breaking news
Odisha announces
-
మహిళా ఉద్యోగులకు శుభవార్త.. నెలసరి సెలవులపై కీలక ప్రకటన!
దేశంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులకు ఒకరోజు నెలసరి సెలవు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కటక్‌లో జరిగిన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.మహిళల ఆరోగ్యం, శ్రేయస్సే లక్ష్యంగా నెలసరి సెలవుల్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రవితా పరిదా తెలిపారు. ఈ విధానంలో మహిళా ఉద్యోగులు వారి నెలసరి సమయంలో మొదటి లేదా రెండవ రోజు సెలవు తీసుకోవచ్చని అన్నారు. Menstrual LeaveDeputy CM @PravatiPOdisha announces 1-day menstrual leave for working women in both Government & Private sectors pic.twitter.com/D2L91YXtqr— Soumyajit Pattnaik (@soumyajitt) August 15, 2024 ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. అంతేకాదు, నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని గత నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది. -
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
భువనేశ్వర్ : ఒడిషా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే డియర్ ఎలవెన్స్ (డీఏ) ను భారీగా పెంచింది. ఆరు శాతం డీఎ ను పెంచుతున్నట్లు ప్రకటించింది . ప్రస్తుతం ఉన్న డీఎను 119 నుంచి 125 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. ఈ ఏడాది జనవరినుంచి దీన్ని అమలు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రదీప్ అమత్ తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమోదం తెలిపారన్నారు. ఈ తాజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వంపై సుమారు 668 కోట్ల రూపాయల భారం పడనున్న్టట్టు వెల్లడించారు. తమ నిర్ణయం మూలంగా లక్షలాది మంది నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, మూడు లక్షలమంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు. నాలుగు నెలల బకాయిలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాపై 789.72 కోట్ల రూపాయల భారం పడనుందని ఆయన తెలిపారు .