనియన్లు, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం సాక్షి, హైదరాబాద్: అపరిష్కృత డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగాలని ఇచ్చిన పిలుపును తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స ఫ్రంట్ (టీఈటీయూఎఫ్) ఉపసంహరించుకుంది. 13 కార్మిక సంఘాలు ఫ్రంట్‌గా ఏర్పడి సమ్మెకు పిలుపునివ్వగా, ఇందులోని 1104, 327, తెలుగునాడు కార్మిక సంఘాలు శనివారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డితో చర్చల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రాన్సకో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ఆదివారం మిగిలిన 9 సంఘాల నేతలతో చర్చలు జరిపి సమ్మె విరమణకు ఒప్పించారు. రిజర్వేషన్లు, స్థానికత నిబంధనల వల్ల క్రమబద్ధీకరణకు అర్హత సాధించని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఈ 9 కార్మిక సంఘాలు కోరగా, ఈ అంశంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్తామని ట్రాన్సకో సీఎండీ కార్మిక నేతలకు హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 10 లక్షల బీమా సాధ్యమైనంత త్వరగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని యాజమాన్యాలు తెలిపాయి. అదేవిధంగా జెన్కో విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రమాదాల్లో మృతి చెందితే 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు అంగీకరించాయి. జెన్కో ప్లాంట్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 12 శాతం ప్రత్యేక అలవెన్స చెల్లిస్తామన్నాయి. కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లుగా విధుల్లో చేరిన కాలం నుంచే జూనియర్ లైన్మెన్లకు నోషనల్ ఫిక్సేషన్ ఇస్తామని హామీ ఇచ్చాయి. 1999-2004 మధ్య కాలంలో నియమితులైన ఉద్యోగులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పన అంశాన్ని మళ్లీ ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపాయి. మార్చి 31లోగా ‘క్రమబద్ధీకరణ’ మార్గదర్శకాలు విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శ కాలను వచ్చే ఏడాది మార్చి 31లోగా జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇచ్చారుు. తెలంగాణ ట్రాన్సకో, జెన్కో, డిస్కంల ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలపై ఆదివారం ఆయా సంస్థల యాజమాన్యాలు, టీఈటీయూ ఎఫ్ నేతల మధ్య రాతపూర్వకంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో.. సీఎం కేసీఆర్ హామీ మేరకు దశల వారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని యాజ మాన్యాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన 8,800 సబ్ స్టేషన్ ఆపరేటర్ల పోస్టులు, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న మరో 5,816 కొత్త పోస్టులతో ఔట్ సోర్సింగ్ ఉద్యో గుల క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చాయి. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను 2017 మార్చి 31లోగా జారీ చేస్తామని తెలిపారుు.