breaking news
obstacle
-
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు తొలగిన అడ్డంకి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. జీవో 29పై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ జాబితా టీజీపీఎస్సీ విడుదల చేసింది. త్వరలో టీజీపీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనుంది. కాగా, దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రభుత్వం జీఓ 29ను జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది. -
పుష్కర స్నానానికి వర్షం అడ్డంకి
ఏటూరునాగారం : గోదావరి అంత్యపుష్కరాల్లో బుధవారం భక్తుల స్నానాలకు వర్షం అడ్డంకిగా మారింది. తెల్లవారుజాము నుంచి జోరుగా వర్షం కురవడంతో రామన్నగూడెం ఘాట్ వద్దకు రావడానికి ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు కొందరు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. మహిళలు తమ మొక్కులను ఘాట్ వద్దనే సమర్పించుకున్నారు. ఘాట్పై ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో గ్రామస్తులు నీటితో శుభ్రం చేశారు. భక్తులు పితృదేవతలకు పిండప్రదానాలు చేసి గోదావరిలో కలిపారు. -
గ్రేటర్ ఎన్నికల ప్రక్రియకు సెలవుల అడ్డంకి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సంక్రాంతి సెలవు దినాలు తెలంగాణ ప్రభుత్వానికి పరీక్షగా మారాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి పండుగ.. వరుసగా ఈ రెండ్రోజులు ప్రభుత్వ సెలవు దినాలు. ఇదే వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు వెలువడితే.. ఈ రెండు సెలవులు కీలకమైన నామినేషన్ల ఘట్టంలోఅడ్డంకిగా మారే అవకాశముంది. అందుకే సెలవు దినాల విషయంలో ప్రభుత్వం తల పట్టుకుంటోంది. నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ గడువును మూడు వారాల నుంచి రెండు వారాలకు కుదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు వీలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించింది. కానీ ఎన్నికల షెడ్యూలులో కీలకమైన నామినేషన్ల దాఖలు, నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు నిర్దేశించిన తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలుంటే.. మరుసటి వర్కింగ్ డే రోజున వాటిని అనుమతించాలని ఇదే చట్టంలో సెక్షన్ 40 స్పష్టం చేస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియకు నిర్దేశించిన గడువులో మూడు, నాలుగు రోజులు సెలవు దినాలు వస్తే.. ఈ వ్యవధిని కుదించిన ప్రయోజనం నెరవేరకుండా పోతుంది. అందుకే ఈ సెలవుల గందరగోళానికి తెర దింపేందుకు మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. అడ్డంకిగా ఉన్న ఈ సెక్షన్ను సైతం మారుస్తూ చట్టాన్ని సవరించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. దీని ప్రకారం నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ గడువులో ఉన్న సెలవు దినాలున్నా.. వాటిని సైతం ఎన్నికల ప్రక్రియలో భాగంగా వర్కింగ్ డేలుగానే పరిగణిస్తారు.