breaking news
OP Kohli
-
తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్‌గా విద్యాసాగర్
-
తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్‌గా విద్యాసాగర్ రావు
న్యూఢిల్లీ : తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్ రావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్‌గా విద్యాసాగర్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా 2011 ఆగస్టు 31న కొణిజేటి రోశయ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన సేవల్ని తమిళనాడుకు అందిస్తున్నారు. కేంద్రంలో అధికారం మారినా, ఆయనే గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ తన పదవీ కాలాన్ని లాగించారు. కాగా ఇవాళ్టితో రోశయ్య అయిదేళ్ల పదవీ కాలం ముగిసింది. అయితే కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమించాలన్న ప్రతిపాదనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం కర్ణాటకతో కావేరి వివాదం సాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తమిళులు గవర్నర్‌గా స్వీకరించేనా అన్న ప్రశ్న కేంద్రాన్ని వెంటాడుతూ వచ్చినట్టు ప్రచారం సాగింది. ఓ దశలో రోశయ్యనే మరలా గవర్నర్‌గా కొనసాగిస్తారనే ప్రచారం జరిగినా చివరకూ తమిళనాడు గవర్నర్‌గా సీహెచ్. విద్యాసాగర్‌రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లీ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా రాంనరేష్ యాదవ్ ఉన్నారు. అయితే ఆయన పదవీ కాలం సెప్టెంబర్ 7తో ముగియనుంది. -
గుజరాత్ నూతన గవర్నర్‌గా ఓపీ కోహ్లీ
గాంధీనగర్: గుజరాత్ నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ ఓపీ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాస్కర్ భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. కోహ్లీని గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారని అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరిష్ సిన్హా లేఖ చదివి వినిపించారు. 78 ఏళ్ల ఓపీ కోహ్లీ గుజరాత్ కు 24వ గవర్నర్ కావడం గమనార్హం. డాక్టర్ కమలా బెనీవాల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బెనీవాల్ (87) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్నప్పటికీ కేంద్రం ఆమెపై బదిలీ వేటు వేసింది. ఆమెను మిజోరం గవర్నర్‌గా నియమించింది.