breaking news
Old Currency exchange
-
పాత నోట్లు, కాయిన్స్‌పై ఆర్బీఐ హెచ్చరిక...!
గత కొన్ని రోజుల నుంచి పాత కరెన్సీ నోట్లకు, పాత కాయిన్స్‌ను ఆన్లైన్లో సేల్కు పెట్టి భారీ నగదును పొందవచ్చుననే వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆన్లైన్ కొనుగోళ్లు, అమ్మకాలుకు సంబంధించి ఆర్బీఐ ప్రజలను హెచ్చరించింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పాత కరెన్సీ నోట్లు, కాయిన్స్‌కు సంబంధించి బుధవారం (ఆగస్టు 4) రోజున హెచ్చరికలను జారీ చేసింది. పాత కరెన్సీ నోట్లను, నాణేలను కమీషన్‌తో క్రయవిక్రయాలను అనధికారికంగా చేసే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పాత కరెన్సీ నోట్లను, నాణేలను క్రయవిక్రయాలను జరిపే సమయంలో కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు ఆర్బీఐ పేరు, లోగోలను వాడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ఇతర మార్గాల ద్వారా పాత నోట్ల చలామణీ చేస్తూ ప్రజల నుంచి కమీషన్లు, వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పాతనోట్లను , కాయిన్స్‌ను మార్చే సమయంలో ఏలాంటి ఛార్జీలు, కమిషన్లను ఆర్బీఐ స్వీకరించదని పేర్కొంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం రోజున ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. శుక్రవారం (ఆగస్టు 6) రోజున ఈ కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనుంది. -
దొరికిన వారంతా దళారులే!
- పరారీలోనే ఐదుగురు ప్రధాన సూత్రధారులు - పాతనోట్లన్నీ ‘రియల్’ వ్యాపారులవే - ‘మొఘల్స్ కోర్ట్’లో సమావేశం వెనుక హైడ్రామా - 60:40 నిష్పత్తిలో మారుస్తామంటూ ఒప్పందాలు సాక్షి, హైదరాబాద్: పాత నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తూ సోమవారం చిక్కిన వారంతా దళారులే అని తేలింది. వీరిని ఏర్పాటు చేసుకున్న ఐదుగురు సూత్రధారులు పరారీలో ఉన్నారని మధ్య మండల డీసీపీ డి.జోయల్‌డెవిస్ మంగళవారం వెల్లడించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ సొమ్మంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెందినదిగా భావిస్తున్నామని, కేసును లోతుగా దర్యాప్తు చేయడానికి సైఫాబాద్ ఇన్స్పెక్టర్ కె.పూర్ణచందర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందా న్ని(సిట్) ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాత నోట్లను ఆర్బీఐలో మార్చుకునే గడువు ఈ నెల 31తో ముగుస్తోంది. ఈ నేపథ్యం లోనే మెహిదీపట్నా నికి చెందిన శేఖర్‌బాబు, బ్యాంకు ఉద్యోగిగా అను మానిస్తున్న శ్రీనివాస్ అలి యాస్ శ్రీను, ఫజలుద్దీన్, మహ్మద్, రమేశ్‌బాబు మార్పిడికి కుట్ర పన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఫజలుద్దీన్‌కు బషీర్‌బాగ్‌లోని మొఘల్స్ కోర్ట్ అపార్ట్మెంట్లో కార్యాలయం ఉంది. దీని కేంద్రంగానే 60:40 నిష్పత్తిలో పాత నోట్లకు కొత్త నోట్లు ఇచ్చేలా అనేక మంది దళారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. రూ. 20 నోటు నంబర్లో కోడ్.. వీరి మాటలు నమ్మిన 10 మంది దళారులు తమకు పరిచయస్తులైన వారి నుంచి పాత నోట్లు తీసుకు న్నారు. ఒక్కో రియల్టర్ నుంచి గరిష్టంగా రూ.70 లక్షల నుంచి కనిష్టంగా రూ.5 లక్షల వరకు తీసుకువ చ్చారు. మార్పిడి చేయాల్సిన పాత నోట్లను ఓ గుట్టగా పోసి, దానిపై తాము ఇచ్చిన రూ.20 నోటు దాని నంబర్ కనిపించేలా ఫొటో తీసి వాట్సాప్‌లో పంపాలని, అందులో ఎంత మొత్తం అనేది స్పష్టం చేయాలని సూత్రధారులు వీరికి ఓ కోడ్ ఏర్పాటు చేశారు. కొత్త నోట్లు తీసుకోవడానికి వచ్చినప్పుడు కచ్చితంగా ఆ రూ.20 నోటు తీసుకురావాలని స్పష్టం చేశారు. తమకు ఆర్బీఐ అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయని, ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వాహనంలో కొత్త నోట్లు వస్తాయంటూ దళారులతో నమ్మబలికారు. దళారుల్ని పూర్తిగా నమ్మించడానికి సోమవారం రాత్రి ‘మొఘల్స్ కోర్ట్’లో సమావేశం ఏర్పాటు చేసి పాత నోట్లు తీసుకురమ్మని చెప్పారు. రియల్టర్‌ను ఆర్బీఐ అధికారిగా మార్చి.. పది మంది దళారులు సోమవారం రాత్రి 8.30 గంట లకు రూ.3,01,46,000 విలువైన పాత కరెన్సీ తీసుకు ని ఫజలుద్దీన్ కార్యాలయానికి వచ్చారు. హిమాయత్ నగర్‌కు చెందిన రియల్టర్ మహేందర్ప్రసాద్కు సఫారీ డ్రస్ వేసిన సూత్రధారాలు అతడిని ఆర్బీఐ అధికారిగా దళారులకు పరిచయం చేశారు. ముందు గా పాత నోట్లు ఆయనకు అప్పగించాలని, ఆపై ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వాహనాల్లో కొత్త నోట్లు పంపిస్తారంటూ చర్చలు చేపట్టారు. సమాచారం అందుకున్న సైఫాబాద్ ఏసీపీ జె.సురేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ కె.పూర్ణచందర్ ప్రత్యేక బృందాలతో దాడి చేసి పది మందిని అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు ఉన్న జాతీయ, అంతర్జాతీయ సంబంధాలు తెలియా లన్నా, ఇతర లింకులు బయటపడాలన్నా సూత్రధారులు చిక్కాల్సి ఉందని డీసీపీ జోయల్ డెవిస్ చెప్పారు. నిందితుల వద్ద పాత నోట్లతో పాటు కొత్త నోట్లూ దొరికాయన్న వాదనల్ని డీసీపీ ఖండించారు. అరెస్టు అయింది వీరే.. 1. మహేందర్ప్రసాద్, రియల్టర్, హిమాయత్‌నగర్ 2. యోగేష్‌కుమార్, వ్యాపారి, హిమాయత్‌నగర్ 3. అఫ్సర్ బేగ్, డ్రైవర్, మెహిదీపట్నం 4. మహ్మద్ షకీరుద్దీన్, వ్యాపారి, లంగర్‌హౌస్ 5. కేఎస్ పురుషోత్తం, సూపర్వైజర్, రిసాల్గడ్డ 6. కె.ఆనంద్, సెక్యూరిటీ కంపెనీలో ఆఫీస్‌బాయ్, యూసుఫ్‌గూడ 7. మహ్మద్ అబ్దుల్ నసీర్, వ్యాపారి, మలక్‌పేట 8. కె.శ్రీనివాస్, ఆటో డ్రైవర్, బోరబండ 9. టి.సాయికృష్ణ, వ్యాపారి, మియాపూర్ 10. గూడపాటి కోటేశ్వరమ్మ, వ్యాపారి, ఎర్రగడ్డ