breaking news
Other language
-
తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్న పర భాష డైరెక్టర్లు వీళ్లే..
ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు సినిమా కాదు. మరి ఏంటీ అంటే.. ‘పాన్ ఇండియా సినిమా’ అయిపోయింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల దర్శకుల చూపు కూడా మన హీరోలపై పడింది. తమిళం, కన్నడ, హిందీ భాషల దర్శకులు తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వణక్కమ్, నమస్కార, నమస్కార్ అంటూ మన హీరోలకు వాళ్ల భాషల్లో ‘నమస్కారం’ చెబుతున్నారు. ఇక ఆ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్ కావడం విశేషం. హిందీ దర్శకులు ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపగా దర్శకుడు ఓం రౌత్‌కి ముందుగా అవకాశం ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అలాగే హిందీ చిత్రం ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’తో పర భాషల్లో కూడా స్టార్‌డమ్‌ను పెంచుకున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సినిమా చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకముందే ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆసక్తి చూపారు. ఆల్రెడీ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా కన్ఫార్మ్ అయింది. దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ కథలోకి వెళ్తారు ఎన్టీఆర్. సేమ్ ఎన్టీఆర్లానే రామ్‌చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాక ముందే తమిళ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా కమిటయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్‌తో కూడా రామ్‌చరణ్ కథా చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఓ ప్రముఖ ముంబై నిర్మాణ సంస్థ రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటు నాగచైతన్య, రామ్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కోలీవుడ్‌లో ‘మానాడు’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తారు. ఇక ‘పందెంకోడి’తో హిట్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన లింగుసామి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా సినిమా చేస్తున్నారు. ‘ది వారియర్’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ హీరో. ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇంకా దర్శకుడు శ్రీ కార్తీక్‌తో హీరో శర్వానంద్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైఖేల్’ చేస్తున్నారు. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో.. మరికొన్ని కాంబినేషన్స్ సెట్ కావొచ్చు. కుదిరితే... వార్తల్లో ఉన్న ప్రకారం మరికొందరు తెలుగు హీరోలు కూడా వేరే భాషల దర్శక-నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆ చిత్రాలు కూడా పట్టాలెక్కుతాయి. నటుడు, దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌లు నటిస్తారని, హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు హరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘తగ్గేదే లే’ అంటూ.. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లోనూ సత్తా చాటిన అల్లు అర్జున్ ఇటీవల హిందీ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని కలిశారు. బాలీవుడ్లో బన్నీ చేయనున్న స్ట్రయిట్ సినిమా కోసమే ఈ మీటింగ్ అనే టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరోలు అఖిల్, విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారట. కీలక పాత్రల్లో... తెలుగు హీరోలను కీలక పాత్రలకు కూడా తీసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకులు. రణ్‌బీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో వెంకటేశ్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకుడు అని టాక్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. అలాగే అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘రామసేతు’లో సత్యదేవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు. -
హిందీ, 14 ప్రాంతీయ భాషల్లో ‘కోవిన్’
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్ పోర్టల్ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ యాప్ వచ్చే వారం నుంచి హిందీ, మరో 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుందని కేంద్రం తెలిపింది. దీంతోపాటు, దేశంలో తీవ్రంగా ఉన్న కోవిడ్–19 వేరియంట్లను త్వరితంగా గుర్తించేందుకు మరో 17 లేబొరేటరీ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్‌పై ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రుల 26వ సమావేశం ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ పలు కీలక అంశాలను వారికి వివరించారు. దేశంలోని కోవిడ్ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్సాకాగ్ (ఇండి యన్ సార్స్ కోవ్–2 జినోమిక్ కన్సార్టియా) నెట్‌వర్క్‌లో మరో 17 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిద్వారా మరిన్ని శాంపిళ్లను పరీక్షించేందుకు, మరింత విశ్లేషణ చేపట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి 10 ల్యాబ్‌లున్నాయన్నారు. పంజాబ్‌లో బి.1.1.7 వేరియంట్ దేశంలో సార్క్ కోవ్–2 మ్యుటేషన్లు, వేరియంట్లపై ఎన్సీడీసీ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె.సింగ్ వారికి వివరించారు. బి.1.1.7, బి.1.617 వంటి వేరియంట్ల తీవ్రత వివిధ రాష్ట్రాల వారీగా ఎలా ఉందో తెలిపారు. బి.1.1.7 వేరియంట్ పంజాబ్, ఛండీగఢ్‌ల నుంచి ఫిబ్రవరి మార్చి మధ్యలో సేకరించిన శాంపిల్స్‌లో ఎక్కువగా కనిపించిందన్నారు. రెమిడెసివిర్ ఉత్పత్తి మూడు రెట్లు కోవిడ్–19 చికిత్సలో ఎక్కువగా వాడుతున్న ఔషధాలు.. ముఖ్యంగా రెమిడెసివిర్, టోసిలిజు మాబ్, అంఫొటెరిసిన్–బి ఉత్పత్తి, కేటాయింపుల సమన్వయానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని ఫార్మా సెక్రటరీ ఎస్.అపర్ణ తెలిపారు. కోవిడ్ వైద్య సూచనల్లో పేర్కొనకపోయినా ఫవిపిరవిర్ ఔషధానికి కూడా డిమాండ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో రెమిడెసివిర్ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి, నెలకు 39 లక్షల వయల్స్ నుంచి 1.18 కోట్ల వయల్స్ వరకు తయారవుతోందని తెలిపారు. అదేవిధంగా, బ్లాక్ ఫంగస్(మ్యుకోర్మైకోసిస్) బారిన పడిన వారికి ఇచ్చే అంఫొటెరిసిన్–బి ఔషధం తయారీ కూడా పెరిగిందని చెప్పారు. మే1–14 తేదీల మధ్య రాష్ట్రాలకు ఒక లక్ష వయల్స్ అంఫొటెరిసిన్–బిను అందజేశామన్నారు. పరీక్షల సామర్థ్యం పెంపు గ్రామీణ ప్రాంతాల వారికి కోవిడ్ పరీక్షలను మరింత చేరువ చేసేందుకు ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్ వ్యాన్లు, ఆర్ఏటీ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తెస్తున్నామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) డీజీ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. వీటితో ఆర్టీ–పీసీఆర్, ఆర్ఏటీ పరీక్షల సామర్థ్యం రోజుకు 25 లక్షల నుంచి 45 లక్షలకు పెరుగుతుందని వివరించారు. హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను హిందీతోపాటు 14 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. (చదవండి: తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబీకుల హర్షం) -
ఇతర భాషా చిత్రాలను నిలువరించండి
తమిళసినిమా: తమిళ నిర్మాతల మండలి సమ్మెకు ఇతర భాషా చిత్రాలు గండికొడుతున్నాయా? ఎగ్జిబిటర్లు దిగిరాకపోవడానికి అవికారణం అవుతున్నాయా? ఇతర భాషా చిత్రాల విడుదల తమిళ నిర్మాతలను కలవరపెడుతున్నాయా? వాటిని నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికి కోలీవుడ్‌లో అవుననే బదులే వస్తోంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు నిర్మాతల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారంటూ వాటిని తగ్గించే విధంగా ఆ సంస్థల అధినేతలతో నిర్మాతలమండలి జపిన చర్చలు విఫలం కావడంతో మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపి వస్తూ నిర్ణయం తీసుకున్న నిర్మాతల మండలి అదే నెల 16 నుంచి షూటింగ్‌లతో పాటు సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మెకు థియేటర్ల యాజమాన్యం సహకరించలేదు సరికదా టికెట్ల విక్రయం కంప్యూటరైజ్ చేయాలన్న డిమాండ్, ఆన్లైన్ టికెట్ రుసుమును తగ్గించాలి లాంటి విషయాల్లో నిర్మాతల మండలికి, థియేటర్ల సంఘంకు మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మె కొనసాగుతోంది. అయితే తమిళ చిత్రాలు కొత్తవి విడుదల కాకపోయినా, హింది, ఇంగ్లిష్, తెలుగు, మలయాళం,కన్నడం వంటి ఇతర భాషా చిత్రాలు ముమ్మరంగా తమిళనాడులో విడుదలవుతున్నాయి. దీంతో చాలా వరకు థియేటర్లకు ఫీడింగ్ అయిపోతోంది. కొత్త తమిళ చిత్రాల విడుదల కాకపోయినా థియేటర్ల యాజమాన్యానికి ఆ కొరత పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి నిర్మాతల మండలి డిమాండ్లకు వారు దిగి రావడం లేదనే భావన కోలీవుడ్‌లో వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన తెలుగు చిత్రం రంగస్థలం ఒక తమిళ స్టార్ హీరో చిత్రానికి దీటుగా తమిళనాడులో అత్యధిక థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఇది తమిళ నిర్మాతలకు షాక్ కలిగించే పరిస్థితి. దీంతో ఇతర భాషా చిత్రాల విడుదలను అడ్డుకోవాలన్న ఒత్తిడి నిర్మాతలమండలి అధ్యక్షుడు విశాల్‌పై పెరుగుతోంది. దీంతో విశాల్ కూడా ఇతరభాషా నిర్మాతల సంఘాల ప్రతినిధులతో వారి చిత్రాలను తమిళనాడులో విడుదల చేయకుండా తమ సమ్మె మద్దతు పలకాల్సిందిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. -
ఎడ్.సెట్ (సాంఘిక) మోడల్ పేపర్
(నిన్నటి ‘విద్య’ తరువాయి) 103. అక్బర్ కాలంలో ఇతర భాషల్లోకి అనువ దించని సంస్కృత గ్రంథం ఏది? 1) మహాభాష్యం 2) హరివంశం 3) పంచతంత్రం 4) రాజతరంగిణి 104. {పపంచ కళారంగంలో ‘త్రిమూర్తులు’గా ప్రసిద్ధి చెందినవారు? 1) పెట్రార్క, డావిన్సీ, రాఫెల్ 2) డావిన్సీ, రాఫెల్, మైఖేలాంజిలో 3) ఇరాస్మస్, డావిన్సీ, పెట్రార్క 4) మైఖేలాంజిలో, డావిన్సీ, ఇరాస్మస్ 105. నిరంతరంగా వరదలు ముంచెత్తడం వల్ల ధ్వంసమైన సింధూలోయ నాగరికత నగరం? 1) లోథాల్ 2) కాలీబంగన్ 3) హరప్పా 4) మొహంజొదారో 106. అభిదమ్మపీటకాన్ని ఎక్కడ నిర్వహించిన బౌద్ధ సంగీతిలో రూపొందించారు? 1) రాజగృహం 2) వైశాలి 3) పాటలీపుత్రం 4) కుందలవనం 107. అశోకుడు వేయించిన శిలాశాసనాలు ఏ లిపిలో ఉన్నాయి? 1) పాళీ 2) బ్రాహ్మి 3) ప్రాకృత 4) సంస్కృతం 108. ‘కవిరాజు’ అనే బిరుదు ఎవరిది? 1) సముద్రగుప్తుడు 2) హర్షుడు 3) మొదటి చంద్రగుప్తుడు 4) హాలుడు 109. రాజ్యాన్ని ‘ఇక్తాలు’ (సైనిక రాష్ట్రాలు)గా విభజించిన ఢిల్లీ సుల్తాన్? 1) బాల్బన్ 2) ఇల్టుట్మిష్ 3) అల్లావుద్దీన్ ఖిల్జీ 4) మహ్మద్‌బిన్ తుగ్లక్ 110. ఢిల్లీలోని ‘పురానాఖిల్లా’ను నిర్మించిన వారు? 1) అక్బర్ 2) షాజహాన్ 3) షేర్షా 4) జహంగీర్ 111. ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్‌తో హైదరాబాద్ నిజాం సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకున్నాడు? 1) కారన్‌వాలీస్ 2) వెల్లస్లీ 3) డల్హౌసీ 4) కానింగ్ 112. ‘రామకృష్ణ మిషన్’ను ఎప్పుడు స్థాపించారు? 1) 1897 2) 1893 3) 1894 4) 1898 113. మహాత్మాగాంధీ రాజకీయ గురువు? 1) దాదాభాయ్ నౌరోజీ 2) రవీంద్రనాథ్ ఠాగూర్ 3) గోవిందరనడే 4) గోపాలకృష్ణ గోఖలే 114. హిందూస్థాన్ రిపబ్లికన్ సైన్యాన్ని రూపొం దించినవారెవరు? 1) సూర్యసేన్ 2) సుభాష్ చంద్రబోస్ 3) భగత్‌సింగ్ 4) ఆజాద్ చంద్రశేఖర్ 115. ‘శాసనోల్లంఘనోద్యమంగా’గా పేరు గాంచింది? 1) సహాయ నిరాకరణోద్యమం 2) హోంరూల్ ఉద్యమం 3) దండి ఉద్యమం 4) క్విట్ ఇండియా ఉద్యమం Civics (15 Marks) 116. ఆదర్శ రాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నవారెవరు? 1) అరిస్టాటిల్ 2) హెగెల్ 3) హబ్స్ 4) కారల్మార్క్స 117. ‘లౌకిక రాజ్యం’ అంటే? 1) రాజ్యంలో ఏ మతం ఉండదు 2) అన్ని మతాల కార్యకలాపాలను రాజ్యం నిర్దేశిస్తుంది 3) మతం అనేది వ్యక్తి స్వవిషయం కాదు 4) ఏదీకాదు 118. హక్కులు రాజ్యాంగం అంతరాత్మ అని పేర్కొన్న వారెవరు? 1) అంబేద్కర్ 2) నెహ్రూ 3) గాంధీ 4) ఆస్టిన్ 119. {పజాస్వామ్య విజయానికి అతి ఎక్కువగా తోడ్పడేది? 1) రాజకీయ చైతన్యం 2) విద్య 3) నైతిక విలువలు 4) అధికార వికేంద్రీకరణ 120. ‘పాలిటిక్స్’ గ్రంథాన్ని రచించినవారు? 1) డైసీ 2) జాన్ లాక్ 3) అరిస్టాటిల్ 4) థామస్ హబ్స్ 121. కింది వాటిలో దృఢ రాజ్యాంగానికి సంబంధించి ప్రయోజనం కానిది ఏది? 1) సమాఖ్య రాజ్యాలకు ఉపయోగం 2) రాజ్యాంగానికి స్థిరత్వం ఉంటుంది 3) {పభుత్వ పరిపాలనా సామర్థ్యం పెరుగుతుంది 4) న్యాయ సమీక్ష అధికారానికి ప్రభుత్వ చట్టాలు అధికంగా గురవుతాయి. 122. ఏ దేశంలో ఎగువసభ సభ్యులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోరు? 1) ఇండియా 2) అమెరికా 3) ఆస్ట్రేలియా 4) పైవన్నీ 123. హైకోర్టు న్యాయమూర్తుల గరిష్ట వయోపరిమితి ఎన్నేళ్లు? 1) 58 2) 60 3) 62 4) 65 124. భారత రాజ్యాంగ పరిషత్తు సలహా దారుడిగా సేవలందించినవారెవరు? 1) హెచ్.వి. ఆర్. అయ్యంగార్ 2) బి.ఎన్. రావు 3) ఎస్.ఎన్. ముఖర్జీ 4) అంబేద్కర్ 125. రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో స్థానిక ప్రభుత్వాలు అనే భావనను చేర్చారు? 1) 3 2) 4 3) 5 4) 6 126. రాష్ర్టపతి జారీచేసిన ఆర్టినెన్సలు ఎంత కాలం అమల్లో ఉంటాయి? 1) 6 వారాలు 2) 30 రోజులు 3) పార్లమెంట్ తిరిగి సమావేశమైన ఆరు వారాల వరకు 4) పార్లమెంట్ తిరిగి సమావేశమైన 30 రోజుల వరకు 127. రాజ్యాంగంలోని 326వ ప్రకరణ ఏం చెబుతోంది? 1) లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు వయోజన ఓటింగ్ హక్కు ప్రాతి పదికన ఎన్నికలు నిర్వహించాలి 2) 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించాలి 3) అన్ని చట్టసభలకు వయోజన ఓటింగ్ హక్కు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి 4) {పభుత్వ నిబంధనల మేరకు ఓటు హక్కు ఉండాల్సిన కనీస వయసు నిర్ణయించాలి 128. సమన్యాయ పాలనలో ఎవరికి ప్రాధాన్యం ఉంటుంది? 1) ప్రజలు 2) చట్టాలు 3) పాలకులు 4) న్యాయస్థానాలు 129. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లేని దేశం? 1) తైవాన్ 2) నౌరు 3) వాటికన్ సిటీ 4) పైవన్నీ 130. అలీనోద్యమ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1) 1950 2) 1954 3) 1958 4) 1961 ఉఛిౌౌఝజీఛిట (20 క్చటజుట) 131. ఒక నిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి, ఉపాధి కల్పనలున్న భారీ పరిశ్రమ, వ్యవసాయ రంగాలను ఏ రంగంలో ఉన్నవిగా చెప్పవచ్చు? 1) వ్యవస్థీకృత 2) అవ్యవస్థీకృత 3) మౌలిక 4) ప్రభుత్వ 132. లాభదాయకమైన ఉపాధి కల్గిన వ్యక్తులు తమ పూర్తి శక్తి మేరకు పనిచేయని స్థితిని ఏ రకమైన నిరుద్యోగంగా పిలుస్తారు? 1) స్వచ్ఛంద 2) అనిచ్ఛాపూర్వక 3) ప్రచ్ఛన్న 4) నిర్మాణాత్మక 133. ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల వల్ల ధరల స్థాయిలో ఏర్పడిన పెరుగుదలను ఏ రకమైన ద్రవ్యోల్బణం అంటారు? 1) డిమాండ్ పుల్ 2) కాస్ట్ పుష్ 3) బహిరంగ 4) అణచి ఉంచిన 134. గరీబి హఠావో అనే నినాదానికి ప్రాధాన్యం ఇచ్చిన పంచవర్ష ప్రణాళికను ఏ కాలంలో అమలు చేశారు? 1) 1961-66 2) 1963-68 3) 1969-74 4) 1965-70 135. వస్తువు ధరలో మార్పు ఫలితంగా దాని వినియోగంలో మార్పు రానట్లయితే, వస్తువు డిమాండ్ ఏవిధంగా ఉంటుంది? 1) సంపూర్ణ వ్యాకోచత్వం 2) సంపూర్ణ అవ్యాకోచత్వం 3) అసంపూర్ణ వ్యాకోచత్వం 4) అసంపూర్ణ అవ్యాకోచత్వం 136. {పభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయాల కంటే, మొత్తం వ్యయం అధికంగా ఉండే లోటు ఏది? 1) ప్రాథమిక 2) రెవెన్యూ 3) కోశ లోటు 4) బడ్జెట్ లోటు 137. ప్రాథమిక వ్యయాలు అంటే? 1) అవస్థాపన వ్యయాలు 2) ప్రత్యక్ష వ్యయాలు 3) స్థిర వ్యయాలు 4) ప్రత్యేక వ్యయాలు 138. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం ప్రకారం ఒక్కో ఉత్పత్తి కారకానికి చెల్లించే ధరకు ఆధారం ఏది? 1) ఉత్పత్తి కారకం మొత్తం ఉత్పాదకత 2) ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పాదకత 3) ఉత్పత్తి కారకం సగటు ఉత్పాదకత 4) ఉత్పత్తి కారకం సాపేక్ష ఉత్పాదకత 139. భౌతికమైన ఉత్పాదకాలకు, భౌతిక ఉత్పత్తికి మధ్య ఉండే ఫలభావ సంబంధాన్ని ఏమంటారు? 1) డిమాండ్ ఫలం 2) వినియోగ ఫలం 3) పెట్టుబడి ఫలం 4) ఉత్పత్తి ఫలం 140. ఒక నిర్దిష్ట సంవత్సరంలో, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల సృష్టించిన అంతిమ వస్తు సేవల విలువలను ఏమంటారు? 1) మార్కెట్ ధరల్లో నికర దేశీయోయోత్పత్తి 2) మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి 3) మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి 4) మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి 141. రెపో రేటు అంటే? 1) ఖఆఐ వసూలు చేసే దీర్ఘకాలిక వడ్డీ రేటు 2) ఖఆఐ వసూలు చేసే స్వల్పకాలిక వడ్డీరేటు 3) ఖఆఐ చెల్లించే దీర్ఘకాలిక వడ్డీరేటు 4) ఖఆఐ చెల్లించే స్వల్పకాలిక వడ్డీరేటు 142. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1) 2005 2) 2006 3) 2007 4) 2008 143. కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ చేసే సంస్థ? 1) ప్రణాళికా సంఘం 2) జాతీయాభివృద్ధి మండలి 3) ఆర్బీఐ 4) ఆర్థిక సంఘం 144. మానవుడి అపరిమితమైన కోరికల గురించి అర్థశాస్త్ర నిర్వచనంలో చెప్పినవారెవరు? 1) మార్షల్ 2) ఆడం స్మిత్ 3) రాబిన్స 4) శామ్యూల్సన్ 145. క్షీణోపాంత ప్రయోజన సూత్రం గురించి మొదట వివరించిన వారు? 1) గాసెన్ 2) బోల్డింగ్ 3) వెబ్లెన్ 4) రాబిన్సన్ 146. ఏ మార్కెట్లోనైనా వ్యయరేఖలు ఎప్పుడూ ఏ ఆకారంలో ఉంటాయి? 1) ఔ 2) 3) గ 4) ్ఖ 147. జాతీయాభివృద్ధి మండలి అధ్యక్షుడు? 1) రాష్ర్టపతి 2) ప్రధానమంత్రి 3) ఆర్థిక సంఘం చైర్మన్ 4) ఆర్థికశాఖ మంత్రి 148. కింది వాటిలో పరోక్ష పన్ను కానిది? 1) సేవాపన్ను 2) ఎక్సైజ్ పన్ను 3) కార్పొరేషన్ పన్ను 4) కస్టమ్స్ పన్ను 149. వాస్తవిక వేతనం అంటే? 1) యజమాని శ్రామికుడికి చెల్లించే ద్రవ్యవేతనం 2) {శామికుడు పొందిన వేతనానికి ఉండే కొనుగోలు శక్తి 3) {శామికుడి శ్రమకు యజమాని చెల్లించే నిజ వేతనం 4) యజమాని పొందిన వాస్తవ ఆదాయంలో శ్రామికుడి వాటా 150. ‘సప్లయ్ తన డిమాండ్‌ను తానే సృష్టించుకుంటుంది’ అనే భావనను ప్రతిపాదించింది? 1) సే మార్కెట్ సూత్రం 2) కీన్స ఆదాయ సూత్రం 3) వాకర్ డిమాండ్ సూత్రం 4) పిగూ సప్లయ్ సూత్రం సమాధానాలు 103) 1; 104) 2; 105) 4; 106) 3; 107) 2; 108) 1; 109) 2; 110) 3; 111) 2; 112) 1; 113) 4; 114) 1; 115) 3; 116) 2; 117) 4; 118) 2; 119) 4; 120) 3; 121) 4; 122) 1; 123) 3; 124) 2; 125) 2; 126) 3; 127) 1; 128) 2; 129) 4; 130) 4; 131) 1; 132) 3; 133) 2; 134) 3; 135) 2; 136) 4; 137) 1; 138) 2; 139) 4; 140) 3; 141) 2; 142) 1; 143) 4; 144) 3; 145) 1; 146) 4; 147) 2; 148) 3; 149) 2; 150) 1. (ఈ ప్రశ్న పత్రాన్ని రూపొందించిన వారు: జనరల్ ఇంగ్లిష్: కె. లలిత జీకే, టీచింగ్ ఆప్టిట్యూడ్, సోషల్: బొమ్మనబోయిన శ్రీనివాస్)