breaking news
Oil storage tanks
-
మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు
టెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం నానాటికీ తీవ్రమవుతోంది. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ పోరాటం ఆదివారం తొమ్మిదో రోజుకు చేరింది. ఇరాక్ రాజధాని టెహ్రాన్‌తో పాటు అల్బోర్జ్లోని చమురు లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. నాలుగు చమురు నిల్వ కేంద్రాలతో పాటు ఉత్పత్తి, బదిలీ కేంద్రంపైనా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు ట్యాంకర్ డ్రైవర్లు మరణించారు. టెహ్రాన్ వీధుల్లో చమురు ఏరులై ప్రవహించింది. చమురుకు మంటలంటుకొని అగి్నధారలను తలపించాయి. యాజ్డ్, టెహ్రాన్, ఇస్పహాన్ నగరాలపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడింది.భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఇస్పహాన్‌లో వర్క్‌షాపులను, హార్స్‌రైడింగ్ క్లబ్‌ను బాంబులు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 11 మంది మృతిచెందారు. ఇస్పహాన్ ఎయిర్‌పోర్టులో ఇరాన్‌కు చెందిన ఎఫ్–14 విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునియలు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. టెహ్రాన్‌లో ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని పేర్కొంది.ఈ కార్యాలయాన్ని ఉగ్ర కార్యకలాపాలతో పాటు ఇజ్రాయెల్‌పై నిఘా కోసం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) వాడుకుంటోందని ఆరోపించింది. ఐఆర్జీసీ ఇంటర్నల్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్, 50 ఆయుధ బంకర్లు, గ్రౌండ్ ఫోర్స్ కాంపౌండ్‌ను నామరూపాల్లేకుండా చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు, మరొక బంగ్లావాసి మరణించినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. 12 మంది బంగ్లాదేశీలు గాయపడ్డట్టు వెల్లడించింది. అమెరికా రాడార్లు నేలమట్టం కువైట్‌పై ఇరాన్ భారీ దాడులకు పాల్పడింది. అల్–అదిరీ ఎయిర్‌బేస్‌పై మిస్సైల్, డ్రోన్‌ను ప్రయోగించింది. అమెరికా హెలికాప్టర్ మరమ్మతు కేంద్రాన్ని, ఇంధన ట్యాంకులను, కమాండ్ పోస్టు ధ్వంసం చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. యూఎస్ థాడ్ క్షిపణిరక్షణ వ్యవస్థకు సంబంధించిన నాలుగు రాడార్లను గత 24 గంటల్లో నేలమట్టం చేశామని వెల్లడించింది. ప్రెసిషన్–గైడెడ్ మిస్సైళ్లతో ఈ దాడికి దిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. బహ్రెయిన్‌లోని నీటి శుద్ధి కేంద్రంపైనా ఇరాన్ సైన్యం దాడికి దిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ యుద్ధంలో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. తొలుత అమెరికా–ఇజ్రాయెల్ సైన్యమే తమ డిశాలినేషన్ ప్లాంట్‌పై వైమానిక దాడులకు పాల్పడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు. ఎడారి ప్రాంతమైన గల్ఫ్‌లో తాగునీటికి డిశాలినేషన్ ప్లాంట్లే ప్రాణాధారం. స్వదేశానికి 32 వేల మంది అమెరికన్లు యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో∙నివసిస్తున్న అమెరికన్లు స్వదేశానికి పయనమవుతున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటికే 32,000 మందికిపైగా పౌరులు అమెరికాకు చేరుకున్నారు. వారిలో చాలామంది సొంత ఖర్చుతోనే వచ్చారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మిగతావారి కోసం ప్రత్యేకంగా విమానాలు సమకూర్చినట్లు పేర్కొంది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. మంటల్లో కువైట్ విమానాశ్రయం, ప్రభుత్వ భవనాలుఇరాన్ సైన్యం కువైట్ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో బహుళ అంతస్థుల భవనం మంటల్లో చిక్కుకుంది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. నగరమంతా సైరన్ల మోత వినిపించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నేలకూలి్చంది. కానీ, ఆకాశం నుంచి వేగంగా దూసుకొచి్చన శకలాల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.ఇరాన్ దాడుల్లో ఇద్దరు కువైట్ బోర్డర్ సెక్యూరిటీ జవాన్లు మృతిచెందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)పైనా ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ సైన్యం 16 బాలిస్టిక్ క్షిపణులు, 117 డ్రోన్లు ప్రయోగించినట్లు యూఏఈ పేర్కొంది. తోటి ఇస్లామిక్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సరికొత్త హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై దాడులకు ఆయా దేశాల భూభాగాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తే ధీటుగా బదులిస్తామని, తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని స్పష్టంచేశారు. -
క్రిమియా చమురు నిల్వకేంద్రంపై దాడులు
కీవ్: తొమ్మిదేళ్ల క్రితం రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ద్వీపకల్ప ప్రాంతం క్రిమియాపై శనివారం ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దీంతో క్రిమియాలోని తీరప్రాంత నగరం సెవస్తపోల్‌లోని చమురు నిల్వ కేంద్రానికి నిప్పు అంటుకుని అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ‘ఈ దాడి ఉక్రెయిన్ డ్రోన్ల పనే. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రస్తుతానికి ఒక్కచోట మాత్రమే మంటలు ఆర్పగలిగాం’ అని నగర గవర్నర్ మిఖాయిల్ రజవోజయేవ్ చెప్పారు. మరణాల వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రతిదాడి చేసి క్రిమియాను మళ్లీ ప్రధాన భూభాగంలో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తామని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం, శుక్రవారమే 20 క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసి రష్యా 23 మంది పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయిల్ డిపోలో 10 ట్యాంకుల్లో అగ్గిరాజుకోవడం దేవుడు వేసిన శిక్ష అంటూ ఉక్రెయిన్ సైనిక నిఘా అధికార ప్రతినిధి ఆండ్రీ యుసోవ్ వ్యాఖ్యానించారు. కాగా, రష్యా అక్రమంగా విలీనం చేసుకున్న ఖేర్సన్ ప్రావిన్స్‌లోని నోవా కఖోవ్కా సిటీపైకి ఉక్రెయిన్ సేనలు భారీ స్థాయిలో కాల్పుల మోత మోగించాయి. -
భూగర్భ భయం
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే తొలి భూగర్భ చమురు నిల్వ కేంద్రం నిర్మాణం భద్రతా ప్రమాణాల దృష్ట్యా కలవరం కలిగిస్తోంది. అందుకే దీని నిర్మాణం మరింత కాలం సాగేట్టు కనిపిస్తోంది. విశాఖపట్నంలోని డాల్ఫిన్ కొండ గర్భంలో దీనిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 13 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రతిష్టాత్మక స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చమురు నిల్వ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేట్టు కనిపించడం లేదు. 2011 నాటికే దీన్ని సిద్ధం చేయాలని నిర్ణయించినా, ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. సొరంగాల్లో చమురు స్టోరేజీ ట్యాంకులు పూర్తయినా భద్రతాపరమైన సందేహాలు వేధిస్తూ ఉండడంతో నిపుణులకు ఈ ప్రాజెక్టు పూర్తిచేయడం కత్తి మీద సాముగా మారుతోంది. పరీక్షల దశ (ట్రైల్ రన్)కు చేరుకున్నా ఇటీవల గ్యాస్,చమురు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో, ఇతర భద్రతాపరమైన అనుమానాలతో భద్రతా ప్రమాణాలు మళ్లీ పెంచాలని నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు వచ్చే ఏడాదికి మళ్లీ వాయిదాపడింది. ఎన్ని కష్టాలో... చమురు దిగుమతి విషయంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని దేశీయ అవసరాలకు సరిపడేట్టు దండిగా క్రూడ్ నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం 2008లో భూగర్భ చమురు నిల్వ కేంద్రాల నిర్మాణానికి పూనుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పుడు భారీగా చమురు కొనుగోలు చేసి దాచాలనేదే ఈ ప్రణాళిక ఉద్దేశం. ఇందులో భాగంగా మంగుళూరు (15 లక్షల టన్నులు), పాడూరు (25 లక్షల టన్నులు), విశాఖపట్నం (13 లక్షల టన్నులు) చమురు నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని 2008లో కేంద్రం నిర్ణయించింది. విశాఖలో చమురు నిల్వకు సురక్షిత ప్రాంతంగా డాల్ఫిన్ కొండను గుర్తించి దీనిని 2011 నాటికి వినియోగంలోకి తేవాలని నిర్ణయించింది. రూ. 1037 కోట్ల వ్యయంతో హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ 2009లో ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. కొండ అడుగుభాగాన ఆరుకిలోమీటర్ల పరిధి లో అయిదు గుహలు నిర్మించడానికి పనులు ప్రారంభించారు. గతేడాది ఇవి పూర్తయ్యాయి. వీటికి లోపలనుంచి ప్రత్యేక రక్షణ కవచాలు నిర్మించారు. వీటిలోనే చమురును నిల్వ చేసేలా ట్యాంకులు తయారుచేశారు. అయిదు ట్యాంకుల చుట్టూ 75 మీటర్ల లోతులో ప్రత్యేక బోర్లు తవ్వి చమురు నిల్వ కేంద్రాలకు కలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి వచ్చే నౌకలు నేరుగా ఈ ట్యాంకులకు ముడి చమురును పంప్ చేసేట్టు ట్యాంకులు నిర్మించారు. 68 ఎకరాల్లో మూడునెలల కిందట ఫిల్లింగ్ స్టేషన్ పనులు పూర్తిచేశారు. ట్యాంకులను ఈఏడాది జూన్ లేదా జూలైలో ప్రారంభించాలని భావించారు. కాని భద్రత ప్రమాణాలపై నిపుణులు పునరాలోచనలో పడడంతో ప్రాజెక్టు వెనక్కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన గ్యాస్, చమురు ప్రమాదాల నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్టు తెలియవచ్చింది. ఒకవేళ సొరంగాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే నివారించే ఆధునిక సాంకేతిక వ్యవస్థను పునఃసమీక్షించి ప్రమాణాలు రెట్టింపు చేయాలని నిపుణులు భావించిన ట్టు విదితమవుతోంది. దీంతో ప్రాజెక్టు ప్రారంభం మళ్లీ వాయిదా పడినట్లయింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.


