breaking news
Om namovenkateshaya
-
మబ్బుల్లో నడుస్తున్నట్టుంది : నాగార్జున
కింగ్ నాగార్జున ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓం నమోవేంకటేశాయ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడీ సాయి లాంటి భక్తిరస చిత్రాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహాబలేశ్వరం లోని కొండల్లో జరగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియో క్లిప్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన నాగార్జున 'మహాబలేశ్వరంలో మబ్బుల్లో నడుస్తున్నట్టు, ప్రపంచపు అంచున ఉన్నట్టుగా అనిపిస్తోంది' అంటూ కామెంట్ చేశాడు. శుక్రవారం కువైట్ నుంచి తిరిగి వచ్చిన నాగ్, వెంటనే ఓం నమోవేంకటేశాయ షూటింగ్ కోసం మహాబలేశ్వరం వెళ్లారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2017 ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.Walking in the clouds and feeling like top of the world in Mahabaleshwar!!#OmNamoVenkatesaya pic.twitter.com/FspkKXra3s— Nagarjuna Akkineni (@iamnagarjuna) 9 October 2016 -
నాగ్ కొత్త సినిమాలో ఏఎన్నార్ గెస్ట్ రోల్..?
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. చనిపోయి చాలా కాలం అవుతున్నా.. ఏఎన్నార్ సినిమాలో ఎలా నటిస్తారని ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏఎన్నార్‌ను మరోసారి వెండితెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని టీం. గ్రాఫిక్స్ సహాయంతో రూపొందించనున్న నాగేశ్వరరావు పాత్ర దాదాపు మూడు నిమిషాల పాటు కనిపించనుందట. ప్రస్తుతం కన్నడలో తెరకెక్కిన నాగభరణం సినిమాలో కూడా చనిపోయిన విష్ణువర్థన్ హీరోగా కనిపిస్తున్నారు. అదే తరహాలో ఓం నమోవేంకటేశాయలో ఏఎన్నార్ కనిపించనున్నారు. ఇప్పటి వరకు యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించకపోయినా అక్కినేని అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.