breaking news
Nigerian army
-
సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ
నియామే: నైగర్‌లో సైనిక తిరుగుబాటును వ్యతిరేకించిన కారణంగా ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా ర్యాలీలు చేశారు సైనిక మద్దతుదారులు. దీంతో నైగర్‌లో ఉండే ఫ్రాన్స్ దేశస్తులకు హాని ఉందన్న కారణంతో వారిని వెంటనే వెనక్కు రప్పించనున్నట్లు తెలిపింది ఫ్రాన్స్ ఎంబసీ. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందిన నైగర్‌లో 2021లో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగాయి. అందులో అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ బజోమ్స్ పరిపాలనలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని సైన్యం ఆరోపిస్తూ ఆయనను గద్దె దించాలని నిర్ణయించుకుంది సైన్యం. ఇటీవలే ఆయను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించారు సైన్యాధ్యక్షుడు కల్నల్ మజ్ అమదౌ అబ్రందానే. నైగర్‌లో సైనిక తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసిన తర్వాత సైనిక చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫ్రాన్స్ దేశం సైనిక తిరుగుబాటును వ్యతిరేకించగా రష్యా సమర్ధించింది. ఈ నేపథ్యంలో నైగర్‌లో తిరుగుబాటు సైన్యానికి మద్దతుదారులు రష్యాకు జేజేలు పలుకుతూ ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో భారీగా ప్రదర్శన చేశారు. దీంతో ఫ్రాన్స్ దేశస్తులకు నైగర్‌లో ప్రమాదమని భావించి వారిని వెనక్కు రాపించే ప్రయత్నం చేస్తోంది ఫ్రాన్స్ ఎంబసీ. ఇది కూడా చదవండి: కెనడాలో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష.. -
రష్యా అధ్యక్షుడికి జేజేలు.. నైగర్‌లో భారీగా మద్దతుదారులు..
నియామే: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో సైనిక దళాలు తిరుగుబాటు చేసి ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ బజోమ్స్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సైనిక చర్యను ప్రాన్స్ తప్పుబట్టగా వాగ్నర్ దళాధిపతి ప్రిగోజిన్ మాత్రం మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు సైన్యానికి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ భారీ సంఖ్యలో మద్దతుదారులు రాజధానికి తరలి వచ్చారు. తిరుగుబాటు పర్వం.. కొద్దిరోజుల క్రితం నైగర్‌లో చోటుచేసుకున్న తిరుగుబాటు ఇరుగు పొరుగు దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. రెండేళ్ల క్రితం 2021లో నైగర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ బజోమ్స్ గెలిచారు. కానీ ఆయన పరిపాలనలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద ముఠాలు పేట్రేగుతున్నాయని, అతని చేతగానితనంతో ఫ్రాన్స్ మళ్ళీ తమ గడ్డమీద పాగా వేయాలని చూస్తున్న నేపథ్యంలో తిరుగుబాటు చేసి అధ్యక్షుడిని చెరలో బంధించామని కల్నల్ మజ్ అమదౌ అబ్రందానే తెలిపారు. దేశమంతటా కర్ఫ్యూ.. ఈ మేరకు ఒక వీడియోని విడుదల చేస్తూ.. దేశ సరిహద్దులను మూసి వేస్తున్నామని, ఇది మా దేశ అంతర్గత వ్యవహారమని ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని అన్నారు. మహమ్మద్ బజోమ్స్ ను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నామని ప్రకటిస్తూ దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు టీవీ ద్వారా సందేశమిచ్చారు. COUP D'ETAT IN NIGER - Group of soldiers appear on state TV - Announce President Bazoum has been removed - Order 7 pm-5 am nationwide curfew - Borders closed until further notice - Bazoum appears to have been detained - Niger is Western ally in fight against terror pic.twitter.com/iHJ3XbaF1s — BNO News (@BNONews) July 26, 2023 అమెరికా కంగారు.. తిరుగుబాటు తదనంతరం సైనిక చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించగా వారి గొంతు వెనుక స్వార్ధపూరిత కారణాలు కూడా లేకపోలేదంటున్నాయి నైగర్ సైనిక వర్గాలు. నైగర్‌లో అమెరికాకు రెండు డ్రోన్ స్థావరాలున్నాయని సుమారు 800 మంది వారి సైనికులు నైగర్ సైన్యానికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. జయహో పుతిన్.. ఇదిలా ఉండగా రష్యా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్‌గనీ ప్రిగోజిన్ నైగర్ సైన్యం తిరుగుబాటు సరైనదేనని మద్దతు తెలిపారు. దీంతో నైగర్ తిరుగుబాటు సైన్యానికి మద్దతుదారులు భారీగా రాజధాని నియామేకి తరలి వచ్చి ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ రష్యా జెండాలను ప్రదర్శించారు. అనుమానమే నిజమైంది.. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుండి నైగర్‌లో తిరుగుబాట్లు జరిగాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన తర్వాత తిరుగుబాటు జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడిగా మహమ్మద్ బజోమ్స్ ఎన్నికైన తర్వాత పలుమార్లు ప్రెసిడెన్షియల్ గార్డ్స్ బృందం నుండి తనకు ముప్పు ఉందని తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. చివరకు ఆయన అనుమానమే నిజమైంది. ఇది కూడా చదవండి: ఎత్తైన భవనంపై సాహాసం.. అంతలోనే పట్టుతప్పి.. -
ఉగ్రవాదులను ఉరికించి.. బందీలను విడిపించి..
అబుజా: నైజీరియా సైన్యాలు గొప్ప సాహసం చేశాయి. బొకోహారమ్ ఉగ్రవాదుల చెర నుంచి దాదాపు 61మంది బందీలను విడిపించాయి. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టాయి. చెర నుంచి విముక్తి అయినవారిలో మహిళలు, చిన్నపిల్లలు మాత్రమే అధికంగా ఉన్నారు. నైజీరియా సైన్యం యుద్ధ విమానాల ద్వారా ఈ చర్యను చేపట్టింది. ముందుగా ఆ జిహాదిస్టులు ఉన్న ప్రాంతాలను గుర్తించిన సైన్యం బందీలకు ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్తగా దాడులు నిర్వహించింది. అనంతరం ఆ ప్రాంతంలో దిగి నలుగురు ఉగ్రవాదులను హతం చేసింది. అక్కడే ఉన్న మరికొందరు ఉగ్రవాదులు పారిపోగా 61మందికి విముక్తి లభించినట్లయింది. ఇటీవల బొకో హారమ్ ఉగ్రవాదుల విషయంలో నైజీరియా బలగాలు తరుచుగా పై చేయి సాధిస్తున్నారు. గత అక్టోబర్ 28న కూడా 330 మంది బందీలను విముక్తి చేశారు. వీరిలో కూడా మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. బొకోహారమ్ ఉగ్రవాదులు ఎప్పుడు మహిళలను చిన్నారులను ఎక్కువగా ఎత్తుకెళుతుంటారు.