భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు...
సేఫ్టీ
రోడ్డు యాక్సిడెంట్లు పురుషులకు సంబంధించి ‘నాన్- డిసీజ్ కిల్లర్స్’ గా మారుతున్నాయి. గత సంవత్సరం మన దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 1.17 లక్షలమంది పురుషులు చనిపోయారు.
రోడ్లు పురుషుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కలు చెబుతున్నాయి. రోడ్డు యాక్సిడెంట్లు పురుషులకు సంబంధించి ‘నాన్-డిసీజ్ కిల్లర్స్’గా మారుతున్నాయి. గత సంవత్సరం మన దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 1.17 లక్షల పురుషులు చనిపోయారు.
‘‘మనసు రోడ్డు మీద కేంద్రీకరించకుండా ఎటో ఆలోచిస్తుంటారు చాలామంది. ప్రమాదం జరిగాక కానీ ఈ లోకంలోకి రారు. కొందరు ఈ లోకంలోకి రాకుండానే పైలోకానికి పోతారు. సెల్ఫోన్లు వచ్చిన తరువాత సేఫ్టీ డ్రైవింగ్‌కు తిలోదకాలు ఇస్తున్నారు. ఏ కొద్దిమందో మినహా...చాలా మంది పురుషులు సెల్ఫోన్లో మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తారు. కొందరేమో హెల్మెట్ పెట్టుకోవడాన్ని నామోషీ అనుకుంటారు. అపరిమితమైన వేగంతో బైక్ నడపడాన్ని వీరత్వం అనుకుంటారు. రోడ్డు ప్రమాదాలకు ఇలా చాలా కారణాలు ఉన్నాయి’’ అంటున్నారు ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్’కు చెందిన ప్రొఫెసర్ పి.అరోకియసామి.