breaking news
Out Look magazine representatives
-
‘5 స్టార్ రేటింగ్ కావాలి.. రేటు ఎక్కువైనా పర్లేదు’
హైదరాబాద్,బిజినెస్ బ్యూరో: సురక్షితమైన వాహనం అయితే చాలు. ఎక్కువ చెల్లించి కొనుగోలు చేయడానికి వినియోగదార్లు ఇష్టపడుతున్నారని మొబిలిటీ ఔట్లుక్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2.7 లక్షల మంది కార్లు, ద్విచక్ర వాహన యజమానులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ సర్వే వివరాలను వెల్లడిస్తూ.. ‘సెక్యూరిటీ ఫీచర్లను జోడించేందుకు రూ.30 వేలకుపైగా ఖర్చుకు సిద్ధంగా ఉన్నట్టు మూడింట ఒకవంతు మంది తెలిపారు. భవిష్యత్తులో తాము కొనుగోలు చేసే కారుకు 4 లేదా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండాలని భావిస్తున్నట్టు 75 శాతం మంది వెల్లడించారు. 27 శాతం మందికి భద్రతా రేటింగ్‌ల గురించి తెలియకపోవడం ఆందోళ కలిగించే అంశం. చాలా మందికి వాహన భద్రతా ఫీచర్ల గురించి పరిచయం ఉన్నందున.. భద్రతా ఫీచర్లను తప్పనిసరి చేయడం వల్ల ఈ విభాగంలో అవగాహనపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్స్, రోల్ ఓవర్ మిటిగేషన్ వంటి ఫీచర్ల గురించి వినియోగదార్లలో అవగాహన ఉంది. సేఫ్టీ రేటింగ్‌లతో సంబంధం లేకుండా పాత వాహనాల కంటే కొత్త వెహికిల్స్ సురక్షితమైనవని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు’ అని ఔట్లుక్ వివరించింది. -
ఔట్లుక్ ప్రతినిధులకు ఊరట
తీర్పు వెలువరించే వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేత హైదరాబాద్: తన ప్రతిష్టను దెబ్బతీసేలా కథనం ప్రచురించారంటూ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఔట్లుక్ పత్రిక ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తీర్పును వెలువరించే వరకు ఈ కేసులో పిటిషనర్ల అరెస్ట్‌తోపాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. స్మితా సబర్వాల్ ప్రతిష్టను దిగజార్చేలా కథనం, కార్టూన్ ప్రచురించారంటూ ఆమె భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఈ ఏడాది జూలై 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు ఔట్లుక్ పత్రిక ప్రతినిధులు మాధవి తాతా, సాహిల్ భాటియా, కృష్ణప్రసాద్, ఇంద్రనీల్రాయ్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ వీరు జూలై 13న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు బుధవారం విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.