breaking news
NRI woman death
-
అమెరికాలో నరకం చూపించాడు
నేరేడ్మెట్: మూడుముళ్ల బంధంతో ఎన్నో కలలతో జీవించడానికి ఖండాంతారాలు దాటి వెళ్లిన ఆమెకు భర్త నరకాన్ని చూపించాడు. దేశంకాని దేశంలో అండగా ఉండాల్సిన భర్త పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవాలని వేధింపులకు దిగాడు. భర్త వేధింపులతో విసుగు చెందిన ఆమె అమెరికా నుంచి భారత్కు వచ్చేసింది. వచ్చిన రోజుల వ్యవధిలోనే పుట్టింట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈసంఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. నేరేడ్మెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని కాకతీయనగర్కు చెందిన గంగాదేవి, మల్దారి దంపతుల కూతురు మాధురి(27)తో 2016 నవంబర్లో ఇదే ప్రాంతానికి చెందిన కోటేశ్వర్రావుతో వివాహం జరిపించారు. పెళ్లి తరువాత భార్యాభర్తలిద్దరూ అమెరికాకు వెళ్లారు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడికి వెళ్లిన తరువాత వీకెండ్ పార్టీల్లో పాల్గొనాలని, మద్యం తాగాలని, పేకాట ఆడటం, స్నేహితులను ఇంటికి పిలిచి..వారితో డాన్స్ చేయాలని భార్యను వేధింపులకు గురి చేశాడు. భర్త చేష్టలతో విసుగి చెందిన భార్య ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ విషయమై తల్లిదండ్రులు పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఈనెల 11న మాధురి భారత్కు వచ్చి కాకతీయనగర్లోని పుట్టింట్లో ఉంటుంది. తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు, మృతదేహాన్ని శవపంచనామ కోసం ఆసుపత్రికి తరలించామని సీఐ తెలిపారు. -
అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్నారై మహిళ మృతి
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని శెట్టిపల్లి సుష్మ అనే ఎన్నారై మహిళ (32), ఆమె రెండేళ్ల కుమారుడు మహీధర్ అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్త తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టాడుతున్నాడు. శెట్టిపల్లి రత్నాకర్ కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు కలిసి షికాగో, సెయింట్ లూయిస్ మీదుగా ప్లానోకు వెళ్తున్నప్పుడు ఎదురుగా రాంగ్ రూటులో వచ్చిన మరో వాహనం వీళ్ల వ్యానును ఢీకొంది. వ్యానులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి శెట్టిపల్లి సుష్మ వ్యాను నడుపుతున్నట్లు తెలిసింది. వ్యానులో ఉన్న మిగిలిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లకు పలు చోట్ల ఫ్రాక్చర్లు అయినట్లు తెలుస్తోంది. సెయింట్ లూయిస్లోని మెర్సి హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. కాగా, ఎదురుగా రాంగ్ రూటులో వచ్చిన వాహనం డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు.