breaking news
Nomadic life
-
మెతుకు కష్టమైంది.. బతుకు భారమైంది
ఈ ఫొటోలోని వారు 11 కుటుంబాలకు చెందిన వారు. వీరికి ప్రభుత్వం 12 కిలోల చొప్పున బియ్యం అందజేసింది. అయితే ఆర్థిక సాయం ఇంకా అందలేదు. ఒక్కో కుటుంబం వద్ద కనీసం రెండు రోజులకు కూడా సరిపడా సరుకులు లేవు. అవసరమైన ఆహార పదార్థాలు లేకపోవడంతో 11 కుటుంబాలకు చెందిన సుమారు 45 మంది ఇలా ఒకే చోట వంట చేసుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని అందరూ పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ జీవనాధారమైన పెంపుడు జంతువులకు తిండి పెట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. సాక్షి, జగిత్యాల: లాక్డౌన్ నేపథ్యంలో బుక్కెడు బువ్వ కోసం వలసజీవుల ఆకలి పోరాటం తప్పడం లేదు. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక యాచకులు, సంచారజాతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఊరూరా తిరిగి ఇంటింటికీ వెళ్లి తిండిగింజల కోసం వీరు చేసే పోరాటం లాక్డౌన్ నేపథ్యంలో ఆగిపోయింది. నెలరోజులుగా వీరంతా అర్ధాకలితో అలమటిస్తున్నారు. తిండి కోసం తిప్పలు లాక్డౌన్లో సంజారజాతులు, యాచకుల బతుకులు భారంగా మారాయి. సరిపడా తిండిగింజలు లేక నిత్యం ఆకలితో పోరాడుతున్నారు. కుటుంబం మొత్తానికి కావల్సిన బియ్యం ఇతర వంటసామగ్రి కోసం వారంతా సతమతమవుతున్నారు. ఈ ఫొటోలోని వారు కొడిమ్యాల మండలం నర్సింహునిపల్లెకు చెందిన రాయమల్లు, సమ్మవ్వ తమ పిల్లలతో కలసి గొల్లపెల్లి మండలం చిల్వాకో డూరు శివారులోని గుడారాల్లో ఉంటున్నారు. గంగిరెద్దులు ఆడించి జీవనం గడిపే ఈ కుటుంబానికి లాక్డౌన్ నేపథ్యంలో నెల రోజులుగా గడ్డు పరిస్థితి నెలకొంది. నెలరోజుల కిందట అ ధికారులు పంపిణీ చేసిన బియ్యం అయిపోవడంతో మిగతా 10 కుటుంబాలతో కలసి ఒకే చోట వండుకుంటున్నారు. రోజూ ఒకే పూట తింటున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఊల్లోకి రానిస్తలేరు నేను ఊరూరా తిరుగుతూ అద్దాలు, దువ్వెనలు అమ్ముకుంట. ఏ రోజుకారోజు తిండికి సరిపోయేది. నెలరోజుల నుంచి ఊళ్లోకి ఎవరూ రానిస్తలేరు. బియ్యం అయిపోయినయి. ఒక్క పూటనే తింటున్నం.– రాజమ్మ -
టూకీగా ప్రపంచ చరిత్ర 75
ఏలుబడి కూకట్లు వృత్తులవారీగా పౌరజీవితం విడిపోయి, ఏ వర్గానికావర్గం కూటమిగా ఏర్పడింది. వృత్తిపరమైన నైపుణ్యాలు ఆయా కుటుంబాలనూ, కూటములనూ దాటిపోకుండా వృత్తిరహస్యాలయ్యాయి. పరిశ్రమ ఏదైనా, నిర్వహణలో కుటుంబానికంతా భాగస్వామ్యం ఉండడం వల్ల, ఇంటికి కొత్తగా వచ్చే కోడలు కూడా ఆ వృత్తికి అలవాటుపడినదై ఉండవలసిన అవసరం వల్ల, చివరకు పెళ్లి సంబంధాలు సైతం వృత్తుల పరిధిలోకి కుదించుకున్నాయి. మారిన సామాజిక పరిస్థితులనూ, పౌరసంబంధాలనూ సమన్వయించగల కేంద్రం దేవాలయం. ఆ అర్చకుడు ఆ నగరానికి పాలకుడు. అది సహజమైన పరిణామం. ఎందుకంటే, మానవుణ్ణి సేద్యానికీ, స్థిరనివాసానికీ పురిగొల్పిన అంశాలు - సహజీవనం, సమృద్ధి, దేవుణ్ణి గురించి తలెత్తిన ఆలోచన. ఈ రూపంగా సంచార జీవితం నాటి ఆనవాయితీలకూ, సమిష్టి ఆలోచనలకూ శాశ్వతంగా తెర పడిపోయింది. నగరమూ, దానికి అనుబంధంగా ఉన్న కుగ్రామాలూ కలిసి ఒక ప్రామాణిక రాసి (యూనిట్). అర్చకుల నాయకత్వంలో ‘నగరపాలన’ ఏర్పడింది. మెసొపొటేమియా పీఠభూమి నిలువునా ఉనికిలోకి వచ్చిన వందలాది నగరాలన్నీ ఇదే మార్గాన్ని అనుసరించాయి. ఆ ఒక్క చోటునే కాదు, అనాది నాగరికతల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ‘నగర పాలికల’తోనే ఏలుబడి ప్రారంభమయింది. విడిగా బ్రతికే జంతువుకున్న స్వేచ్ఛ, ఉమ్మడిలో భాగంగా బ్రతికే జంతువుకు ఉండదు. కొన్ని నిబంధనలకు అలవాటు పడితే తప్ప సహజీవనం సాధ్యపడదు. అంటే, తన స్వేచ్ఛలో కొంతభాగాన్ని వదులుకునేందుకు సిద్ధపడితే తప్ప సాంఘిక జీవనం ప్రశాంతంగా సాగదు. సమాజం పెరిగేకొద్దీ నిబంధనల సంఖ్య అనివార్యంగా పెరుగుతుంది. హక్కులతోపాటు మోపెడన్ని బాధ్యతలు కూడా ప్రవేశిస్తాయి. అర్చకుల పాలనలో స్వేచ్ఛ ఎంత కుదించుకున్నా, హక్కులకు మాత్రం భంగం కలుగలేదు. ఎవరి ఇల్లు వాళ్లకు సొంతం; ఎవరి భూమి వాళ్లకు సొంతం; ఎవరి వ్యాపారం వాళ్లకు సొంతం. కాకపోతే, పాలనకయ్యే ఖర్చుకోసం చిన్న మోతాదులో శిస్తు చెల్లించాలి. ‘శిస్తు’ అనే విధానం పరిపాలనకు తోబుట్టువు. మెసొపొటేమియన్ పీఠభూమిలో నివసించిన నాగరికులను ‘సుమేరియన్’ జాతిగా పేరొచ్చింది. క్రీ.పూ.40వ శతాబ్దంలో మొలకెత్తిన ఆలయ పాలన దాదాపు 1000 సంవత్సరాలు సుమేరియన్లను నడిపించింది. అంతకుమించి నిలువలేక రాచరికాలకు తలుపులు తెరిచింది. విజ్ఞానం, దేవుని మీద ప్రజలకున్న విశ్వాసం అర్చకులకుండే బలం. ఆత్మరక్షణకు యుద్ధం ఆవశ్యకమైనప్పుడు ఒక్క పిలుపుతో పౌరులందరిని అర్చకులు కూడేయగలరు. కానీ, యుద్ధతంత్రంలో ప్రావీణ్యతలేని అర్చకుల నాయకత్వంలో జరిగే పోరాటం సారంలేని చెరుకుపిప్పి. పరిసరాల్లోని సంచారతెగలతో చేసుకున్న ఒప్పందాల కారణంగా, యుద్ధంతో అవసరం తీరిపోయిన తరువాతి కాలం అర్చకుడు ఆలయానికే అంకితమైన వ్యక్తిగా మారిపోయాడు. కౌమారంలో అర్చకుడిగా తన జీవితాన్ని ఆలయానికి చేర్చి, దానికి సంబంధించిన తర్ఫీదుమీదనే దృష్ట కేంద్రీకరించడంతో యుద్ధతంత్ర అతని పిడికిలినుండి జారిపోయింది. దేవతలూ, దేవాలయాల సంఖ్య పెరగడంతో, ప్రజల విశ్వాసం మరో దేవునివైపు మరలకుండా, సంపూర్ణంగా అది తన దేవునికే ఉండేలా చేసుకునే తహతహవల్ల అర్చక వర్గంలో విభేదాలు తలెత్తి, ఆ వర్గాన్ని ముక్కలకింద చీల్చేసింది. అర్చకుల ఈ బలహీనతను ఆధారం చేసుకుని కండబలం కలిగిన యోధులు పరిపాలనను హస్తగతం చేసుకున్నారు. దేవుళ్ళందరికీ సమాన గౌరవం ప్రకటించి, ఏయే అర్చకుణ్ణి ఆయా దేవాలయాలకు పరిమితం చేశారు. రచన: ఎం.వి.రమణారెడ్డి