breaking news
ongc plant
-
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
-
ఓఎన్జీసీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, ముంబై: నవీ ముంబైలోని ఉరాన్ ఓఎన్జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం ఐదుగురు మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. చుట్టుప్రక్కల ప్రాంతాలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. 50 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ‘స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పైప్ నుంచి మంటలు అంటుకున్నాయి. ఓఎన్జీసీ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ విభాగం వెంటనే స్పందించి అప్రమత్తమైంది. మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో ఆయిల్ ప్రాసెసింగ్‌పై ప్రభావం పడలేదు. గ్యాస్‌ను గుజరాత్‌లోని హజిరా ప్లాంట్‌కు తరలిస్తున్నాం. పరిస్థితిని అంచనా వేస్తున్నామ’ని ఓఎన్జీసీ ట్వీట్ చేశారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. -
దుండగులను అరెస్ట్ చేయొద్దంటూ టీడీపీ నేత ఒత్తిళ్లు
మచిలీపట్నం : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక ఒఎన్జీసీ ప్లాంటులో బుధవారం అర్థరాత్రి దుండగులు రూ. 30 లక్షల విలువైన ఇనుమును చోరీ చేశారు. ఆ విషయాన్ని ఓఎన్జీసీ భద్రత సిబ్బంది గమనించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై... ఇనుము తరలిస్తున్న దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా సదరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నేత వెంటనే రంగంలోకి దిగి.. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేయొద్దంటూ... పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అలాగే ఈ విషయం బయటకు రాకుండా చూడాలని ఓఎన్జీసీ అధికారులకు సదరు టీడీపీ నేత బెదిరించారని సమాచారం.