breaking news
Osmania university police
-
చంపడానికే ఓయూకు రప్పించాడు..
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థి అనూషను హత్య చేసిన ప్రేమోన్మాది వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను ప్రేమించడం లేదనే కారణంతో వెంకటేశ్ అనూషను మంగళవారం హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. ప్రేమోన్మాది వెంకటేశ్‌కు మరో అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ నెపంతోనే అనూష అతన్ని దూరం పెట్టినట్టుగా తెలుస్తోంది. 10 రోజుల నుంచి ఆనూష తనతో మాట్లాడటం మానేయడంతో వెంకటేశ్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమెను అంతమొందించాలని నిర్ణయానికి వచ్చాడు. స్నేహితురాలు ద్వారా అనూషను ఓయూకు రప్పించాడు. ఆ తర్వాత తనను ప్రేమించాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. లేదంటే బ్లేడుతో కోసి చంపుతానని ఆమెని బెదిరించడం మొదలుపెట్టాడు. అతడి బెదిరింపులకు భయపడిపోయిన అనూష భయంతో అతన్ని ప్రేమిస్తానని ఒప్పుకుంది. అయిన వినకుండా వెంకటేశ్ బ్లేడుతో ఆమె గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. ఈ కేసులో నిందితుడు వెంకటేశ్‌ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. కన్నీరు మున్నీరవుతున్న అనూష తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం స్నేహితురాలి ఇంటికి వెళ్తానని చెప్పిన అనూష అరగంటకే శవంగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు దారుణ హత్యకు గురికావడంతో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తమ కూతురిని హత్య చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని అనూష తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అశోక్‌బాబుకు ఓయూ పోలీసుల నోటీసు
హైదరాబాద్: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు ఓయూ పోలీసులు నోటీసు జారీ చేశారు. ఏపీఎన్జీవో ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నాయనగా ఇప్పుడు అర్ధాంతరంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా, ఎన్నికల ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చిన అశోక్ బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నర్సింహారెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అశోక్ బాబుకు నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 26న అశోక్ బాబు హాజరు కావలంటూ పోలీసులు అదేశించినట్టు సమాచారం.