breaking news
nustulapoor
-
కరువులో పాడిపరిశ్రమనే లాభసాటి
2లక్షల లీటర్ల సేకరణే లక్ష్యం కరీంనగర్ డెయిరీ అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు తిమ్మాపూర్: కరువు నెలకొన్న నేపథ్యంలో రైతులు పాడిపరిశ్రమపై దృష్టిసారిస్తే లాభసాటిగా ఉంటుందని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్, కరీంనగర్ డెయిరీ అధ్యక్షుడు సీహెచ్.రాజేశ్వర్‌రావు అన్నారు. మండలంలోని నుస్తులాపూర్ బల్క్ కూలింగ్ యూనిట్ పరిధిలోని గ్రామాల్లో పాడి రైతులకు ఆమ్ఆద్మీ భీమా యోజన(ఏఏబీవై), పిల్లలకు స్కాలర్షిప్లు చెక్కులను ఆదివారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది 1.93లక్షల లీటర్ల పాలు సేకరించగా.. ఈ సారి 2లక్షలకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. కరీంనగర్ డెయిరీలోనే 4లక్షల లీటర్లను స్టోరేజీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు తెలిపారు. పాల సేకరణకు తగినట్లుగా మార్కెంటింగ్‌ను పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. మరో రెండేళ్లలో సంస్థను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక పాలసేకరణ, విక్రయించే సంస్థగా కరీంనగర్ డెయిరీని నిలిపేందుకు నాణ్యమైన పాలను పోస్తూ రైతులు సహకారం అందించాలని కోరారు. రైతులు కుటుంబాల్లోని విద్యార్థులు సైతం క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రతిభను చూపుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. డెయిరీ అడ్వయిజర్ హన్మంతరెడ్డి, మేనేజర్లు అంజారెడ్డి, లింగారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, నుస్తులాపూర్ డెయిరీ అధ్యక్షుడు వంగల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
పొంగులేటికి ఘన స్వాగతం
కరీంనగర్: అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తిమ్మాపూర్ మండలం నుస్తులా పూర్ వద్ద ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు నాయకులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన నుస్తులాపూర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అలుగునూరులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అలుగునూరు నుంచి కరీంనగర్ కళా భారతి వరకు భారీ ర్యాలీ తీశారు.