సీఎం పాలనా తీరును నిరసిస్తూ ఏపీసీసీ దీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా తీరును నిరసిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద పీసీసీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. తొలుత లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాస వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డ సీఎం చంద్రబాబునాయుడు వెంటనే చేసిన తప్పును ఒప్పుకుని పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.