breaking news
no loans
-
తాలిబన్ ప్రభుత్వానికి రుణాలివ్వం
వాషింగ్టన్/కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ప్రస్తుతం ఎలాంటి రుణాలు ఇవ్వబోమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా తేల్చిచెప్పేసింది. ఇతర ఆర్థికపరమైన వనరులు కూడా సమకూర్చే ప్రశ్నే లేదని ఐఎంఎఫ్ స్పష్టంచేసింది. ఈ మేరకు తాజాగా ఐఎంఎఫ్ ఒక ప్రకటన జారీ చేసింది. తాలిబన్ల పట్ల అంతర్జాతీయ సమాజం వైఖరికి అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. విదేశాల్లో రూ.66,600 కోట్లున్నాయి ప్రస్తుతం తమ దేశంలో నగదు నిల్వలు ఏవీ లేవని అఫ్గానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజ్మల్ అహ్మదీ చెప్పారు. అయితే విదేశాల్లో మాత్రం 9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.66,600 కోట్లు) ఉన్నాయని గవర్నర్ అజ్మల్ అహ్మదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. 9 బిలియన్ డాలర్లలో 7 బిలియన్ డాలర్లు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బాండ్లు, బంగారం, ఇతర ఆస్తుల రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు. తమ వద్ద అమెరికా డాలర్లు నిండుకున్నాయన్నారు. అఫ్గాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో విదేశాల నుంచి రావాల్సిన నగదు ఆగిపోయిందన్నారు. ఇక వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదన్నారు. అమెరికా డాలర్లు తగినన్ని లేకపోతే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని, ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, ఫలితంగా సామాన్యులకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అఫ్గాన్‌కు ఆయుధాల అమ్మకంపై నిషేధం తాలిబన్ల పునరాక్రమణ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి అన్ని రకాల ఆయుధాల విక్రయంపై అమెరికా సర్కారు నిషేధం విధించింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు చెందిన రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో డిఫెన్స్ కాంట్రాక్టర్లకు నోటీసు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న లేదా ఇంకా అందజేయని ఆయుధాల విషయంలో పునఃసమీక్ష నిర్వహించాలని సూచించింది. -
కౌలు..దిగాలు
ఏలూరు (మెట్రో) :కౌలు రైతులకు రుణాలు అందని ద్రాక్షగానే మారాయి. జిల్లాలో ఐదు లక్షల మందికి పైగా రైతులు ఉండగా, వారిలో 70 శాతం కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 3.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో 3.25 లక్షల మందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. వారిలో 70వేల మందికి రుణాలిచ్చామని బ్యాంకర్లు చెబుతున్నారు. అంటే 2.55 లక్షల మంది రుణాలకు దూర మయ్యారు. వ్యవసాయ రుణ ప్రణాళిక ప్రకారం ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.3,700 కోట్లను పంట రుణాలుగా ఇస్తామని బ్యాంకర్లు ప్రకటించారు. ఇందులో కౌలు రైతులకు ఇచ్చింది రూ.100 కోట్లు మాత్రమే. దీంతో వారెవరూ పంటకు బీమా చేయించుకోలేకపోయారు. కలెక్టర్ చీవాట్లు పెట్టినా బ్యాంకర్లలో మార్పు రావడం లేదు. రుణం అందలేదు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయా. అధిక వడ్డీలకు అప్పు తెచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాం. పంట పండి లాభం వస్తే అప్పులు తీరుస్తాం. లేదంటే వడ్డీలు కట్టుకోవడమే. – గురజాల బాలాజీ, కురెళ్లగూడెం సగం మందికైనా ఇవ్వలేదు జిల్లాలోని 70 శాతం భూముల్లో కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. వీరిలో సగం మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. కౌలుదారుల చట్టానికి తూట్లు పొడుస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. – కె.శ్రీనివాస్, కార్యదర్శి, జిల్లా కౌలు రైతుల సంఘం లక్ష్యానికి మించి రుణాలిచ్చాం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో లక్ష్యానికి మించి రుణాలిచ్చాం. వార్షిక ప్రణాళికతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తున్నాం. రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ఎటువంటి ఇబ్బందులూ పెట్టడం లేదు.– ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ – కె.శ్రీనివాస్, కార్యదర్శి, జిల్లా కౌలు రైతుల సంఘం లక్ష్యానికి మించి రుణాలిచ్చాం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో లక్ష్యానికి మించి రుణాలిచ్చాం. వార్షిక ప్రణాళికతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తున్నాం. రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ఎటువంటి ఇబ్బందులూ పెట్టడం లేదు.– ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్