breaking news
oil gas
-
ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆయిల్, గ్యాస్ బ్లాకుల వేలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పాలు పంచుకున్నాయి. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ–8) ఎనిమిదో దశ వేలంలో భాగంగా కేంద్ర సర్కారు 28 బ్లాకులను వేలానికి పెట్టింది. ఇవి 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి.ప్రైవేటు రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ సంస్థలు మొదటిసారి ఓఎన్జీసీతో కలసి గుజరాత్ తీరంలోని ఓ బ్లాక్‌కు బిడ్ వేశాయి. ఓఎన్జీసీతోపాటు మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ జేవీ, సన్ పెట్రోకెమికల్స్ ఇందులో పాల్గొన్నాయి. ఎనిమిదో విడత ఓఏఎల్‌పీలో 28 బ్లాక్‌లకు బిడ్ల దాఖలు గడువు సెప్టెంబర్ 21తో ముగిసింది. దీంతో ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) విడుదల చేసింది.ఓఎన్జీసీ తాను సొంతంగా 14 బ్లాకులకు బిడ్లు దాఖలు చేసింది. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో కలసి మరో నాలుగు బ్లాక్‌లకు బిడ్లు వేసింది. రిలయన్స్–బీపీతో కలసి వేసిన మరో బిడ్ కూడా కలిపి చూస్తే మొత్తం 19 బ్లాక్‌లకు ఓఎన్జీసీ పోటీ పడుతోంది. ఇక అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ మొత్తం 28 బ్లాకులకు సొంతంగా బిడ్లు సమర్పించింది. సన్ పెట్రోకెమికల్స్ ఏడు బ్లాకులకు బిడ్లు వేసింది. మొత్తం మీద నాలుగు బ్లాక్‌లకు మూడేసి చొప్పున బిడ్లు రాగా, మిగిలిన వాటికి రెండేసి చొప్పున దాఖలయ్యాయి. -
'అవసరం ఉంది కాబట్టే సెక్షన్-8 ఉండాలన్నాం'
విశాఖ: ఓటుకు కోట్లు కేసులో కీలకమైన ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సెక్షన్ 8 అవసరాన్ని నొక్కి చెబుతూ వ్యాఖ్యానించారు. అవసరం ఉంది కాబట్టే సెక్షన్ 8 అమలును కోరుతున్నా మని, హైదరాబాద్‌లో సెక్షన్ 8 ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు. విశాఖలో చమురు, గ్యాస్ పైప్ లైన్ల భద్రతపై సమీక్ష నిర్వహించిన ఏపీ డీజీపీ రాముడు సెక్యూరిటీ ఏజెన్సీలు, చమురు కంపెనీల సీఈవోలకు డీజీపీ రాముడు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉగ్రవాదుల నుంచి చమురు సంస్థలకు ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ, ప్రజలతో భాగస్వాములు కావాలని కంపెనీలకు పిలుపునిచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని ఏపీ డీజీపి రాముడు కోరారు.