breaking news
olympic winner
-
ఆరు స్వర్ణాలు గెలిచిన బ్లేడ్ రన్నర్.. గర్ల్‌ఫ్రెండ్‌ను హత్యచేసి.. ఇలా..
ప్రిటోరియా: గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో గత తొమ్మిదేళ్లుగా జైల్లో ఉన్న మాజీ ఒలింపియన్, ప్రముఖ బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు పెరోల్ లభించింది. దక్షిణాఫ్రికాకు చెందిన పిస్టోరియస్ పారాలింపిక్స్‌లో ఆరు స్వర్ణపతకాలు గెలుచుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ప్రశంసలు పొందాడు. అయితే తన కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేసి జైలుపాలయ్యాడు. వలంటైన్స్డే రోజు ఆమెతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 14, 2013లో తన ప్రేయసి రీవా స్టీన్కాంప్ బాత్రూంలో ఉన్న సమయంలో బయటి నుంచి కాల్పులు జరిపాడు. తలుపును చీల్చుకు వెళ్లిన బుల్లెట్లు తాకి తీవ్రంగా గాయపడ్డ రీవా మరణించింది. అయితే, పిస్టోరియస్ మాత్రం.. లోపల ఉన్నది దొంగ అనుకుని పొరబడి షూట్ చేసినట్లు తెలిపాడు. కానీ.. అక్కడ లభించిన సాక్ష్యాల ఆధారంగా పిస్టోరియస్ దోషిగా తేలాడు. దీంతో 2014లో అతడు జైలుపాలయ్యాడు. ఈ కేసులో పిస్టోరియస్కు మొత్తం 13 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పడింది. ఈ క్రమంలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతడు జైలు నుంచి విడుదల కానున్నాడు. జనవరి 5న పిస్టోరియస్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. చదవండి: యువరాణి.. 225 ఎకరాల ఎస్టేట్.. 6 ఎకరాల్లో ప్యాలెస్.. భారత క్రికెటర్‌గా! జడేజాకు చుట్టమా? -
'నేను ఉత్ప్రేరకాలు వాడేదాన్ని'
ది హేగ్: ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత.. తాను నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు సంచలన ప్రకటన చేసింది. 1984 ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన డచ్ డిస్కస్ త్రో క్రీడాకారిణి రియా స్టాల్మన్ శుక్రవారం ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరీర్ చివర్లో ఉత్ప్రేరకాలు వాడేదాన్ని అని వెల్లడించింది. 'అప్పట్లో చాలా మంది మహిళలు ఉత్ప్రేరకాలు వాడేవారు. వారిని నేను చిత్తుగా ఓడించాలనుకునే దాన్ని అందుకోసం నేను కూడా శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ఉత్ప్రేరకాలు వాడేదాన్ని' అని తెలిపింది. ఉత్ప్రేరకాలు వాడినటువంటి ప్రత్యర్థులను ఓడించలేనప్పుడు మనమూ వారి దారిలోకి వెళ్లడమే సరైన మార్గం అని అప్పుడు భావించానని తెలిపింది. ప్రాక్టీస్‌లో భాగంగా ఎక్కువ శారీరక శ్రమ కలిగినప్పుడు సైతం త్వరగా కోలుకోవడానికి ఉత్ప్రేరకాలు వాడేదాన్ని అని 64 ఏళ్ల రియా స్టాల్మన్ వెల్లడించింది.