breaking news
no religion
-
ఆహారానికి మతం లేదు
న్యూఢిల్లీ: ‘ఆహారానికి మతం లేదు. ఆహారమే ఓ మతం’ అన్న జొమాటో ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారి నెటిజన్ల మన్ననలు అందుకుంటోంది. ఈ కామెంట్ వైరల్ కావడం వెనుక పెద్ద కథే ఉంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన పండిత్ అమిత్ శుక్లా జొమాటోలో మంగళవారం ఆహారం ఆర్డర్ చేశాడు. ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి ముస్లిం కావడంతో డెలివరీ బాయ్‌ని మార్చాలని, లేదా ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే మత ప్రాతిపదికన ఆహారాన్ని అందించే వ్యక్తులను మార్చబోమంటూ జొమాటో బదులిచ్చింది. తనకు రిఫండ్ కూడా వద్దని కేవలం క్యాన్సిల్ చేయండి చాలు, మిగిలింది నేను లాయర్లతో చూసుకుంటానని అతడు బదులిచ్చాడు. దీంతో జొమాటో స్థాపకుడు దీపిందర్ గోయల్ రంగంలోకి దిగారు. ‘భారతదేశం, దేశంలోని వైవిధ్యమైన మా వినియోగదారులు, భాగస్వాములు మాకు గర్వకారణం. మా విలువల పరిరక్షణలో వ్యాపారం నష్టపోయినా బాధలేదు’ అని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారాన్నంతా అమిత్శుక్లానే స్క్రీన్షాట్లు తీసి మరీ ట్విట్ట ర్లో ఉంచాడు. దీంతో నెటిజన్లు శుక్లాను ఓ ఆటాడుకుంటున్నారు. తమరు ఆర్డర్ చేసిన ఫుడ్‌ను ముస్లిం తయారుచేయలేదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ఓ వ్యక్తి వ్యంగ్యంగా శుక్లాని విమర్శించారు. తమరు నడిపే వాహన ఇంధనం కూడా అక్కడి ముస్లిం ఇంధనమే (ఆ దేశాల నుంచే దిగుమతి అవుతోంది) అంటూ మరోవ్యక్తి ట్వీట్ చేశారు. ఈ తతంగమంతా చూసిన కొందరు అధి కారులు కూడా దీనిపై స్పందించారు. ‘కంపెనీని అభినందించేందుకు నాకో కారణం దొరికింది. యాప్‌ను ప్రేమిస్తున్నాను’ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ‘సెల్యూట్ దీపిందర్ గోయల్ ! అసలైన భారతీయుడివి నువ్వే.. నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని మాజీ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ అన్నారు. నేను పేదవాన్ని... ఏం చేయగలను ! ‘జరిగిన ఘటనతో నేనెంతో బాధపడ్డాను. కానీ ఏం చేయగలను, మేమంతా పేదవాళ్లం. బాధలు తప్పవు’ అంటూ అమిత్ శుక్లాకు ఆహారం డెలివరీ చేసేందుకు వెళ్లిన ఫయాజ్ అన్నారు. ‘ఆర్డర్ అందుకున్న తర్వాత లొకేషన్ కోసం ఆయనకు ఫోన్‌చేశాను. ఆర్డర్ కాన్సిల్ చేశాను అన్నాడు’ అని వివరించారు. -
ఆమెకు కులం, మతం లేదు!
పొద్దున లేస్తే చాలు కుల, మత, వర్గ రహిత సమాజం కావాలంటూ లెక్చర్లు దంచే ‘మహానుభావుల’ను చాలా మందినే చూస్తుంటాం. అందులో ఎంత మందికి నిజంగా సమసమాజ స్థాపన పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే తమిళనాడుకు చెందిన స్నేహ అనే న్యాయవాది మాత్రం ఇందుకు మినహాయింపు. మాటలకు పరిమితమై పోకుండా ఏళ్ల పాటు కృషి చేసి.. ‘నో కాస్ట్, నో రిలిజియన్’ సర్టిఫికెట్ సంపాదించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారామె. ఎవరి హక్కులనో ప్రశ్నించేందుకు తాను ఈ సర్టిఫికెట్ పొందలేదని.. భవిష్యత్ తరాలకు కుల, మత రహిత సమాజాన్ని అందించే మహత్కార్యంలో తనకున్న బాధ్యతను ఈ విధంగా నెరవేర్చుకున్నానన్న ఆమె వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయం. బుధవారం సాయంత్రం నుంచి స్నేహ (35), ఆమె భర్త పార్తీబ రాజా ఫోన్ మోగుతూనే ఉంది. కొందరు స్నేహకు శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం స్నేహలాగే తాము కూడా కుల, మతరహిత సమాజంలో భాగస్వామ్యం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ‘నో కాస్ట్, నో రిలిజియన్’ సర్టిఫికెట్ పొందాడానికి అనుసరించాల్సిన విధానాల గురించి అడుగుతూ సందేహాలు తీర్చుకుంటున్నారు. గర్వంగా ఉంది... ఈ విషయం గురించి స్నేహ మాట్లాడుతూ... ‘నా జీవితంలోని ముఖ్య లక్ష్యం ఒకటి నెరవేరింది. నా తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల ప్రభావంతో చిన్ననాటి నుంచే నాలో కుల, మతాలకతీతంగా ఉండాలనే కోరిక బలపడింది. అనేక అవాంతరాల అనంతరం ఈ రోజు నా చేతిలో నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ ఉంది. అలా అని నేను రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ విధానాన్ని సమర్థిస్తాను. వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందేందుకు ఇలాంటివి అవసరం. అయితే ఇందుకు కులమో, మతమో ప్రామాణికం కాకూడదు. ఈ సర్టిఫికెట్ పొందడం ద్వారా ఎవరి హక్కులను లాక్కోవడం లేదు. సమాజ శ్రేయస్సు కోసం, వివక్షకు గురవుతున్న వ్యక్తుల హక్కులను కాపాడాలని ప్రతీ ఒక్కరికీ విఙ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే 2017 నుంచి నాకు సానుకూలత లభించింది. ఇప్పుడు సర్టిఫికెట్ వచ్చింది. చాలా గర్వంగా ఉంది. కాస్ట్ సర్టిఫికెట్ ఫార్మాట్లోనే నా సర్టిఫికెట్ రూపొందించమని అడిగాను’ అని తిరుపత్తూరు తహశీల్దార్ టీఎస్ సత్యమూర్తి నుంచి నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ అందుకున్న స్నేహ తన ఉద్దేశాన్ని తెలియజేశారు. తండ్రి చూపిన బాటలో...భర్త ప్రోత్సాహంతో స్నేహ స్వస్థలం వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు. ఆమె తండ్రి కుల, మతాలకు వ్యతిరేకం. అందుకే తన ముగ్గురు కూతుళ్లకి స్నేహ, ముంతాజ్, జెన్నిఫర్ అనే పేర్లు పెట్టారు. తండ్రి ప్రభావంతో స్నేహ కూడా తన సంతానానికి వివిధ మతాచారాలకు సంబంధించిన పేర్లు పెట్టారు. ఈ విషయంలో స్నేహ భర్త పార్తీబ రాజా ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచారు. తన పెద్ద కుమార్తెకు ‘అధిరై నస్రీన్’ అనే బుద్ధిస్టు, ముస్లిం సంప్రదాయాల కలయికకు చెందిన పేరు పెట్టడం గురించి పార్తీబ రాజా మాట్లాడుతూ.. ‘ కుల, మత రహిత సమాజం గురించి ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకే మా కూతురికి ఈ పేరు పెట్టాం. తన పేరు వినగానే ప్రతీ ఒక్కరూ మీ అమ్మానాన్నలు ముస్లింలా అని అడుగుతారు. అప్పుడు మా కూతురు మా ఇద్దరి పేర్లు చెప్పడంతో పాటుగా తనకు ఆ పేరు పెట్టడానికి గల కారణాలు, తన పేరు వెనుక ఉన్న కథను వివరిస్తుంది. ఈ రకంగా వారికి అవగాహన కలుగుతుంది. ప్రసుతం స్నేహ నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ పొందడం ఒక సానుకూల దృక్పథానికి నాంది. ఈ విషయం గురించి చర్చ మొదలైంది. చాలా మంది తమకు కూడా ఇలాంటి సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారు. బహుశా దేశంలోనే ఇలాంటి సర్టిఫికెట్ పొందిన తొలి మహిళ తనేనేమో. ప్రస్తుతం ఆమె సోదరీమణులు కూడా తన బాటలోనే నడిచే ప్రయత్నం చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ప్రశంసల జల్లు నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ పొందడం ద్వారా స్నేహ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘భారతీయుల్లో నిగూఢంగా ఉండే కోరికను మీరు నెరవేర్చుకున్నారు. మనకు అనవసరమైన, సంబంధం లేని విషయాలను త్యజిద్దాం. కులాన్ని పక్కన పెట్టేద్దాం’ అంటూ లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, కమల్‌హాసన్ ట్వీట్ చేశారు. అదేవిధంగా సినీ నటుడు సత్యరాజ్, నటి, హక్కుల కార్యకర్త రోహిణి స్నేహను ప్రశంసించారు. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ Dear Sneha, You have actuated a long dormant desire among Indians. Let’s discard what never belonged to us. Let’s caste away Caste. From this point, a better tomorrow will be more accessible. Bravo daughter. Lead India forward. https://t.co/tdjngFiHWl — Kamal Haasan (@ikamalhaasan) February 13, 2019 -
అదానీ, అంబానీ కాంగ్రెస్‌కు మెహర్బానీలు
అదానీ, అంబానీలు కాంగ్రెస్‌కు మెహర్బానీలని, వారు కాంగ్రెస్ పాలనలోనే ఉద్భవించారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయాలని రాజవంశానికి సంబంధించినవి అంటారు కానీ అవి దుష్ట పాలిటిక్స్ అని విమర్శలు వర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలసీ విధానం ప్రకారం ప్రధాని ఎలా పరిపాలించాలో మేడమే నిర్ణయిస్తారని, కానీ బీజేపీ పాలనలో ప్రధాని అధ్యక్షతన టీమ్ నిర్ణయిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క అడుగు ముందుకు వేస్తే, మూడు అడుగులు వెనక్కి వేయాల్సిన భయానక పరిస్థితి నెలకొందన్నారు. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం జాతికి మొదటిస్థానం, తర్వాతనే పార్టీ అని పునరుద్ఘాటించారు. కేరళలోని కాలికట్‌లోని పబ్లిక్ ర్యాలీలో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఉడి ఘటన అనంతరం మొదటిసారి కేరళలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ ఈ మీటింగ్ నిర్వహిస్తోంది. తీవ్రవాదానికి ఎలాంటి మతం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కాని కొంతమంది ప్రజలు టెర్రరిజానికి మతం రంగు పూయాలని ప్రయత్నిస్తున్నారని సీరియస్ అయ్యారు. దీంతోనే ఈ ఘటనలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశాన్ని సమైక్యంగా, సమగ్రతగా ఉంచడంలో కేవలం బీజేపీనే సైద్ధాంతిక రాజకీయ పార్టీగా ఉందన్నారు.