breaking news
offensive tweets
-
సినీ గాయకుడికి ట్విట్టర్ షాక్!
-
సినీ గాయకుడికి ట్విట్టర్ షాక్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్యకు ట్విట్టర్ మంగళవారం షాక్ ఇచ్చింది. మహిళల పట్ల అభ్యంతరకరమైన ట్వీట్లు చేయడంతో ఆయన ట్విట్టర్ ఖాతాను రద్దు చేసింది. అనుచితమైన, అవమానకరమైన భాషను వాడుతున్నందుకే ఆయన ఖాతాను రద్దు చేశామని ఆయన పేజీలో ట్విట్టర్ పేర్కొంది. మహిళా జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదిని ఉద్దేశించి రెచ్చగొట్టే, విద్వేషపూరిత ట్వీట్లు చేయడంతో గత ఏడాది అభిజీత్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన ఇటీవల జేఎన్‌యూ విద్యార్థిని, హక్కుల కార్యకర్త షెహ్లా రషీద్ పట్ల పలు అభ్యంతరకరమైన ట్వీట్లు చేశాడు. ‘ఆమె రెండుగంటల కోసం డబ్బులు తీసుకొని.. క్లయింట్‌కు సంతృప్తినివ్వలేదన్న రూమర్ ఉంది’ అంటూ వెకిలి కామెంట్లు చేశాడు. పలువురు ఇతర మహిళా నెటిజన్లపైనా ఆయన ఇదేవిధంగా నీచమైన కామెంట్లు చేశాడు. దీనిపై నెటిజన్లు ఫిర్యాదు చేయడంతో ఆయన పేజీని ట్విట్టర్ రద్దు చేసింది.