breaking news
Nirmala Samant prabhavalkar
-
ఆదర్శమూర్తి ఈ అమ్మ..!
సాక్షి ముంబై: అమ్మ.. ఈ రెండక్షరాలను ఈ సృష్టిలో దేనితో పోల్చినా తక్కువే అవుతుంది. ప్రాణం పోయడంలో అమ్మ తర్వాతే ఎవరైనా. అది తన బిడ్డకైనా, ఇతరులకైనా ప్రాణం పోసేందుకు అమ్మ ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకే అమ్మను అమ్మతో మాత్రమే పోల్చగలమంటారు కవులు. అలాంటి అమ్మ మనసు ఎంత గొప్పదో చాటిచెప్పే ఓ ఘటన నగరంలో చోటుచేసుకుంది. తన బిడ్డ బతకదని తెలిసి, కనీసం ఆమె అవయవాలను ఇతరులకు దానం చేస్తేనైనా తన బిడ్డ ఉనికి మరికొన్ని కాలాలు ఈ భూమిపై ఉంటుందని భావించింది. గుండె నిబ్బరం చేసుకొని బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న తన బిడ్డ కాలేయాన్ని, మూత్రపిండాలను దానం చేసి ఇద్దరికి ప్రాణం పోసింది. వివరాల్లోకెళ్తే... ముంబై మాజీ మేయర్ నిర్మలా సావంత్ ప్రభావల్కర్ తన 18 ఏళ్ల కూతురు నీలిమకు తలనొప్పి రావడంతో బాంద్రాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జూన్ 6న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. తలనొప్పి తీవ్రం కావడంతోపాటు విరేచనాలు కూడా అవుతుండడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఆమె మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందని గుర్తించారు. చూస్తుండగానే ఆమె పరిస్థితి మరింత విషమించింది. మెదడు పనిచేయకపోవడంతో శరీరంలోని ఒక్కో అవయం పట్టును కోల్పోతూ నిర్జీవంగా మారడం మొదలైంది. దీంతో బ్రెయిన్ డెడ్‌గా వైద్యలు ధ్రువీకరించుకొని విషయాన్ని తల్లికి చెప్పారు. ఆమె శరీరం వైద్యానికి ఏమాత్రం సహకరించడంలేదని చెప్పిన వైద్యులు ‘క్లినికల్లీ డెడ్’గా ప్రకటించారు. 18 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అలా నిర్జీవంగా పడి ఉండడాన్ని చూడలేకపోయిన ఆ కన్నతల్లి గుండలవిసేలా విలపించింది. అంతలోనే తేరుకొని ఎలాగైనా తన కూతురు అస్థిత్వాన్ని కాపాడుకోవాలనుకుంది. అందుకు మార్గం ఆమె అవయవాలను దానం చేయడమేనని నిర్ణయించుకొని విషయాన్ని వైద్యులకు చెప్పింది. దీంతో కాలేయం, మూత్రపిండాలు అవసరమున్న బాధితులను గుర్తించిన వైద్యులు వెంటనే నీలిమ అవయవాలను వారికి అమర్చే ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్లుగానే అమర్చి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. లీలావతి ఆసుపత్రిలో 38 ఏళ్ల వ్యక్తికి కిడ్నీలను, ఠాణేలోని జుపిటర్ ఆసుపత్రిలోని ఓ వృద్ధుడికి కాలేయాన్ని అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడారు. తన బిడ్డ మరణిస్తూ కూడా ఇద్దరికి ప్రాణాలను కాపాడిందని ఆ తల్లి పలువురితో గర్వంగా చెప్పుకోవడం పలువురిని కదిలించింది. -
రంజిత్ సిన్హా ‘రేప్’ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చేసిన ‘రేప్’ కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. సీబీఐ చీఫ్ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆయన తన వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన కామెంట్లు వివాదాస్పదం కావడంతో రంజిత్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించడంపై మంగళవారం రంజిత్ సిన్హా స్పందిస్తూ.. ‘క్రీడల్లో బెట్టింగ్‌పై నిషేధాన్ని అమలు చేయలేకపోవడం ఎలాంటిదంటే రేప్‌ను నిరోధించలేకపోతే.. దానిని ఎంజాయ్ చేయండి అనడంలా ఉంటుంది’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తప్పుపట్టింది. సిన్హా వివరణ అందిన తర్వాత సీబీఐ డెరైక్టర్‌గా ఆయనను తప్పించాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి, ఇటువంటి బాధ్యాతారహితమైన ప్రకటన చేయడం తగదని ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు నిర్మలా సమంత్ ప్రభావాల్కర్ చెప్పారు. సున్నిత అంశాలపై పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సూచించారు. బీజేపీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, గడ్కారీ స్పం దిస్తూ సీబీఐ చీఫ్ వంటి అత్యుత్తమ పదవికి సిన్హా తగడని, ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.